వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నాయ‌కుడు రేవంత్ రెడ్డిపై మ‌రో కుట్ర‌..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ నాయ‌కుడు రేవంత్ రెడ్డి పై మ‌రో అక్ర‌మ కేసు బ‌నాయించేందుకు రంగం సిద్దం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో ప‌ద‌వికోసం ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డికి అది ద‌క్క‌కుండా చేసేందుకు ఆధారాలు లేని కేసుల‌ను వెలుగులోకి తెస్తున్నారు ప్ర‌త్య‌ర్థులు. అదిష్టానం నుండి నేడో రేపో రేవంత్ రెడ్డికి ప‌ద‌వి ఖాయ‌మ‌ని తెలుసుకున్న కొంత‌మంది ఆయ‌న‌పై గ‌తంలో ఉన్న వివాదాల‌ను వెలికి తీసి అదిష్టానానికి పంపించి, త‌ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఒంట‌రిని చేయాల‌న్న‌ది రేవంత్ ప్ర‌త్య‌ర్థుల ప్ర‌ణాళిక‌గా తెలుస్తోంది. రేవంత్ కి ప‌ద‌వి ద‌క్క‌కుండా చేస్తే ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌కు ఒరిగేదేంటి..? తెలంగాణ‌లో రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయ‌డానికి గ‌ల కార‌ణాలేంటి..? రేవంత్ రెడ్డి పై కేసు బ‌నాయించేంద‌కు అక‌స్మాత్తుగా ఊడిప‌డ్డ రామారావు ఎవ‌రు..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

అక్ర‌మ కేసుల‌తో రేవంత్ రెడ్డి ప‌ద‌వికి ఎస‌రు పెట్టాల‌ని ప్ర‌త్య‌ర్థుల ప్ర‌ణాళిక‌..

అక్ర‌మ కేసుల‌తో రేవంత్ రెడ్డి ప‌ద‌వికి ఎస‌రు పెట్టాల‌ని ప్ర‌త్య‌ర్థుల ప్ర‌ణాళిక‌..

ఇమ్మ‌నేని రామారావు పెట్టిన కేసు విషయం గురించి ముందుగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. 2002 లో జూబ్లీ హిల్స్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ ఎగ్సిగ్యూటివ్ క‌మిటీ మెంబ‌ర్ గా ఉన్న రేవంత్ రెడ్డి 7 ప్లాట్లను అక్రమంగా అమ్మేశాడని ఆరోపణ చేయగా, కోర్టులో ఫైల్ మాయం చేశాడని మ‌రో ఆరోపణ చేశారు. రామారావు చెప్తున్న 7 ప్లాట్లు 1994 లో సొసైటీకి కేటాయించారు. అప్పుడు రేవంత్ రెడ్డికి ఆ సొసైటీతో ఎలాంటి సంబందం లేదు. 2002 లో సొసైటీకి చెందిన భూమిగా రిజిస్ట్రేషన్ అయ్యాయి. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి కేవలం ఎగ్జిక్యూటీవ్ మెంబెర్ గా మాత్రమే ఉన్నాడు. అసలు ఏ హౌసింగ్ సొసైటీలో అయినా అధికారం మొత్తం ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరరీ ల చేతిలోనే ఉంటుంది. ల్యాండ్ కు సంబంధించిన ఫైల్స్ ను మెంబెర్స్ చూసే అవ‌కాశం కూడా ఉండ‌దు. అలాంటప్పుడు ఒక ఈసీ మెంబెర్ గా ఉన్న రేవంత్ రెడ్డి 7 ప్లాట్లు ఎలా అమ్ముకున్నాడో రామారావే చెప్పాలి.

పాత కేసుల‌ను తోడుతున్న‌ప్ప‌టికి అవి నిల‌బ‌డే అవ‌కాశాలు త‌క్కువ‌..

పాత కేసుల‌ను తోడుతున్న‌ప్ప‌టికి అవి నిల‌బ‌డే అవ‌కాశాలు త‌క్కువ‌..

2002లో ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ, ట్రెజరరీ గా ఉన్న ముగ్గురు వ్యక్తులు అప్పటి సీఎంకు అత్యంత సన్నిహితులు. ఆ మాటకొస్తే.. ఇప్పటి తెలంగాణ సీఎం కు కూడా వాళ్ళు సన్నిహితులే. రామారావు చెప్తున్నట్లు ఈసీ మెంబెర్స్ తప్పు చేసార‌నుకుంటే రేవంత్ తో పాటు మిగ‌తా ఏడుగురు స‌భ్యుల ప‌రిస్థితి ఏంటి.? వాళ్ల పై రామారావు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. ఆ ఏడుగురిలో ఒకరు జయశ్రీ రెడ్డి.. ఈమె ప్రస్తుత మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి సొంత అక్క. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లో ఉంటారు. మరో ఇద్దరు ఇటిక్యాల విష్ణు రావు, జగ్గారావు. వీళ్ళు ఇద్దరు కేసీఆర్ కు దగ్గరి బంధువులు. మరి వీళ్ళపై ఎందుకు ఫిర్యాదు చేయ‌లేదో రామారావే చెప్పాలి. నిజంగా మెంబెర్స్ తప్పు చేసి ఉండి ఉంటే ఈ ముగ్గురు పైన కూడా ఫిర్యాదు చేయాలి. కాని రామారావు ఒక్క రేవంత్ పైనే పోలీసుల‌కు ఫిర్య‌దు చేయ‌డం విశేషం.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక్క‌డి పైనే ఎందుకంత క‌క్ష్య‌..!

తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక్క‌డి పైనే ఎందుకంత క‌క్ష్య‌..!

ఇక కోర్టులో ఫైల్ మాయం అవ్వడంపై ఫిర్యాదు చేసిన రామారావు హైకోర్టు లో పిటిషన్ వేశారు. దాంట్లో తాను మెట్రోపాలిటన్ కోర్టులో కేసు తాలూకా వివ‌రాలు కోర‌గా.. 10 సంవత్సరాలు దాటిన ఫైల్స్ డిస్ట్రాయ్ చేస్తామని మెట్రోపాలిటన్ కోర్టువారు తెలిపిన‌ట్టు హైకోర్టు కు తెలిపారు. తాజాగా రేవంత్ రెడ్డే ఆ పైల్ మాయం చేశాడని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసారు రామారావు.

రేవంత్ రెడ్డి ప్ర‌జా క్షేత్రంలోకి వ‌స్తే బ‌డా బాబుల ఆటల‌కు చెక్ ప‌డ్డ‌ట్టే...!!

రేవంత్ రెడ్డి ప్ర‌జా క్షేత్రంలోకి వ‌స్తే బ‌డా బాబుల ఆటల‌కు చెక్ ప‌డ్డ‌ట్టే...!!

ఇక రామారావు ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాడు అనేది చాలా ముఖ్యమైన విషయం. రేవంత్ రెడ్డి ప్రస్తుత అమెరికా ప‌ర్య‌ట‌న ముగిసాక మైహోం రామేశ్వర్ రావు అక్ర‌మాల‌ను వెలుగులోకి త‌చ్చేందుకు ఆధారాల‌తో రెఢీ అవుతున్నారు. వాటికి ముందస్తు కౌంటర్ గా రామారావును రెచ్చ‌గొట్టి రేవంత్ పై కేసు వేయించిన‌ట్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది. రేవంత్ కేసులో మ‌రో కోణం కూడా ఉంది. త్వరలో రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ పదవి ఖ‌రార‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ బాద్య‌త తీసుకుని రాష్ట్రం లో ప‌ర్య‌టిస్తే ప‌రిణామాలు ఎలా మారిపోతాయో తెలంగాణ లోని అదికార పార్టీ పెద్ద‌ల‌కు పూర్తిగా తెలుసు. రేవంత్ రెడ్డి కి ప‌ద‌వి రాకుండా నిలువ‌రించేందుకే త‌ప్పుడు కేసుల‌ను తెర‌పైకి తెస్తున్న‌ట్టు కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
fraud case filled against congress leader revanth reddy in the jubli hills police station. according to victim ramarao, in 2002 when revanth reddy was a member in the jubli hills co-operative housing board society. then some fraud done in plots sales. now the victim ramarao demanding action should be taken on revanth reddy. but total case includes conspiracy against revanth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X