హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియాకు మహర్దశ: రెండు కొత్త భవనాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రోజురోజుకూ శిథిలావస్ధకు చేరుకుంటున్న ఉస్మానియాకు త్వరలో మహర్దశ పట్టనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రి రూపురేఖలే మారిపోనున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని, పెచ్చులు ఊడుతున్న సంగతి తెలిసిందే!

ఈ క్రమంలో ఉస్మానియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునీకరించటం, ప్రజలకు అందిస్తున్న సేవలను మెరుగుపర్చటం వంటి అంశాలపై సీఎం కేసీఆర్ సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆరోగ్యశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర, డిఎంఇ రమణి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముందుగా కేసీఆర్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రిలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని అధికారులకు సూచించారు.

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం


ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ దాదాపు శతాబ్ద కాలంగా పేదలకు వైద్య సేవలందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రిని నేటి అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం


అంతేగాక, ప్రస్తుతం శిథిలావస్థకు చేరి, పెచ్చులూడుతూ ఈ భవనం రోగుల పాలిట ప్రమాదరకంగా మారిందని అన్నారు. ఇందుకుగాను పాతభవనం స్థానంలో బహుళ అంతస్తులతో కూడిన కొత్త భవనాలు, టవర్లను నిర్మించాలని సూచించారు.

 ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం


దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధం చేయాలని, వైద్యం కోసం పేదలు ఎంతో నమ్మకంతో వచ్చే ఈ ఆస్పత్రిని వారి అసరాలకు తగినవిధంగా ఆధునీకరించేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉందని అధికారులకు స్పష్టం చేశారు.

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం


ఉస్మానియా ఆసుపత్రి భవనం హెరిటేజ్ భవనాల జాబితాలో ఉండటంతో మరమ్మత్తు పనులకు నోచుకోవడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ భవనం పక్కనే రెండు భారీ అంతస్ధుల భవనాలను నిర్మించి ఆసుపత్రిని అందుబాలోకి మార్చాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం

ఈ భవన నిర్మాణాలకు కూడా హెరిటేజ్ నిబంధనలు అడ్డు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని హెరిటేజ్ భవనాల జాబితా నుంచి తొలగించాలనే ప్రతిపాదన ఉంది. రాష్ట్రంలో వారసత్వ కట్టడాల గుర్తింపు, పరిరక్షణ విధానం అసమగ్రంగా ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు కొత్త భవనాల నిర్మాణం


సాక్షాత్తూ శాసనసభా భవనమే వారసత్వ కట్టడాల జాబితాలో లేని పరిస్దితి ఉందన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లో ఎన్నో చారిత్రిక కట్టడాలు, విశేషాలు ఉన్నాయనీ, వీటన్నింటినీ గుర్తించి పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 బోనాల ఏర్పాట్లకు మంత్రుల కమిటీ

బోనాల ఏర్పాట్లకు మంత్రుల కమిటీ


హైదరాబాద్ బోనాల పండుగ ఏర్పాట్ల పర్యవేక్షణకు సీఎం కేసీఆర్ మంత్రుల కమిటీని నియమించారు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షులుగా, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌అలీ, పద్మారావు సభ్యులుగా వ్యవహరిస్తారు.

బోనాల ఏర్పాట్లకు మంత్రుల కమిటీ

బోనాల ఏర్పాట్లకు మంత్రుల కమిటీ


బోనాల పండుగ ఏర్పాట్లపై సోమవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసాని, పద్మారావు, సీఎస్ రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిలతో సీఎం సమీక్షించారు. బోనాల పండుగ ఏర్పాట్ల కోసం రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.

బోనాల ఏర్పాట్లకు మంత్రుల కమిటీ

బోనాల ఏర్పాట్లకు మంత్రుల కమిటీ


ఇందులో దేవాదాయశాఖద్వారా రూ.5 కోట్లు, జీహెచ్‌ఎంసీ ద్వారా రూ.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మంత్రుల కమిటీ జీహెచ్‌ఎంసీలతో సమన్వయం చేసుకొని ఉత్సవాలు నిర్వహించాలని దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్‌ను ఆదేశించారు.

బోనాల ఏర్పాట్లకు మంత్రుల కమిటీ

బోనాల ఏర్పాట్లకు మంత్రుల కమిటీ

బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, దారులు శుభ్రంగా ఉండేలా చూడాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వస్తానని సీఎం తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, దేవాలయ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

English summary
Telangana CM KCR ordered the officials to modernize the Osmania General Hospital in the city, which is serving the people for more than 100 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X