హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరచిన మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడు మృతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర పాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శనివారం 60ఏళ్ల వృద్ధుడు మూతతెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందాడు. నారాయణగూడ డిటెక్టివ్ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్సై జగన్నాథ్‌లు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్ వీధి నెంబరు 6లోని సద్గురు అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న హేమంత్ కుమార్ సహాయ్(60) శనివారం కుటుంబీకులతో కలిసి గచ్చిబౌలిలోని బంధువుల ఇంటికి దసరా మిలాప్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. తిరిగి శనివారం రాత్రి ఇంటికి ఒంటరిగానే వస్తున్నారు.

వీధి దీపాలు వెలగని కారణంగా చీకటి ఉండటంతో హిమాయత్‌నగర్ వీధి నెంబరు 6లోని నిరంతర్ కాంప్లెక్స్ దగ్గర డ్రైనేజీ మూత తెరిచి ఉన్న విషయం అతను గమనించలేదు. చీకట్లో సహాయ్‌కు డ్రైనేజీ మ్యాన్‌హోల్ కనిపించక ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయి ఉంటారని పోలీసులు తెలిపారు. కాగా, ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కాగా, మ్యాన్‌హోల్‌లో పడగానే అక్కడికక్కడే ఎవరూ చనిపోరు. పడిన వెంటనే అరచి మరొకరి సహాయం కోరే అవకాశం ఉంది. పడినప్పుడు తలకు గాయమవ్వడం, షాక్‌కు గురయ్యారా.. లేక మురుగు నీరు తాగి, దుర్గంధాన్ని పీల్చి ఊపిరాడక మృతి చెందాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిహెచ్ఎంసి కమిషనర్ హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ర్లను సస్పెండ్ చేశారు.

మృతికి కారణమైన మ్యాన్‌హోల్

మృతికి కారణమైన మ్యాన్‌హోల్

నగర పాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శనివారం 60ఏళ్ల వృద్ధుడు మూతతెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందాడు.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

నారాయణగూడ డిటెక్టివ్ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్సై జగన్నాథ్‌లు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మృతుడు

మృతుడు

హిమాయత్‌నగర్ వీధి నెంబరు 6లోని సద్గురు అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న హేమంత్ కుమార్ సహాయ్(60) శనివారం కుటుంబీకులతో కలిసి గచ్చిబౌలిలోని బంధువుల ఇంటికి దసరా మిలాప్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

మృతుడు నివాసముండే అపార్ట్‌మెంట్

మృతుడు నివాసముండే అపార్ట్‌మెంట్

తిరిగి శనివారం రాత్రి ఇంటికి ఒంటరిగానే వస్తున్నారు. వీధి దీపాలు వెలగని కారణంగా చీకటి ఉండటంతో హిమాయత్‌నగర్ వీధి నెంబరు 6లోని నిరంతర్ కాంప్లెక్స్ దగ్గర డ్రైనేజీ మూత తెరిచి ఉన్న విషయం అతను గమనించలేదు.

ఘటన తర్వాత..

ఘటన తర్వాత..

చీకట్లో సహాయ్‌కు డ్రైనేజీ మ్యాన్‌హోల్ కనిపించక ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయి ఉంటారని పోలీసులు తెలిపారు.

English summary
A 66-year-old man, who was returning home after celebrating Dasara at a relative's house, died after he fell into an open manhole at Himayatnagar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X