• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాసాలమర్రి మీద కేసీఆర్ ప్రేమ... అసలు ఎజెండా వేరేనా...? ఆ సెంటిమెంటే అందుకు కారణమా...?

|

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. నిన్న,మొన్నటిదాకా ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్ ఉన్నట్టుండి జిల్లాల్లో పర్యటించడానికి కారణమేంటా అన్న చర్చ జరుగుతోంది. హుజురాబాద్ ఉపఎన్నికే ఇందుకు కారణమని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. అందుకే జిల్లాల్లో పర్యటిస్తూ వరాల జల్లులు కురిపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలోనూ పర్యటించారు. అయితే ఈ గ్రామంలో సీఎం పర్యటనకు అసలు కారణాలు వేరే ఉన్నాయన్న వాదన తెర మీదకు వస్తోంది. ఇంతకీ ఏంటా కారణం...

ఎంపీ అరవింద్ చెప్పిన కారణం....

ఎంపీ అరవింద్ చెప్పిన కారణం....

సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్ మీదుగా యాదాద్రికి వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న చాలామంది ముఖ్యమంత్రులు పదవులు కోల్పోయారని ఓ స్వామి సీఎం కేసీఆర్‌కు చెప్పారని అన్నారు. అందుకే కేసీఆర్ వాసాలమర్రి మీదుగా యాదాద్రి వెళ్లేందుకు... హడావుడిగా ఆ గ్రామాన్ని బంగారు వాసాలమర్రిగా మారుస్తానని హామీ ఇచ్చారని ఆరోపించారు. అందుకే అక్కడ 60 ఫీట్ల రోడ్డు,ఇతర వరాల జల్లులు కురిపించారని అన్నారు.దత్తత తీసుకున్న 8 నెలల తర్వాత సీఎంకు వాసాలమర్రి గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.

అసలు కథ ఇదేనన్న మల్లన్న...

అసలు కథ ఇదేనన్న మల్లన్న...

ప్రముఖ జర్నలిస్టు,క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న కూడా ఎంపీ అరవింద్ తరహాలోనే సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. క్యూ న్యూస్‌లో మల్లన్న మాట్లాడుతూ... కేసీఆర్ వాసాలమర్రిపై ఇంత ప్రేమ కురిపించడానికి కారణం వేరే ఉందన్నారు. 'వాసాల మర్రికి కేసీఆర్ ఎందుకు సూటి పెట్టిండంటే... కేసీఆర్ తన ఫాంహౌస్ ఎర్రవెల్లి నుంచి యాదాద్రిలో యాగాలు,ఇతర కార్యక్రమాలకు వెళ్లాలంటే దామరకుంట, కాశిరెడ్డిపల్లి,కొండాపూర్,వాసాలమర్రి మీదుగా వెళ్లాలి. ఈ మార్గంలో వాసాలమర్రిలో శ్మశానానికి కేటాయించిన భూమి నుంచే రోడ్డు మార్గం ఉంటుంది. అయితే యజ్ఞాలు,యాగాలకు వెళ్లేటప్పుడు మరుభూమి నుంచి వెళ్లవద్దని ఓ అయ్య గారు సీఎంతో చెప్పారు. దీంతో శ్మశానం మీదుగా కాకుండా వాసాలమర్రి నడి ఊరి నుంచి వెళ్లేందుకు కేసీఆర్ ఇదంతా చేస్తున్నారు. నడి ఊరిలో ఇళ్లు కూలగొట్టి... అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని హైవేకు కలుపుతారు. ఇలా ఇళ్లు కూలగొట్టినందుకు జనం తిట్టుకోవద్దనే... ఊరి అభివృద్ది కోసం కొంత ఓర్చుకోవాలి... నొచ్చుకోవద్దు అని వాసాలమర్రి సభలో కేసీఆర్ మాట్లాడారు.' అని మల్లన్న చెప్పుకొచ్చారు.

ఫాంహౌస్‌కు రోడ్డు కోసమే...

ఫాంహౌస్‌కు రోడ్డు కోసమే...

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా వాసాలమర్రిలో సీఎం వరాలపై స్పందించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు వాసాలమర్రి మీదుగా వెళ్లే రోడ్డును అడ్డుకున్నందుకే అక్కడి ప్రజలను ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫాంహౌస్‌కు రోడ్డు వేయించుకునేందుకే వాసాలమర్రి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. వాసాలమర్రిలో జరిగిన కార్యక్రమానికి ఆ ప్రాంత ఎంపీనైనా తనకు ఆహ్వానం పంపకపోవడమేంటని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు వాటిపై నమ్మకం ఎక్కువే...

కేసీఆర్‌కు వాటిపై నమ్మకం ఎక్కువే...

వాసాలమర్రిపై కేసీఆర్ కురిపించిన వరాల జల్లుపై కొత్త వాదన తెర మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. స్వతహాగా కేసీఆర్‌కు జ్యోతిష్యం,వాస్తు వంటి వాటిపై నమ్మకం ఎక్కువ. సచివాలయం వాస్తు సరిగా లేదనే దాన్ని కూల్చివేసి కొత్తదాన్ని నిర్మిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పాత సచివాలయంలో పనిచేసిన 16 మంది సీఎంలలో ఎవరి కొడుకులు సీఎం కాలేదని... అందుకే వాస్తు ప్రకారం కొత్త సచివాలయాన్ని నిర్మించి తనయుడిని సీఎం చేయాలని ఆయన భావిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు గతంలో విమర్శించారు. ఇలా కేసీఆర్‌కు ఉన్న జ్యోతిష్యం,వాస్తు సెంటిమెంటును.. ఇప్పుడు వాసాలమర్రి విషయంలోనూ ఫాలో అవుతున్నారన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. శ్మశానం మీదుగా యాదాద్రికి వెళ్తే మంచిది కాదని జ్యోతిష్యులు చెప్పడంతోనే.. ఆ రూట్‌ను మార్చి వాసాలమర్రి గ్రామం లోపలి నుంచి యాదాద్రికి వెళ్లేందుకే కేసీఆర్ అక్కడ వరాల జల్లు కురిపించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

English summary
BJP MP Dharmapuri Arvind made interesting remarks on the visit of CM KCR Vasalamarri. A Swamiji told CM KCR that most of the chief ministers who went to Yadadri via Jagdevpur in Siddipet district to visit Lakshminarsinhswamy had lost their posts. That is why KCR promised for 60 feet roads there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X