హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ - సక్సెస్ అయినట్లేనా: లెక్కలు ఏం చెబుతున్నాయి..!!

|
Google Oneindia TeluguNews

కేటీఆర్. తెలంగాణ మంత్రి. రాజకీయంగా కాబోయే సీఎం అంటూ అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణకు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా కేటీఆర్ కు కేబినెట్ లో కీలక శాఖలు అప్పగించారు. అందులో రాష్గ్ర ప్రతిష్ఠతో పాటుగా కీలకమైన హైదరాబాద్ ఇమేజ్ ను పెంచే బాధ్యతలను అప్పగించారు.రాష్ట్ర విభజన ముందు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఖచ్చితంగా అక్కడ కేటీఆర్ ముద్ర కనిపిస్తోంది. ఇక..ఐటీ విస్తరణ..పెట్టుబడుల ఆకర్షణలో కేటీఆర్ సక్సెస్ అంకెలే స్పష్టం చేస్తున్నాయి. ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు 47 బిలియన్ డార్లు. 21 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి.

ఐటీ సీటీలో కేటీఆర్..సిరిసిల్లలో రామన్న

ఐటీ సీటీలో కేటీఆర్..సిరిసిల్లలో రామన్న


రాజకీయాల్లో చిన్న స్థాయిలో ఉన్నవారైనా నేను అంటూ తన గురించి తానే ప్రచారం చేసుకోవటం సాధారణం. కానీ, కేటీఆర్ ప్రసంగాల్లో మాత్రం ఎక్కడా నేను అనే పదం వినిపించదు. తెలంగాణ ప్రభుత్వం.. కేసీఆర్ ప్రభుత్వం అని మాత్రమే చెబుతూ ఉంటారు. ఇక, రాజకీయంగా కేటీఆర్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఐటీ మంత్రిగా ఆ శాఖకు సంబంధించిన సమీక్షలు.. ఒప్పందాలు..సెమినార్లతో కేటీఆర్ గా ఉన్నత విద్యా వంతుడిగా.. బాధ్యత కలిగిన మంత్రిగా మెప్పించే ప్రయత్నం చేస్తారు. పార్టీ నేతగా ప్రజల్లోకి వెళ్తే మాత్రం రామన్న లాగా పక్కా పొలిటీషియన్ గా మారిపోతారు. 2018 నుంచి కేటీఆర్ దావోస్ ప్రపంచ ఆర్దిక సదస్సులకు హాజరవుతున్నారు. అదే విధంగా తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు దేశాలు..నగరాల్లో పర్యటనలు చేసారు. ప్రచారం తక్కువగానే ఉన్నా...సాధించింది మాత్రం చెప్పుకొనే స్థాయి లోనే ఉంది. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ కు వచ్చిన పెట్టుబడులు..నగరంలో చోటు చేసుకున్న మార్పులు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

ఎనిమిదేళ్ల కాలంలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

ఎనిమిదేళ్ల కాలంలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అందులో దాదాపుగా 80 శాతం వరకు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. దీని కారణంగా సుమారు 21 లక్షల మంది ఉపాధి అవకాశం కలిగింది. రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఇతర రాష్ట్రాల తరహాలో వైబ్రంట్ సదస్సులు జరగలేదు. ఒప్పందాల హడావుడి లేదు. ప్రణాళికా బద్దంగా జాతీయ - అంతర్జాతీయ సంస్థలతో చర్చలు..వారితో ఒప్పందాల ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కేవలం సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం తెలంగాణలోనే ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 33 శాతం తెలంగాణ నుంచే వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ అనుమతులు పొందిన కంపెనీల్లో అత్యధికంగా తెలంగాణలోనే ఉన్నాయి. తాజాగా దావోస్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి 21వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం నాలుగు రోజుల పర్యటన విజయవంతంగా కొనసాగిందన్నారు. దావోస్‌లో మొత్తం 52 వాణిజ్య సమావేశాలు, ఆరు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, రెండు ప్యానల్‌ డిస్కషన్లలో పాల్గొన్నట్టు వివరించారు.
హైదరాబాద్ పెట్టుబడుల డెస్టినేషన్ గా..

హైదరాబాద్ పెట్టుబడుల డెస్టినేషన్ గా..


గత ఎనిమిదేళ్ల కాలంలో హైదరాబాద్ లో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వ ప్రాధాన్యత పెరిగింది. హైదరాబాద్ గురించి మంత్రి కేటీఆర్ విశ్లేషణలు ఆసక్తి కరంగా ఉంటాయి. హైదరాబాద్ లో హైదరాబాద్‌ గురించి చెప్పేటప్పుడు "హైదరాబాద్ దక్షిణ, ఉత్తర భారతదేశాల సమ్మేళనం. ఇక్కడ దోశతోపాటు రోటీ దొరుకుతుంది. బయాలజీతో టెక్నాలజీ స్నేహం చేస్తుంది. లైఫ్‌ సైన్సెస్‌తో డాటా సైన్స్‌ను కలుపుతుంది. మ్యాంగో వర్స్‌ నుంచి మెటా వర్స్‌ వరకు అన్నింటికీ కేంద్ర స్థానం" గా ప్రమోట్ చేస్తున్నారు. టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ 16వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో మూడు డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అలాగే భారతీ ఎయిర్‌టెల్‌ గ్రూప్‌ దాదాపు 2వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో భారీ హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ను నిర్మించనుంది. ఫార్మా రంగానికి చెందిన యూరోఫిన్స్‌ సంస్థ జీనోమ్‌ వ్యాలీలో వెయ్యికోట్ల రూపాయలతో అత్యాధునిక లేబొరేటరీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటితోపాటు ప్రఖ్యాతి గాంచిన పెప్సికో, పీఅండ్‌ జీ, అల్లాక్స్‌, అపోలో టైర్స్‌ లిమిటెడ్‌, వెబ్‌ పీటీ, ఇన్‌స్పైర్‌ బ్రాండ్స్‌ వంటి ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా 2వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రకటించినట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

English summary
Telangna got about 47 billion dollor investements in last eight years after formation state bifercation. KTR becomig brand Ambassodr for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X