వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసలు రంగు..! బట్ట బయలైన నోట్ల పంపిణీ బాగోతం..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Elections 2019 : కొండా విశ్వేశ్వర్ రెడ్డి నోట్ల పంపిణీ..!! || Oneindia Telugu

హైదరాబాద్: ఓటమి భయంతో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముందు కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం మొదలుపెట్టినట్టు అదికార పార్టీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి గచ్చిబౌలి ఎస్‌ఎల్‌ఎన్ టవర్స్ వద్ద పోలీసులు సోదాలు నిర్వహించారు. సందీప్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్కోడా కారులో తరలిస్తున్న 10 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరా తీయగా ఈ డబ్బుటు ఓ ప్రముఖ రాజకీయ వేత్తవని తేలినట్టు పోటీసులు నిర్ధారించారు.

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి నోట్ల పంపిణీ..! పట్టుకున్న పోలీసులు..!!

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి నోట్ల పంపిణీ..! పట్టుకున్న పోలీసులు..!!

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంస్థలో సందీప్‌రెడ్డి పనిచేస్తున్నారు. అతని వద్ద నుంచి నగదు, ల్యాప్‌టాప్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి ఆఫీస్‌లో సందీప్‌రెడ్డి అడ్మిన్‌గా పనిచేస్తున్నారు. సందీప్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డికి సమీప బంధువు. విశ్వేశ్వర్ రెడ్డి డబ్బులకు సంబంధించిన మొత్తం లావాదేవీలు చూస్తుంటాడు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంత డబ్బులు పంపిణీ చేసారు అనే విషయాన్ని పోలీసులు ఆరా తీసారు.

సందీప్ రెడ్డే కీలకం..! ఎవరికి ఎంతిచ్చారో కూపీ లాగుతున్న పోలీసులు..!!

సందీప్ రెడ్డే కీలకం..! ఎవరికి ఎంతిచ్చారో కూపీ లాగుతున్న పోలీసులు..!!

ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత ఇవ్వాలో పూర్తి వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లును సందీప్ రెడ్డి నుంచి గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బూతు కమిటీలకు ఎంత ఇవ్వాలి, మద్యానికి ఎంత ఖర్చు పెట్టారో, కార్యకర్తలకు ఎంత ఇచ్చారో పూర్తి వివరాలు ఉన్న డైరీని పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి పోలీసులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకోగా.. ఎవరికి ఎంత ఇచ్చారన్న దానిపై కోడింగ్‌లో రాసుకున్నారు. ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

పదిహేను రోజులుగా సాగుతున్న దందా..! పెద్ద మొత్తం పై పోలీసుల విచారణ..!!

పదిహేను రోజులుగా సాగుతున్న దందా..! పెద్ద మొత్తం పై పోలీసుల విచారణ..!!

అపోలో హాస్పిటల్ కేంద్రంగా గత పదిహేను రోజులుగా జరుగుతున్న కుట్రను పోలీసులు ఛేదించారు. సందీప్‌రెడ్డి వ్యవహారంపై ఇప్పటికే ఐటీ అధికారులకు సమాచారం అందించారు. నిన్న సందీప్‌రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. మరోసారి తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. సందీప్‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు. నియోజకవర్గాల వారీగా మద్యం పంపిణీ ఖర్చుల వివరాలను సందీప్‌రెడ్డి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు.

గెలుపు తనదే అంటున్న విశ్వేశ్వర్ రెడ్డి..! ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని సూచన..!!

గెలుపు తనదే అంటున్న విశ్వేశ్వర్ రెడ్డి..! ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని సూచన..!!

ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు.. తాండూరు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా పైలట్‌ రోహిత్‌రెడ్డిదే విజయం అన్నారు. ఆయనకు 30 వేల ఓట్ల మెజారిటీ ఖాయం అనుకున్నాం. కానీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఈవీఎం రిగ్గింగ్‌తో మెజారిటీ 3 వేలకు తగ్గింది. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో సక్రమంగా ఎన్నికలు జరిగితే 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ కు వస్తుంది. టీఆర్‌ఎస్‌ రిగ్గింగ్‌ చేసినా నేనే గెలుస్తా' అని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానం కోసం టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు తలపడుతున్నారని పేర్కొన్నారు.

English summary
The trs party is expressing doubts about the Congress party's voter turnout before the Lok Sabha election polls with fear of defeat. The police conducted searches near Gachibowli on Tuesday night. Police seized 10 lakh rupees in a Skoda car of Sandeep Reddy. police conclude that this money has come up with a prominent politician.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X