వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్... ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేటీఆర్‌తో భేటీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి చేరగా తాజాగా రంగారెడ్డి జిల్లా తాండురు నియోజకవర్గం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అయన పార్టీలో చేరేందుకు ఇదివరకే టీఆర్ఎస్ పార్టీతో చర్చలు జరిపారు.

కాగా ఆయన అధికారికంగా టీఆర్ఎస్‌లో ప్రకటించనప్పటికి నేడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇస్తున్న లంచ్ కార్యాక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గోన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టు కనిపిస్తుంది. కాగా కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసే ప్రక్రయలో భాగంగా రోహిత్ రెడ్డితో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపారు.

one more telangana congress mla joined in trs party.

ఇక ఇప్పటి వరకు చేరిన ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాకు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ,పాలేరు నుండి ఉపేందర్ రెడ్డి ,కొత్తగూడేం నుండి వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లందు నుండి హరిప్రియా నాయక్,ఆసీఫాబాద్ నుండి ఆత్రం సక్కు, నల్గోండ జిల్లా నకిరేకల్ నుండి చిరుమర్తి లింగయ్య ,మహెశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ,, ఎల్బీనగర్ నుండి సుధీర్ రెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి జాజుల సురేందర్ , కోల్లాపూర్ నుండి హర్షవర్థన్ రెడ్డి, తాజాగా మాజీ మంత్రి మహెందర్ రెడ్డిపై గెలిచిన తాండుర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలు ఉన్నారు. వీరితో మొత్తం టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 12 చేరింది. ఇక గెలిచిన మొత్తం పందోమ్మిది మందిలో పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేశారు.

English summary
one more telangana congress mla joined in trs party. pilot rohit reddy met with ktr who won the tandur constituency of ranga reddy district. total 12 congress mla's have joined including rohit reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X