వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బండెనక బండి కట్టి.. టిఆర్ఎస్‌లో చేరారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అన్ని పార్టీల దారులు తెలంగాణ రాష్ట్ర సమితివైపే ఉన్నాయని, నేతలంతా సిఎం వైపు చూస్తున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి హరీశ్ రావు, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు పేర్కొన్నారు. డిసిసి కార్యదర్శి రాగం నాగేందర్ యాదవ్, ఆయన భార్య, సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్ పర్సన్ సుజాతయాదవ్ సహా భారీ సంఖ్యలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గురువారం టిఆర్ఎస్‌లో చేరారు.

ఉదయం టిడిపి ఎమ్మెల్యేలు సిఎం కెసిఆర్‌ను కలిసి టిఆర్ఎస్‌లో చేరతామంటే మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు చేరారని హరీశ్ రావు అన్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అవుతున్నాయని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధించుకునేందుకు టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నారని హరీశ్, కెకె చెప్పారు. మీపై భరోసాలేక మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుంటే రైతులకేం భరోసా ఇస్తారని టిడిపిని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కరెంటు కష్టాలకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కారణం కాదా? అని నేతలు నిలదీశారు. గత ప్రభుత్వాలు తెలంగాణలో బొగ్గు నిల్వలు, గోదావరి నది ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు నిర్మించలేదని వారు గుర్తు చేశారు. స్థానిక ప్రాజెక్టులకు అవసరమైన గ్యాస్ కూడా సాధించలేకపోయారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రైతాంగం ఇబ్బందులకు కాంగ్రెస్ పార్టీయే కారణమని హరీశ్ రావు అన్నారు.

చేరికలు

చేరికలు

అన్ని పార్టీల దారులు తెలంగాణ రాష్ట్ర సమితివైపే ఉన్నాయని, నేతలంతా సిఎం వైపు చూస్తున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి హరీశ్ రావు, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు పేర్కొన్నారు.

చేరికలు

చేరికలు

డిసిసి కార్యదర్శి రాగం నాగేందర్ యాదవ్, ఆయన భార్య, సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్ పర్సన్ సుజాతయాదవ్ సహా పలువురు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ నేతలు గురువారం టిఆర్ఎస్‌లో చేరారు.

బండెనబండి.. చేరికలు

బండెనబండి.. చేరికలు

ఉదయం టిడిపి ఎమ్మెల్యేలు సిఎం కెసిఆర్‌ను కలిసి టిఆర్ఎస్‌లో చేరతామంటే మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు చేరారని హరీశ్ రావు అన్నారు.

చేరికలు

చేరికలు

టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అవుతున్నాయని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధించుకునేందుకు టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నారని హరీశ్, కెకె చెప్పారు.

చేరికలు

చేరికలు

మీపై భరోసాలేక మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుంటే రైతులకేం భరోసా ఇస్తారని టిడిపిని ప్రశ్నించారు.

చేరికలు

చేరికలు

రాష్ట్రంలో కరెంటు కష్టాలకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కారణం కాదా? అని నేతలు నిలదీశారు.

చేరికలు

చేరికలు

గత ప్రభుత్వాలు తెలంగాణలో బొగ్గు నిల్వలు, గోదావరి నది ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు నిర్మించలేదని వారు గుర్తు చేశారు.

చేరికలు

చేరికలు

స్థానిక ప్రాజెక్టులకు అవసరమైన గ్యాస్ కూడా సాధించలేకపోయారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రైతాంగం ఇబ్బందులకు కాంగ్రెస్ పార్టీయే కారణమని హరీశ్ రావు అన్నారు.

చేరికలు

చేరికలు

సిఎం కెసిఆర్ అధికారం చేపట్టిన మూడున్నర నెలల్లోనే రైతులకు అండగా నిలిచారని చెప్పారు.

చేరికలు

చేరికలు

బిహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో 6000 మెగావాట్లు, ఎన్టీపిసి, సౌర విద్యుత్ ద్వారా 4000 మెగావాట్ల చొప్పున, మహబూబ్ నగర్ జిల్లాలో మరో రెండువేల మెగావాట్లతో కలిపి మొత్తం 16వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిఎం కెసిఆర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు.

English summary
Other parties leaders on Thursday joined in Telangana Rastra Samithi at Telangana Bhavan, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X