వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు: 2019 ఎన్నికల్లో సింగరేణి తరహ ప్రయోగం?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సింగరేణి ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాన్ని ఓడించేందుకు విపక్షాలన్నీ ఐఎటీయూసీకి మద్దతును ప్రకటించాయి. 2019 ఎన్నికల్లో ఓట్ల చీలికను నివారించేందుకు ఉమ్మడిగా పోటీచేస్తాయా అనే చర్చ సాగుతోంది.

తెలంగాణలో అధికార టిఆర్ఎస్‌ను ఓడించాలని విపక్షాలు వ్యూహలను రచిస్తున్నాయి. తెలంగాణలో టిఆర్ఎస్ అనుసరించిన విధానాల కారణంగా విపక్షాలు తీవ్రంగా నష్టపోయాయి.

అయితే ఒంటరిగా టిఆర్ఎస్‌ను దెబ్బకొట్టే పరిస్థితి ఉండదనే అభిప్రాయం నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌ వ్యతిరేక ఓట్లను చీలిపోకుండా ఉండేందుకు విపక్షాలు ఇప్పటి నుండి ప్లాన్‌లో ఉన్నాయి.

సింగరేణి ఎన్నికలను విపక్షాలు అదికార టిఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగా;ణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడిస్తే 2019 ఎన్నికలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంటుందని విపక్షాలు భావిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో సింగరేణి ఎన్నికల ఫార్మూలా

2019 ఎన్నికల్లో సింగరేణి ఎన్నికల ఫార్మూలా

2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలు కూటమిని ఏర్పాటు చేసి పోటీచేశాయి. 2004లో ఈ ప్రయోగం విజయవంతమైంది. 2004లో టిడిపిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009లో కాంగ్రెస్ ను ఓడించేందుకు చేసిన కూటమి ప్రయోగం విజయం సాధించలేదు. కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయం సాధించింది. అయితే తెలంగాణలో ఇదే తరహ ఫార్మూలాను అమలు చేయాలని విపక్షాలు భావిస్తున్నాయి.2019 ఎన్నికలకు ట్రయల్‌గా సింగరేణి ఎన్నికలను వేదికగా చేసుకొన్నాయి విపక్షాలు.

సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించేందుకు విపక్షాల కూటమి

సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించేందుకు విపక్షాల కూటమి

సింగరేణిలో టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాన్ని దెబ్బకొట్టాలంటే విపక్ష కార్మిక సంఘాలన్నీ పోటీ చేయకుండా ఎఐటియూసీకి మద్దతివ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ లకు చెందిన నేతలు సమావేశమై ఓట్ల చీలిక నివారణకు ప్రయత్నాల కోసం ఈ ప్రయోగాన్ని ప్రారంభించాయి.తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓడించాలని ఉమ్మడిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

వారసత్వ ఉద్యోగాలే కీలకం

వారసత్వ ఉద్యోగాలే కీలకం

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాల ప్రచారం కీలకంగా మారనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వారసత్వ ఉద్యోగాలను రద్దు చేశారు.అయితే తెలంగాణ ప్రభుత్వం వారసరత్వ ఉద్యోగాలను పునరుద్దరిస్తూ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ విషయమై కొందరు కోర్టుకు వెళ్ళడంతో వారసరత్వ ఉద్యోగాల నియామకం బ్రేక్ పడింది.

ఒకరిపై మరోకరు ప్రచారం

ఒకరిపై మరోకరు ప్రచారం

వారసత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో అధికార పార్టీ, విపక్షాలు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొంటున్నారు. వారసత్వ ఉద్యోగాలు రాకుండా విపక్షాలకు చెందిన నేతలే కోర్టును ఆశ్రయించారని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే విపక్షాలు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు.

English summary
Singareni trade union verification election heat between ruiling and opposition parties.opposition parties alliance against Trs. opposition parties will be implemented against Trs in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X