వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో విపక్షాలు, హైదరాబాద్‌లో మిత్రపక్షాలు... అభివృద్దిని అడ్డుకునేందుకు విమర్శలు... టీఆర్ఎస్

|
Google Oneindia TeluguNews

Recommended Video

విపక్షాలపై మండిపడ్డ TRS MLC కర్నే ప్రభాకర్|TRS MLC Karne Prabhakar Criticised The Opposition Parties

సచివాలయం భవన నిర్మాణాలను ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు గవర్నర్‌‌కు పిర్యాధు చేయడం అత్యంత దుర్మార్గమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మండిపడ్డారు. ఆయా పార్టీలు సిద్దాంతాలను పక్కనబెట్టి అభివృద్ది సంక్షేమ పథకాలను అడ్డుకుంటాయని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను చూసి ప్రతి పక్ష్యాలు భయపడుతున్నాయని అన్నారు. అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సచివాలయా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో ఇటివల రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌ను కలిసి ప్రస్థుతం ఉన్న భవనాలను కూల్చివేయకుండా అడ్డుకోవాలని వినతిపత్రం అందించాయి. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రామాలపై ప్రతిపక్షాలు బెంబేలెత్తున్నారని విమర్శించారు.

opposition parties are worried about the governments development:TRS

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో విమర్శలు చేసుకునే కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రంలో మాత్రం మిత్రపక్షాలుగా మారాయని ప్రభాకర్ విమర్శించారు. మరోవైపు అసెంబ్లీ ,సెక్రటేరీయట్ నిర్మాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి వచ్చే పేరును అడ్డుకునే కుట్రలో భాగంగా ప్రతిపక్షాలు సిద్దాంతాలను పక్కన బెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.నిర్మాత్మక సలహాలను ఇవ్వలేని ప్రతిపక్షాలను దేశంలో ఎవ్వరు పట్టించుకోలేదని, తెలంగాణలో కూడ అదే జరుగనుందని ఆయన తెలిపారు.

English summary
TRS MLC Karne Prabhakar criticised the opposition parties objecting to Governor's meet to stop building of the Secretariat and assembly. he says it is "very bad". He said the parties are worried about the government's development and welfare schemes. That is why they are criticizing the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X