• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డేటింగ్‌కు అమ్మాయిలను పంపిస్తామంటూ: 400 ఉద్యోగులతో, పోలీసులే అవాక్కు

|

హైదరాబాద్: డబ్బులు ఇస్తే మీరు కోరుకున్న అమ్మాయిని సరఫరా చేస్తామని చెబుతూ మోసాలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. ఈ ముఠా గత రెండేళ్లుగా ఈ తరహా మోసాలకు పాల్పడుతూ రూ.కోట్లు దోచుకుంది.

హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్ డేటింగ్ సైట్లో పేరు నమోదు చేసుకున్నాడు. మే 25వ తేదీన రియా అనే యువతి నుంచి అతనికి ఫోన్ వచ్చింది. మెంబర్‌షిప్ స్థాయిని బట్టి అమ్మాయిలను సరఫరా చేస్తామని చెప్పింది. సభ్యత్వం కోసం రూ.1080 మొదట చెల్లించాలని చెప్పింది. దీంతో అతను ఆ మొత్తం జమ చేశాడు.

డబ్బు వసూళ్లు, ఫోన్ స్విచ్చాఫ్

డబ్బు వసూళ్లు, ఫోన్ స్విచ్చాఫ్

అప్పటి నుంచి మరిన్ని వసూళ్లకు పాల్పడింది ఆ ముఠా. క్లబ్ లైసెన్స్ పేరిట రూ.15,600, రిజిస్ట్రేషన్ పేరిట రూ.27,600, లైసెన్స్ ఫీజు పేరిట రూ.37,700, సర్వీస్ చార్జ్ పేరిట రూ.50వేలు, జీఎస్టీ పేరిట రూ.87వేలకు పైగా తీసుకున్నారు. వ్యక్తిగత వివరాల విచారణ కోసం రూ.నాలుగున్నర లక్షలు సూచించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. చివరిసారి మరో రూ.4 లక్షలు జమ చేశాక.. అప్పటి వరకు ఫోన్ చేసిన రియా ఫోన్ స్విచ్చాఫ్ రావడం మొదలైంది. దీంతో జూలై 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని నుంచి రూ.15 లక్షలకు పైగా వసూలు చేశారు.

డేటింగ్‌కు అమ్మాయిల్ని సరఫరా చేస్తామని

డేటింగ్‌కు అమ్మాయిల్ని సరఫరా చేస్తామని


డేటింగ్‌కు అమ్మాయిలను సరఫరా చేస్తామని చెబుతూ వారు పశ్చిమ బెంగాల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 20 కాల్ సెంటర్లు, 400 మంది ఉద్యోగులతో ఈ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా రూ.కోట్లలో వసూళ్లు చేసినట్లుగా గుర్తించారు. ఇందులో భాగంగా హైదరాబాదుకు చెందిన సదరు బాధితుడి నుంచి రూ.15 లక్షలకు పైగా వసూలు చేశారు.

కీలక సూత్రధారి

కీలక సూత్రధారి

హైదరాబాద్ యువకుడి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. బ్యాంకు అకౌంట్లు, సాంకేతిక ఆధారాలతో విచారణ జరిపారు. పశ్చిమ బెంగాల్ నుంచి కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించారు. అక్కడ దాడులు నిర్వహించి ముఠా గుట్టు రట్టు చేసింది. ముఠాకు కీలక సూత్రధారిని దేబాశిష్‌గా గుర్తించారు. అతను ఫైజుల్ హక్‌తో కలిసి ఎస్కార్ట్ సర్వీసెస్ వ్యాపారాన్ని ప్రారంభించాడని గుర్తించారు.

పోలీసులే అవాక్కయ్యారు

పోలీసులే అవాక్కయ్యారు

వీరి నేతృత్వంలో సిలిగురిలో 12, కోల్‌కతాలో 8 కాల్ సెంటర్లు ప్రారంభించారు. సిలిగురిలో కాల్ సెంటర్‌ను ఫైజుల్ హక్ నిర్వహిస్తున్నాడు. తనీషా అనే యువతి టెలీ కాలర్లను ఎంపిక చేసే హెచ్ఆర్ విభాగం మేనేజర్‌గా పని చేస్తోంది. ఒక్కో కాల్ సెంటర్లో 20 మంది చొప్పును మొత్తం 20 కాల్ సెంటర్లలో 400 మంది వరకు ఉద్యోగులు ఉన్నారని గుర్తించారు. దీంతో పోలీసులే అవాక్కయ్యారు.

టెలీకాలర్లను అలా తీసుకొని, ఇలా వాడుకుంటారు

టెలీకాలర్లను అలా తీసుకొని, ఇలా వాడుకుంటారు


టెలీకాలర్లుగా ఇక్కడకు అమ్మాయిలు వచ్చేందుకు ఇష్టపడరు. కాబట్టి ఆయుర్వేదం, ఎరువుల సంస్థల పేరిట కార్యాలయాలను ఏర్పాటు చేసి.. ఆ పేరుతో టెలీకాలర్లను తీసుకొని, ఆ తర్వాత ఇలా అబ్బాయిలకు ఎర వేసే పని అప్పగించేవారు. యువకులకు ఫోన్లు చేసి ఆకర్షించాలని చెప్పేవారు. మంచి సంపాదన ఉంటే కమీషన్లు కూడా ఉండేవి. పలు సైట్లలో ఫోన్ నెంబర్లు ఇచ్చి యువతను ఆకర్షించేవారు.

నీతా, మిత్రా అరెస్ట్

నీతా, మిత్రా అరెస్ట్

పోలీసులు రెండు కాల్ సెంటర్ల మేనేజర్లను అరెస్టు చేశారు. వారు సందీప్ మిత్రా, నీతా శంకర్‌లు. బ్యాంకు అకౌంట్ల నెంబర్లతో మోసగించిన మొత్తం వివరాలను రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాల్ సెంటర్లలలో పని చేసే 37 మంది టెలీకాలర్లకు నోటీసులు జారీ చేశారు. సూత్రధారులు పరారీలో ఉన్నారు.

English summary
A five-member gang from West Bengal involved in cheating of gullible youth of lakhs of rupees in the name of arranging dating with beautiful girls and providing them female escort services has been busted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X