హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో మరో కరోనా మరణం: ఆ రెండు కుటుంబాల్లోనే 11 కేసులు నమోదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం కరోనా మహమ్మారి బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు(65) మరణించాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 15కు చేరింది.

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..

వికారాబాద్ పట్టణానికి చెందిన ఈ వృద్ధుడు ఇటీవల కరోనావైరస్ బారినపడ్డాడు. శుక్రవారం అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీకి తరలించే సమయానికి అతని పరిస్థితి విషమంగా ఉండగా.. ఆదివారం చికిత్స పొందుతూ మరణించాడు.
బాధితుడికి శ్వాస సంబంధమైన వ్యాధి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుడిని బతికించేందుకు తాము శాయశక్తులా ప్రయత్నించామని చెప్పారు.

ఆ రెండు కుటుంబాల్లో 11 కేసులు

ఆ రెండు కుటుంబాల్లో 11 కేసులు

కాగా, వికారాబాద్ జిల్లాలో ఆదివారం ఒక్క రోజే 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ 11 మంది కూడా రెండు కుటుంబాలవారే కావడం గమనార్హం. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు వారి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు.

Recommended Video

Corona Hotspots Under Strict Vigilance : What's Allowed, What's Prohibited..!
దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు..

దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు..

రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో 503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా 16 కేసులు నమోదు కాగా, రెండు మరణాలు సంభవించాయి. శనివారం 51 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 393 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారితోనే ఇటు తెలంగాణలోనూ.. అటూ దేశ వ్యాప్తంగానూ కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. ఇక, దేశంలో ఇప్పటి వరకు 8356 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 273కు చేరుకుంది. 716 మంది డిశ్చార్జ్ అయ్యారు.

English summary
one more coronavirus death in telangana: 11 new cases in vikarabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X