రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరువు తీసిన ఆన్‌లైన్ యాప్ అప్పులు: బలవన్మరణానికి పాల్పడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆన్‌లైన్ యాప్‌లో అప్పు చేసి తిరిగి చెల్లించలేక.. సంస్థ నుంచి వేధింపులు భరించలేక ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Recommended Video

హైదరాబాద్: లోన్ యాప్ వేధింపులకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బలి
కరోనా కారణంగా ఉద్యోగం పోయింది..

కరోనా కారణంగా ఉద్యోగం పోయింది..

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సునీల్(29) హైదరాబాద్ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య, ఆరు నెలల కూతురుతో కలిసి రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో నివసిస్తున్నాడు. కాగా, కరోనా పరిణామాల నేపథ్యంలో సునీల్ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.

ఆన్‌లైన్ యాప్‌ల్లో అప్పులు

ఆన్‌లైన్ యాప్‌ల్లో అప్పులు

ఈ క్రమంలో సునీల్ పలు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా మొత్తం రూ. 50 వేలు అప్పు చేశాడు. 30 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు ఇటీవల అతడిపై తీవ్ర ఒత్తిడి చేశాడు. కాగా, సునీల్ కు ఈ అప్పులతోపాటు వ్యక్తిగతంగా మరో రూ. 6 లక్షల అప్పు కూడా ఉంది. అయితే, మూడు నెలల క్రితం స్వగ్రామంలోని భూమిని విక్రయించి అతని తల్లిదండ్రులు ఆ అప్పును చెల్లించారు. ఆ తర్వాత సునీల్‌కు తండ్రి వెంకటరమణ మరో రూ. లక్ష కూడా ఇచ్చారు.

ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఆ ఉద్యోగం మరొకరికి ఇవ్వండి..

ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఆ ఉద్యోగం మరొకరికి ఇవ్వండి..

అయితే, ఆన్‌లైన్ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తీవ్రమవడంతో పది రోజుల క్రితం సునీల్ సైబర్ క్రైంకు ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించగా.. అతడు వెళ్లలేదు. మరోవైపు అతడికి మూడు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో రూ. 7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. బుధవారం మధ్యాహ్నం కంపెనీ నిర్వాహకులు ఫోన్ చేయగా.. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆ ఉద్యోగం మరొకరికి ఇవ్వండి' అని చెప్పిన సునీల్.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

పరువు తీసేలా ఆన్‌లైన్ యాప్‌ల వ్యవహారం...

పరువు తీసేలా ఆన్‌లైన్ యాప్‌ల వ్యవహారం...

ఆన్‌లైన్‌లో అప్పులు ఇచ్చిన యాప్‌ల నిర్వాహకులు సునీల్ ఫోన్ డేటాను హ్యాక్ చేసి..
అతడి స్నేహితులు, బంధువులకు ‘సునీల్ డిఫాల్టర్' అంటూ అతడి ఫొటోతో మెసేజ్‌లు పంపారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సునీల్ బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి భోజనానికి పిలిచేందుకు భార్య అతని గదికి వెళ్లగా అప్పటికే అతడు విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. గురువారం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అతని మృతదేహాన్ని అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఓ ఉద్యోగిని కూడా ఈ ఆన్‌లైన్ యాప్ అప్పుల ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.

English summary
Online app loans: A software engineer commits suicide.1
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X