హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ లింకులు: పవన్ కోసం గాలింపు, నవ్యంత్ ఫోన్‌లో సినీ ప్రముఖుల నంబర్స్?

గతంలో అరెస్టయిన ఆరుగురు నైజీరియన్ ముఠాను నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా.. రెండు రోజుల క్రితం అజా గాబ్రియల్ ఒగొబొన్నాను అదుపులోకి తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధానిలో డ్రగ్స్ మూలాలు బయటపడుతూనే ఉన్నాయి. కెల్విన్‌తో సంబంధాలున్న నలుగురు వ్యక్తుల ముఠాను తాజాగా అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఆసక్తికర విషయాలు రాబట్టారు. స్వాతంత్ర్య దినోత్సవమైన అగస్టు 15న కెల్విన్ భారీ రేవ్ పార్టీకి ప్లాన్ చేశాడని, ఇందులో భారీగా డ్రగ్స్ విక్రయించాలని సమాచారం అందించినట్లుగా నిందితులు వెల్లడించారు.

భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు: నైజీరియన్‌తోపాటు ముగ్గురి అరెస్ట్, 'రేవ్‌పార్టీలు'భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు: నైజీరియన్‌తోపాటు ముగ్గురి అరెస్ట్, 'రేవ్‌పార్టీలు'

గతంలో విజయవాడకు చెందిన సంగీత అనే ఓ యువతి సహా ఆరుగురు నైజీరియన్ వ్యక్తుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా.. రెండు రోజుల క్రితం అజా గాబ్రియల్ ఒగొబొన్నాను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు నవ్యంత్, అంకిత్ పాండే, గణత్ కుమార్ రెడ్డిలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.

ఎవరీ సంగీత?: నైజీరియన్లతో లింకులు.. డ్రగ్స్ కేసులో కీలకంగా!ఎవరీ సంగీత?: నైజీరియన్లతో లింకులు.. డ్రగ్స్ కేసులో కీలకంగా!

భారీగా డ్రగ్స్:

భారీగా డ్రగ్స్:

సోమవారం పట్టుబడ్డ ముగ్గురి నుంచి పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.10లక్షల విలువైన 450ఆంఫెటమైన్ ట్యాబ్లెట్స్, 45గ్రాముల ఎమ్‌డీఎమ్ఏ, 60ఎల్ఎస్‌డీ ప్యాకెట్లు, 0.5గ్రాముల కొకైన్, 0.35గ్రాముల చంగా, 60గ్రాముల గంజా, ఒక పాస్ పోర్టు, ఆరు ల్యాప్ టాప్‌లు, రూ.40వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు.

Recommended Video

Anchors Names Out In Tollywood Drug Scandal
ప్రేయసి ఇంట్లో గాబ్రియల్‌కు వల:

ప్రేయసి ఇంట్లో గాబ్రియల్‌కు వల:

విజయవాడకు చెందిన సంగీత, నైజీరియన్ ఒజుకు కాస్మోకు ముఠా ఇచ్చిన సమాచారంతో రాచకొండ పోలీసులు అజా గాబ్రియల్ పై నిఘా పెట్టారు. ఈ ముఠాను జులై23న పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా.. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి గాబ్రియల్ నగరంలో విక్రయిస్తున్నట్లుగా విచారణలో నిందితులు వెల్లడించారు. దీంతో గాబ్రియల్‌పై నిఘా పెట్టిన పోలీసులు.. యాప్రాల్ లోని అతని ప్రేయసి ఉంటున్న గ్రీన్ వుడ్ రెసిడెన్సీలో అతన్ని పట్టుకున్నారు.

పవన్ కోసం గాలింపు:

పవన్ కోసం గాలింపు:

జులై 23న అరెస్టయిన నిందితులు వెల్లడించిన వివరాల మేరకు.. నగరంలోని ఆరుగురు వ్యక్తులకు వారు డ్రగ్స్ విక్రయించినట్లుగా పోలీసులు నిర్దారించుకున్నారు. దీంతో ఆ ఆరుగురి రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించగా.. వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది.

అంతేకాదు, అందులో ఒకరైన పవన్ కుమార్ రెడ్డిని డ్రగ్స్ పెడ్లర్ గా పోలీసులు గుర్తించారు. తొలుత అతన్ని విచారించి వదిలేసిన పోలీసులు.. తాజాగా అతను పెడ్లర్ అని తేలడంతో.. మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. కేసును చేధించిన ఎస్.వో.టి ఇన్ స్పెక్టర్స్ వెంకటేశ్వర్లు, నవీన్ కుమార్ లతో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో సన్మానించారు.

జమ్మికుంట వాసి నవ్యంత్:

జమ్మికుంట వాసి నవ్యంత్:

తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురి ముఠాలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన నవ్యంత్ అనే ఇంజనీరింగ్ డ్రాపౌట్ కూడా ఉన్నాడు. నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే ఇతను డ్రగ్స్ కు బానిసయ్యాడు. దీంతో ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేశాడు.

తరుచుగా పబ్ లకు వెళ్లే అలవాటున్న నవ్యంత్ కు.. అదే సమయంలో డీజే అంకిత్ పాండే పరిచయమయ్యాడు. అతని ద్వారా గాబ్రియెల్‌తో స్నేహం చేశాడు. థాయిలాండ్ ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేశాడు. అగస్టు 15న గోవాలో పెద్ద రేవ్ పార్టీ నిర్వహిస్తున్నామని, రావాలని నవ్యంత్‌కు కెల్విన్ సమాచారమిచ్చాడు.

ఇంతలో కెల్విన్ పోలీసులకు చిక్కడంతో నవ్యంత్ గోవా పారిపోయాడు. అక్కడి నుంచే హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అతన్ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నవ్యంత్ ఫోన్‌లో 50మంది మహిళల నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అందులో సినీ ప్రముఖులు, బడావ్యాపారవేత్తలు కూడా ఉన్నారు.

English summary
Hyderabad continues to be rocked by the activities of drug mafia as the police busted one more Nigerian-led gang involved in the supply of narcotics for rave parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X