వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పచ్చి మోసం : ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా! దీనిపై ఓ లుక్కేయండి

|
Google Oneindia TeluguNews

జమ్మికుంట : ఆన్ లైన్ విస్తృతి పెరిగి.. ప్రతీది డెస్క్ టాప్ ముంగిట్లో వాలిపోయాక షాపింగ్ కూడా ఇంట్లో టీవి చూస్తూ చేస్తోన్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో మోసాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అన్నిసార్లు ఆన్ లైన్ కంపెనీలు విశ్వసనీయంగా వ్యవహరించట్లేదనే దానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ.

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన మామిడాల శ్రీధర్ అనే వ్యక్తి తమ ఫ్యామిలీ కోసం రూ.34వేల విలువ చేసే హెచ్.పీ ల్యాప్ టాప్ బుక్ చేశాడు. స్నాప్ డీల్ సంస్థ వారు దసరా రోజు ల్యాప్ టాప్ ను డెలివరీ చేయడంతో.. ఆతృతతో ప్యాక్ ను ఓపెన్ చేశారు శ్రీధర్ కుటుంబ సభ్యులు. తీరా ప్యాక్ లోపల చూస్తే.. అంతా షాక్. లోపల ల్యాప్ టాప్ కు బదులు ఓ చెక్కను ప్యాక్ చేసి పంపించారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న శ్రీధర్.. డెలివరీ బాయ్ కు ఫోన్ చేయగా.. తనకేమి తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.

online cheating found in jammikunta

దీంతో విషయాన్ని స్నాప్ డీల్ సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు శ్రీధర్. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు.

English summary
Mamidala Sridhar who is living in jammikunta in karimngar district was booked a laptop through snap deal. But in delivery instead of laptop he got a plywood
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X