హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయూలో బీఫ్ ఫెస్ట్ కాదు.. ఉద్యోగాల పండుగ..: ఆ కోపం జంతువుల పైనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మళ్లీ వేడెక్కింది. విద్యార్థులు విభాగాలుగా విడిపోయి... పోర్క్ ఫెస్టివెల్, బీఫ్ ఫెస్టివెల్‌లను నిర్వహిస్తున్నారు. కొందరు రాజకీయ క్రీడకు విశ్వవిద్యాలయం వేదికగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొందరు విద్యార్థులు ఈ నెల 10వ తేదీన బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. దానికి పోటీగా పోర్క్ ఫెస్టివెల్‌కు మరికొందరు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఫెస్టివెల్ వేడుకల పైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, ఎవరి పైన కోపంతోనే ఇలా జంతువులను చంపడం నేరం అని జంతు ప్రేమికులు, పెటా సభ్యులు చెబుతున్నారు. బీఫ్ ఫెస్టివెల్, పోర్క్ ఫెస్టివెల్‌లను జంతు ప్రేమికులు తప్పుబడుతున్నారు. రాజకీయ క్రీడకు, పగకు జంతువులను చంపవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఓ వైపు తాము బీఫ్ ఫెస్టివెల్ చేస్తామని ఓ సమూహం, తాము పోర్క్ ఫెస్టివెల్ నిర్వహిస్తామని మరో సమూహం చెబుతోంది. వీరి వెనుక రాజకీయ అండ, రాజకీయ కుట్ర ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోవైపు, జంతుహింస సరికాదని పరిపూర్ణానంద స్వామి వంటివారు చెబుతున్నారు.

బీఫ్ తింటే బుద్ధిమాంద్యం వస్తుందని, బీఫ్ ఫెస్టివెల్‌ను నిర్వహించే రోజు తాము గోరక్ష దివస్‌గా ప్రకటిస్తున్నామని పరిపూర్ణానంద చెప్పారు. పదో తేదీన లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న భాగ్యనగర్ గోరక్ష సమితి ఆధ్వర్యంలో గోవులకు పూజలు నిర్వహిస్తామని, రాష్టవ్య్రాప్తంగా అందరూ గోవులను పూజించాలని పిలుపునిచ్చారు.

OU students to go ahead with beef fest and Pork fest

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్... తాము ఎట్టి పరిస్థితుల్లో బీఫ్ ఫెస్టివెల్‌ను అడ్డుకొని తీరుతామని ప్రకటించారు. ఓయులో బీఫ్ ఫెస్టివెల్ చేస్తామని కొందరు, పోర్క్ ఫెస్టివెల్ చేస్తామని మరికొందరు చెబుతుండగా, అడ్డుకుంటామని ఇంకొందర చెబుతున్నారు. మరోవైపు, పెటా, జంతు పరిరక్షణ సంఘాలు, స్వామీజీలు జంతువధ సరికాదని వాపోతున్నారు.

'కూర పండుగలు కాదు.. ఉద్యోగ పండుగలు కావాలి'

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూరల పండుగ వద్దని, ఉద్యోగల పండుగనే ముద్దు అని ఓయు విద్యార్థుల పరిరక్షణ సమితి కన్వీనర్ కళ్యాణ్ అన్నారు.

ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్సిటీలో ప్రశాంత వాతావరణం చెదరగొట్టవద్దన్నారు. పదో తేదిన తలపెట్టిన బీఫ్ ఫెస్టివెల్ విరమించుకోకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. బీఫ్ ఫెస్టివెల్ అడ్డుకునేందుకు హిందుత్వవాదులంతా ఓయూకు రావాలని పిలుపునిచ్చారు.

English summary
Osmania University’s historic Arts College will be the venue for the conduct of beef festival, student organisers of the fest said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X