వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ‌లో ఒకే ఒక్క‌డు.. అధికార పార్టీ ల‌క్ష్యం అత‌డే..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ నాయ‌కుడు రేవంత్ రెడ్డి పై మ‌రో అక్ర‌మ కేసు బ‌నాయించేందుకు రంగం సిద్దం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ‌లో అత‌ని ప్ర‌సంగాల కోసం జ‌నం ఎగ‌బ‌డుతుంటారు. అత‌ని తూటాల్లాంటి మాట‌ల‌కు కేరింత‌లు కొడ‌తారు. అదికార పార్టీ విధాన‌ల‌ను ఎండ‌గ‌డుతున్న‌ప్పుడు ఈల‌లు, చ‌ప్ప‌ట్ల‌తో జ‌నం పుల‌కించిపోతారు. నిర్బ‌యంగా ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్ప‌డం ఆయ‌న నైజం.! సూటిగా స్ప‌ష్టంగా విశ్లేషించ‌డ‌మే ఆయ‌న వైనం.!! తెలంగాణ‌లో అదికార పార్టీలోని నాయ‌కుల‌కు ధీటుగా స‌మాధానం చెప్పే నేత‌గా ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో ముద్ర‌వేసుకున్న ఆ నాయ‌కుడే రేవంత్ రెడ్డి. కాంగ్రేస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న రేవంత్ రెడ్డికి ప‌ద‌వి వ‌రిస్తే ఆయ‌న‌ను నిలువ‌రించ‌డం అసాద్య‌మ‌ని భావిస్తున్న కొన్ని పార్టీలు త‌న‌కు ప‌ద‌వి రాకుంగా అడ్డుకునేంద‌కు అనేక స‌హసాలు చేస్తున్నాయి. మ‌రి రేవంత్ రెడ్డి ప్ర‌స్థానాన్ని అడ్డుకునేందుకు ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న ప‌న్నాగాలు ఫ‌లిస్తాయా..? తెలుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

రేవంత్ రెడ్డి ప్ర‌త్య‌ర్థుల‌ ఉచ్చులో ఇరుక్కుంటాడా..? ఉప్పెనై చెల‌రేగిపోతాడా..??

రేవంత్ రెడ్డి ప్ర‌త్య‌ర్థుల‌ ఉచ్చులో ఇరుక్కుంటాడా..? ఉప్పెనై చెల‌రేగిపోతాడా..??

కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఈ మధ్య కొత్త కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. సడన్ గా ఎందుకు ఈ కేసులు తెర‌మీద‌కు వ‌స్తున్నాయ‌ని రేవంత్ వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతోంది. బినామీ వ్యాపారాలు అంటూ, ప్లాట్ల గోల్ మాల్ అంటూ, పోలీసు స్టేషన్లలో కేసుల నమోదు సాగుతోంది. అయితే సడన్ గా ఈ కేసులు ఎందుకు వెలుగులోకి వ‌స్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ‘కీలక పదవి' రాకుండా అడ్డుకునేందుకే అని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరే సమయంలోనే రేవంత్ రెడ్డికి ‘ప్రచార కమిటీ ఛైర్మన్' వంటి కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

కొత్త కేసుల‌తో రేవంత్ రెడ్డికి ప‌ద‌వి ద‌క్క‌కుండా చేయాల‌నేదే ఆక్ష‌న్ ప్లాన్..!

కొత్త కేసుల‌తో రేవంత్ రెడ్డికి ప‌ద‌వి ద‌క్క‌కుండా చేయాల‌నేదే ఆక్ష‌న్ ప్లాన్..!

టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇంతటి కీలక పదవి ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ లోనే సహజంగా వ్యతిరేకత వ్యక్తం అయింది.
అప్పటి నుంచి ఈ పదవి పెండింగ్ లో పడిపోయింది. ఇప్పుడు కొత్తగా ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని ఒక్క రేవంత్ రెడ్డికే కాకుండా, మరికొంత మందికి కూడా ఇవ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను రేవంత్ రెడ్డి వ్యతిరేకించినట్లు సమాచారం. అందుకే ఈ ప్ర‌పోస‌ల్ కూడా ప్రస్తుతం పెండింగ్ లో పడిపోయిందని, ఈ తరుణంలో కొత్త కేసులను తెరపైకి తీసుకొస్తే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆత్మరక్షణలో పడేయవచ్చనే ఆలోచ‌న‌తో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అదికార పార్టీ కి ధీటైన స‌మాధానం ఇవ్వ‌గ‌లిగేది ఒక్క రేవంత్ రెడ్డే.. క‌ట్ట‌డి చేసే దిశ‌గా కుయుక్తులు..

అదికార పార్టీ కి ధీటైన స‌మాధానం ఇవ్వ‌గ‌లిగేది ఒక్క రేవంత్ రెడ్డే.. క‌ట్ట‌డి చేసే దిశ‌గా కుయుక్తులు..

టీఆర్ఎస్ లో మాటలతో గారడీ చేయగల నేతలు చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి కెటీఆర్, హరీష్ రావువంటి వాళ్ళు శక్తివంతంగా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లగలరు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఉన్నంతలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అగ్రనేతలకు ధీటుగా నిలబడగలరు. అయితే ఎలాగైనా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో కీలక పదవి రాకుండా చేసేందుకు అధికార పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోందని, దీని ద్వారా ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ ను ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలనేది వీరి వ్యూహంగా తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేత‌ల అభ్యంత‌రాల‌ను అదిగ‌మించగ‌ట‌డా అన్న‌దే సందేహం..!

రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేత‌ల అభ్యంత‌రాల‌ను అదిగ‌మించగ‌ట‌డా అన్న‌దే సందేహం..!

ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇద్దరూ ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించలేరు. ఇక జానారెడ్డి అయితే కీలక సమయంలో ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేసి సొంత పార్టీనే ఇరకాటంలో పెట్టిన సంద‌ర్బాలు ఉన్నాయి. ఈ తరుణంలో స్ప‌ష్టంగా, సూటిగా, సమర్థవంతంగా ప్రభుత్వ వ్యతిరేక వాదనను విన్పించే రేవంత్ రెడ్డికి బ్రేకులు వేయగలిగితే చాలా వరకూ తమ పని సులభం అవుతుందనే యోచనలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ లో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి టీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా.. బెడిసికొడ‌తాయా చూడాలి.

English summary
fraud case filed against congress leader revanth reddy in the jubli hills police station. ruling trs party also trying to drag back revanth reddy. ruling party ensiring if revanth reddy goes into public the negative opinion will create in the people. so trs leaders trying to stop revanth reddy's portfolio in the congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X