వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో గోదారి గలగలలు..! భారీ భద్రత మద్య కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మహా ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. రైతులకు నీటి గోసతప్పేరోజు రానేవచ్చింది. తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ప్రాజెక్టుల పునరాకృతి జరిగిన తర్వాత 2016 మే 2న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు.

జ‌గ‌న్ మ‌రో కీల‌క నియ‌మాకం: ఆయ‌న కోసం చ‌ట్టాన్ని స‌వ‌రించి: ఎందుకంత ప్రాధాన్య‌త అంటే..! జ‌గ‌న్ మ‌రో కీల‌క నియ‌మాకం: ఆయ‌న కోసం చ‌ట్టాన్ని స‌వ‌రించి: ఎందుకంత ప్రాధాన్య‌త అంటే..!

Recommended Video

7, 152 మెగావాట్ల విధ్యుత్ అవసరం

మూడేళ్లలోనే సుమారు 50,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క ప్రాజెక్టుపైనే ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఈ నెల 21వతేదీన ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.

Opening ceremony of the Kaleshwaram project with huge security..!!

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు రానుండటంతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. నాలుగువేలమంది పోలీసులతో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ భద్రత పెంచారు.

గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ ఫోర్స్‌ను తెలంగాణ పోలీస్‌శాఖ పంపింది. చత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు వచ్చారన్న సమాచారంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చుట్టూ హై అలర్ట్‌ ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను సీఎం చంద్రశేఖర్ రావు స్వయంగా ఆహ్వానించనున్నారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

English summary
The big project, which has been waiting for many days, is getting ready. Water for the Telangana farmers expecting Kalleshwaram project will begin in a few days and people are happy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X