హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

(ఫోటోలు) ఓయు హాస్టల్లో తిన్నారు: 'బీఫ్ ఫెస్టివెల్ వెనుక టిఆర్ఎస్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎక్కడికి అక్కడ అరెస్టులు, ఆంక్షలు, కోర్టు తీర్పు నేపథ్యంలో తాము హాస్టల్లోనే బీఫ్ ఫెస్టివెల్ జరుపుకున్నామని ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక గురువారం ప్రకటించింది. హాస్టల్ గదుల్లో బీఫ్ ఫెస్టివెల్ జరుపుకున్న ఫోటోల్ని, వీడియోల్ని మీడియాకు పంపించింది. ఫేస్‌బుక్‌లోను హల్‌చల్ చేస్తున్నాయి.

బీఫ్ ఫెస్టివెల్ వెనుక టిఆర్ఎస్ హస్తం: వంటేరు ప్రతాప్ రెడ్డి

బీఫ్ ఫెస్టివెల్‌ను నిర్వహించే విషయంలో న్యాయస్థానం తీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి గురువారం చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివెల్ వెనుక టిఆర్ఎస్ హస్తం ఉందని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు.

కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రం చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని ఆనడిమాండ్ చేశారు. రాష్ట్రంలో తీవ్ర కరువు ఉన్నప్పటికీ కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

బీఫ్ ఫెస్టివెల్

బీఫ్ ఫెస్టివెల్

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివెల్ ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. బీఫ్ ఫెస్టివెల్‌ను న్యాయస్థానాలు సహా ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఫెస్టివెల్ నిర్వహించి తీరుతామని చెప్పడంతో ఉద్రిక్తత తలెత్తింది. పెద్ద కూర పండుగ తిండి కాదని, మా ఆత్మగౌరవం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.

బీఫ్ ఫెస్టివెల్

బీఫ్ ఫెస్టివెల్

బీఫ్ ఫెస్టివెల్ టెన్షన్ నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున ఓయులో మోహరించారు. బయటి వారిని ఓయులోకి రానివ్వలేదు. అదే సమయంలో హాస్టల్లో ఉన్న విద్యార్థులను బయటకు రానివ్వలేదు. శివసేన, బజరంగ దళ్, హిందూవాహిని, గోరక్షక సంస్థలు ఓయులోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఓయులో కొన్ని పరీక్షల నేపథ్యంలో హాల్ టిక్కెట్లు చూపిస్తే రానిచ్చారు.

బీఫ్ ఫెస్టివెల్

బీఫ్ ఫెస్టివెల్

ఎక్కడికి అక్కడ అరెస్టులు, ఆంక్షలు, కోర్టు తీర్పు నేపథ్యంలో తాము హాస్టల్లోనే బీఫ్ ఫెస్టివెల్ జరుపుకున్నామని ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక గురువారం ప్రకటించింది.

బీఫ్ ఫెస్టివెల్

బీఫ్ ఫెస్టివెల్

ఉస్మాయని విశ్వవిద్యాలయంలోని ఓ హాస్టల్ గది ప్రాంగణంలో తింటున్న విద్యార్థులు. తాము బీఫ్ ఫెస్టివెల్ జరుపుకున్నామంటూ ఫోటోలు విడుదల చేశారు.

English summary
Osmania University tense as beef festival organisers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X