• search
 • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ రెండు కులాలు కలిస్తే గులాబీకి నష్టమా? కేసీఆర్ కామెంట్స్ అందుకేనా?

|
  Telangana Elections 2018 : కమ్మ, రెడ్ల పొత్తేంటో : కేసీఆర్ వ్యాఖ్యల మర్మమేంటి? | Oneindia Telugu

  కులమతాల ఉచ్చులో చిక్కుకోవద్దని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించడం హాట్ టాపికయ్యింది. ఓట్ల కోసం ఆ రెండు కులాల నాటకంలో సమిధలు కావొద్దని ఓటర్లకు పిలుపునివ్వడం చర్చానీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా ప్రచార సభల్లో పాల్గొన్న కేసీఆర్.. ఆ రెండు కులాలంటూ పరోక్షంగా టార్గెట్ చేశారు. ముసుగులతో వచ్చి ఓట్లడిగేవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

  టీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో దుష్టశక్తులు ఏకమయ్యాయని ఆరోపించిన కేసీఆర్.. కమ్మ, రెడ్ల పొత్తేంటో అన్నట్లు ఫైరయ్యారు. అయితే కులాల పేర్ల ప్రస్తావన తీసుకురాకుండా పరోక్షంగా మహాకూటమి పొత్తులపై విరుచుకుపడ్డారు. కులమతాలు అన్నం పెట్టబోవని.. వాటి మాయలో పడి విలువైన ఓట్లను పాడు చేసుకోవద్దని సూచించారు.

  కులమతాలు తిండిపెట్టవు.. మహాకూటమిపై పరోక్ష దాడి

  కులమతాలు తిండిపెట్టవు.. మహాకూటమిపై పరోక్ష దాడి

  కులమతాల పునాదుల మీద కాకుండా వాస్తవాలను గ్రహించి ఓట్లు వేయాలని కోరారు కేసీఆర్. మలివిడతో ప్రచారంలో భాగంగా ఖమ్మంలో పర్యటించిన కేసీఆర్ కులమతాలంటూ కమ్మ, రెడ్ల పొత్తుల అంశంపై మాటల తూటాలు పేల్చారు. అయితే ఖమ్మంలో టీడీపీకి కమ్మ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ కు రెడ్ల ఓటు బ్యాంకు ఉండటంతోనే ఆయన ఇలా వ్యాఖ్యానించారనేది విశ్లేషకుల అంచనా.

  కులం కార్డుతో మహాకూటమి నాటకమాడుతున్నట్లుగా ఆరోపించారు కేసీఆర్. ప్రత్యక్షంగా అలా అనకున్నా.. కులమతాలు తిండి పెట్టవంటూ ఆయన మాట్లాడిన తీరు అలాగే కనిపిస్తోంది. అయితే కులమతాలతో ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా.. వాటికి లొంగొద్దని ప్రజలను కోరారు. చైతన్యవంతులయిన ఖమ్మం ప్రజలు ఈ విషయంలో తెలివైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

  ఆలస్యం నిమిషమే..! బట్ నామినేషన్ కు నో ఛాన్స్.. మొత్తం 3,584 దాఖలు

   కేసీఆర్ వ్యాఖ్యల మర్మమేంటి?

  కేసీఆర్ వ్యాఖ్యల మర్మమేంటి?

  మహాకూటమిపై దాడే లక్ష్యంగా పరోక్ష ఆరోపణలు గుప్పించిన కేసీఆర్ తాజాగా కులమతాలపై మాట్లాడటం కొందర్ని విస్మయానికి గురిచేస్తోంది. ఓ వర్గానికి 12 శాతం రిజర్వేషన్లంటూ ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు ఇలా మాట్లాడటం చర్చానీయాంశమైంది. ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ చేసే ప్రయత్నాలు అందరికీ తెలిసిన విషయమే అని విపక్షాల నేతలు మండిపడుతున్నారు.

  ఖమ్మం పర్యటనలో పర్టికులర్ గా కులమతాలకు సంబంధించి మాట్లాడిన కేసీఆర్.. అదే విషయం మిగతా జిల్లాల్లో మాట్లాడగలరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఖమ్మంలో కమ్మ, రెడ్ల ఆధిపత్యంతో మహాకూటమి బలంగా ఉందనే కారణంతో.. దాన్ని బలహీనపరచడానికే ఈ స్ట్రాటజీ ఉపయోగించారా అనేది మరో కోణం.

  కేసీఆర్ వ్యాఖ్యల వెనుక కూకట్ పల్లి ఎఫెక్ట్ ఉందా?

  కేసీఆర్ వ్యాఖ్యల వెనుక కూకట్ పల్లి ఎఫెక్ట్ ఉందా?

  కూకట్ పల్లి నుంచి మహాకూటమి అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని ని రంగంలోకి దించడంతో కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడ సెటిలర్లతో పాటు కమ్మ, రెడ్ల కులాలకు సంబంధించిన ఓటు బ్యాంకు కూడా బాగానే ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని మొదట్నుంచి ఆరోపిస్తున్న కేసీఆర్ ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

  ఏపీలో పాలన చూసుకోక తెలంగాణలో ఆయనకు పనేంటి అన్నది కేసీఆర్ వాదనగా కనిపిస్తోంది. అందుకే ఖమ్మం వేదికగా కులమతాలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడారనేది కొందరి ఆరోపణ. ఖమ్మంలో టీడీపీ, కాంగ్రెస్ ఓటుబ్యాంకును బలహీనపరిచేలన్నదే కేసీఆర్ వ్యూహమని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రత్యక్షంగా ఆ రెండు కులాల (కమ్మ, రెడ్లు) పేర్లు ప్రస్తావిస్తే తమ పార్టీకి నష్టం కలుగుతుందని భావించి.. కులమతాలంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారనేది మరో వాదన.

  చేసేదంతా చేసి..! ఇప్పుడేమో ఇలా

  చేసేదంతా చేసి..! ఇప్పుడేమో ఇలా

  కుల సంఘాల భవనాలకు నిధులు, గొర్రెలు, చేపల పంపిణీ అంటూ కులాల ప్రాతిపదికన పథకాలు తీసుకొచ్చిన కేసీఆర్.. ఖమ్మంలో కులమతాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటున్నారు అపొజిషన్ లీడర్లు. అంతేకాదు పండుగల పూట మతాలకు సంబంధించి దుస్తులు తదితర వస్తువులు పంపిణీ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.

  చేసేదంతా చేస్తూ ఖమ్మంలో కేసీఆర్ మాట్లాడిన తీరు సరికాదని ఆరోపిస్తున్నారు. కులమతాల పేరు చెప్పి ఓటు బ్యాంకు కోసం ప్రయత్నించడంలో ఎవరూ ముందుంటారో ప్రజలకు తెలుసంటున్నారు. మొత్తానికి కులమతాల ముసుగుల్లో వచ్చేవారిని నమ్మొద్దని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనకే రివర్స్ కొడతాయని చెబుతున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  kcr latest speech to in khammam that caste and religion may not be given food. kcr attacked on mahakutami indirectly on khamma, reddys influence.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more