• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమ్మాయితో గోరుముద్దలా..! అంత గోరోజనం ఎందుకు రాజయ్యా..?

|

జనగామ/హైదరాబాద్ : ప్రజా జీవితంలో ఉన్న రాజకీయనేతలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని అతిక్రమించి వ్యవహరిస్తే అసహ్యంగా పరిణమిస్తాయి. ప్రజలు సినిమా నటులు అన్నా, రాజకీయ నేతలు అన్నా కొంత అభిమానంతో వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్బాల్లో వారి అభిమానాన్ని చాటుకోవడానికి రకరకాల సర్కస్ స్కిట్ లను చేస్తుంటారు. వాటిని కొంతమంది నాయకులు. సినిమా స్టార్లు ముందస్తుంంగా గమనించి అభిమానులను సున్నితంగా నియంత్రిస్తుంటారు. అంతే కాకుండా వారి ఇష్టాలకు తలవంచితే నటుగురిలో అబాసు పాలు కాక తప్పదు. కొన్ని సందర్బాల్లో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చే ప్రమాదం లేక పోలేదు.

రాజయ్యా.. ఏందయ్యా అది..?

రాజయ్యా.. ఏందయ్యా అది..?

తెలంగాణ మాజీ వివాదాల మంత్రి తాటికొండ రాజయ్మ ఇటీవల చేసిన చేసిన ఓ ఘనకార్యం ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పదవ తరగతి చదువుతున్న అమ్మాయి అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాల్సింది పోయి అమె చేత్తో గోరుముద్దలు పెట్టించుకున్న వైనం అందరి చేత ఛీ కొట్టిస్తోంది. ఎంత ప్రజా ప్రతినిధి ఐతే మాత్రం ఓ అమ్మాయితో ప్రజల సమక్షంలో అన్నం తినిపించుకోవడం ఏంటనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పక్కన వీడియో తీస్తున్నరనే అంశాన్ని కూడా పట్టించుకోకుండా ముద్ద ముద్ద పెట్టించుకోవడం పట్ల ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 అన్నం తినిపిస్తున్న అమ్మాయి..

అన్నం తినిపిస్తున్న అమ్మాయి..

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. వివాదాలకు నిలయంగా మారిన రాజయ్య రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగారో వివాదాల కారణంగా అంతే వేగంగా బొక్కబోర్లా పడి పోయారు. తాజాగా ఆయన ఓ పదో తరగతి విద్యార్థినితో గోరు ముద్దలు తినిపించుకుంటున్న దృశ్యం బయటపడడంతో ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ పూర్ నియోజకవర్గంలోని చిలుపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు.

 ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు కొన్ని పరిమితులుంటాయి..

ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు కొన్ని పరిమితులుంటాయి..

ఈ సంద‌ర్భంగా పదో తరగతి విద్యార్ధిని అన్నం తినిపిస్తే ఎమ్మెల్యే రాజయ్య ఎంచక్కా ముద్దలు పెట్టించుకుని గుటుక్కున మింగుతున్నారు. ప్రధానోపాధ్యాయుడి అభినందన సభలో టెన్త్‌ విద్యార్ధిని బాగా ప్రసంగించిందని ఎమ్మెల్యే రాజయ్య ప్రశంసలతో ముంచెత్తడంతో పాటు ఆ విద్యార్ధినిని తనకు అన్నం తినిపించాలని ఎమ్మెల్యే రాజయ్య కోరినట్టుగా సోషల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజయ్య మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అంకుల్ మీకు నేనే భోజనం తినిపిస్తానని ఆ విద్యార్దిని కోరడంతో అంగీకరించానని ఆయన వివరణ ఇస్తున్నారు. కానీ, అక్కడున్నవారు మాత్రం ఆయనే బలవంతం చేశారని చెబుతున్నారు.

వివాదాలు కొత్త కాదు..

వివాదాలు కొత్త కాదు..

అంతే కాకుండా రాజయ్య ఆమ‌ధ్య ఓ మ‌హిళ‌తో ఫోన్లో జరిపిన సెక్సీ సంభాషణల ఆడియో టేపులు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలా పదో తరగతి విద్యార్ధినితో ఎమ్మెల్యే రాజయ్య గోరుముద్దలు తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన అనుచరులు మాత్రం రాజయ్య సంగతి తెలిసిందే కదా అంటూ ఆయన తీరు ఇలాగే ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. మొత్తానిక ఓ ప్రజాప్రతినిదిగా రాజయ్య పబ్లిగ్గా చేసిన పని అసహ్యంగా ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రజా జీవతంలో ఉన్నప్పుడు, ప్రజల మద్యకు వస్తున్నప్పుడు పరిమితులు తెలియకపోతే రాజయ్య లాగే అవమానాలపాలు కావడమే కాకుండా, ప్రజాగ్రహానికి గురికాక తప్పదనే అంశం స్పష్టమవుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The MLA Rajaiah has been praised for the good of the tenth student in the headmaster's congratulatory function. And the student has been asked by the MLA Rajaiah to feed the Rice. This became viral In the Social Media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more