వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ రెచ్చగొడ్తున్నారు: హోటల్‌పై దాడి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఓయూ భూములలో ఇళ్లు కడతామన్న సీఎం వ్యాఖ్యల పైన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్.. విద్యార్థుల పైకి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

హబ్సీగూడలోని స్వాగత్ గ్రాండ్ హోటల్ పైన ఓయు విద్యార్థులు కొందరు దాడి చేశారు. హోటల్ పైన దాడి చేయడంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూములను రక్షించాలని కోరుతూ గవర్నర్‌కు టీఎన్ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్తరాలు పోస్ట్ చేశారు.

అనంతరం కళ్లకు నల్లని గుడ్డ కట్టుకొని, మోకాళ్ల పైన నిలబడి నిరసన తెలిపారు. జూన్ 1న ఓయూలో విద్యార్థి నిరుద్యోగ సింహగర్జన నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రకటించింది. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నల్ల బ్యాడ్జీలతో నిర్వహించాలని కోరారు. ఏబీవీపీ విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

హోటల్ పైన దాడి

హోటల్ పైన దాడి

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మూడు ఎకరాల స్థలంలో తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిర్మించిన హోటల్‌ను స్వాధీనం చేసుకుని, ఆ స్థలాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించాలని తెలంగాణ విద్యార్థి వేదిక డిమాండ్‌ చేసింది.

హోటల్ పైన దాడి

హోటల్ పైన దాడి

ఈ వేదిక ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని హబ్సిగూడలో స్వాగత్‌ గ్రాండ్‌ హోటల్‌పై విద్యార్థులు దాడి చేశారు. వీరు రాళ్లు రువ్వగా హోటల్‌ మొదటి అంతస్తులో ఒక అద్దం పగిలిపోయింది. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జి చేశారు.

 హోటల్ పైన దాడి

హోటల్ పైన దాడి

అనంతరం వారిని అరెస్టు చేసి తొలుత ఓయూ పోలీసు స్టేషన్‌కు, అనంతరం అంబర్‌పేట పీఎస్‌కు తరలించారు. ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడారు.

హోటల్ పైన దాడి

హోటల్ పైన దాడి


ఓయూ భూమిని అక్రమంగా కబ్జా చేసి అందులో హోటల్‌ నిర్మించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హోటల్‌ను ఓయూకు కేసీఆర్‌ అప్పగించాలన్నారు. హోటల్‌పై దాడికి పాల్పడిన విద్యార్థులలో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు ఓయూ ఇన్‌స్పెక్టర్‌ అశోక్ రెడ్డి తెలిపారు.

 హోటల్ పైన దాడి

హోటల్ పైన దాడి

విద్యార్థులపై లాఠీ చార్జిని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ కళ్యాణ్‌ మరికొంత మంది విద్యార్థులు హబ్సిగూడలోని స్వాగత్‌ గ్రాండ్‌ హోటల్‌ వద్దకు వెళ్లారు. హోటల్ వద్ద ఉన్న పోలీసులు వారి పైన లాఠీచార్జ్ చేశారు.

హోటల్ పైన దాడి

హోటల్ పైన దాడి

ప్రభుత్వం ఈ హోటల్‌ను స్వాధీనం చేసుకుని ఓయూకు అప్పగించకుంటే తామే దీనిని స్వాధీనం చేసుకుని హాస్టల్‌గా మారుస్తామన్నారు.

English summary
Alleging that a building, housing a wellknown restaurant owned by a sitting TRS MLA, was built by encroaching Osmania University land, student activists belonging to Telangana Vidhyarthi Vedika on Monday staged a protest and pelted stones at the hotel demanding immediate evacuation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X