వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌పై ముప్పేట దాడి, దమ్ముందా: ఓయు సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా, ఓపెన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములను కచ్చితంగా తీసుకుంటామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మూకుమ్మడిగా విపక్షాలు, విద్యార్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఓయూ భూములలో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనలపై వర్సిటీలో నిరసన జ్వాలలు రగులుతున్నాయి. మంగళవారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు.

పేదలపై ప్రేముంటే మై హోం రామేశ్వర రావుకు కట్టబెట్టిన 30 ఎకరాల భూమిలో ఇళ్లు కట్టించాలే తప్ప ఓయూ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా, ఓయూ భూములను పేదల పేరుతో విక్రయించేందుకు కేసీఆర్‌ యత్నిస్తున్నారని మండిపడ్డారు.

దమ్ము, ధైర్యం ఉంటే ఓయూలో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్‌ కాలేజీ వరకు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి రిజిస్ర్టార్‌ కార్యాలయంలో బైఠాయించారు.

ఓయు

ఓయు

ఉస్మానియా, ఓపెన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములను కచ్చితంగా తీసుకుంటామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మూకుమ్మడిగా విపక్షాలు, విద్యార్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఓయు

ఓయు

ఓయూ భూములలో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనలపై వర్సిటీలో నిరసన జ్వాలలు రగులుతున్నాయి.

ఓయు

ఓయు

మంగళవారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు.

ఓయు

ఓయు


పేదలపై ప్రేముంటే మై హోం రామేశ్వర రావుకు కట్టబెట్టిన 30 ఎకరాల భూమిలో ఇళ్లు కట్టించాలే తప్ప ఓయూ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

ఓయు

ఓయు

విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా, ఓయూ భూములను పేదల పేరుతో విక్రయించేందుకు కేసీఆర్‌ యత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఓయు

ఓయు

దమ్ము, ధైర్యం ఉంటే ఓయూలో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్‌ కాలేజీ వరకు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.

ఓయు

ఓయు

పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి రిజిస్ర్టార్‌ కార్యాలయంలో బైఠాయించారు.

విపక్షాలు భగ్గు

కేసీఆర్‌, మంత్రులకు యూనివర్సిటీల్లో అడుగు పెట్టే దమ్మూ ధైర్యం ఉందా అని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. ఉస్మానియా యూనివర్సిటీ స్థలాన్ని తీసుకుని పేదలకు ఇళ్లను నిర్మిస్తామంటున్న సీఎంకు నగరంలోని సినీ స్టూడియోలు, కార్పొరేట్‌ కంపెనీల స్థలాలను కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

పొన్నం, సిరిసిల్ల రాజయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
వర్సిటీల స్థలాలను తీసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని, విద్యార్థి లోకంతో కలిసి ఉద్యమిస్తామన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని చెప్పి, ఈ రోజు పొగుడుతున్నారని వారు ఎద్దేవా చేశారు.

తెరాస నేతలు కబ్జా చేసిన స్థలాలను స్వాధీనం చేసుకొని అందులో పేదలకు ఇళ్లు కట్టించాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు డిమాండ్‌ చేశారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాతా ప్రభుత్వ ఖాళీ స్థలాలు, విద్యా సంస్థల స్థలాలు, ఆర్టీసీ స్థలాలను తెరాస నేతలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు.

English summary
OU students burn KCR in effigy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X