• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఉగ్రవాదులు జవాన్లను చంపుతుంటే..పాకిస్తాన్‌తో టీ20 మ్యాచ్ కావాల్సొచ్చిందా: మోడీపై ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. మరోసారి కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్‌లో మాటువేసిన పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు.. జవాన్లు, అమాయక జనాలను కాల్చి చంపుతున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు.. కాశ్మీర్ ప్రజల ప్రాణాలతో టీ20 మ్యాచులు ఆడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పాక్‌తో టీ20 మ్యాచ్ అవసరమా?

పాక్‌తో టీ20 మ్యాచ్ అవసరమా?

ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో భారత్ టీ20 మ్యాచ్‌ను ఆడాల్సిన అవసరం ఉందా అని నిలదీశారు. హైదరాబాద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు అక్రమంగా సరిహద్దులను దాటుకుని భారత్‌లోకి ప్రవేశిస్తున్నారని, వారిని అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సరిహద్దుల్లో చైనా సైనికులు ఏకంగా భారత్ భూభాగంపై తిష్ఠ వేసి కూర్చున్నారని విమర్శించారు.

మన ఇంట్లో తిష్ఠ వేసిన చైనా..

మన ఇంట్లో తిష్ఠ వేసిన చైనా..


లఢక్ తూర్పు ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నాయని చెప్పారు. డెప్సాంగ్, డెమ్‌చోక్, హాట్‌స్ప్రింగ్స్ వంటి భారత్‌కు చెందిన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని, అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాని గురించి మాట్లాడటం లేదని అన్నారు. చైనా పేరు ఎత్తడానికే నరేంద్ర మోడీ భయపడతారని ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్‌లో సరిహద్దులను దాటుకుని రావడానికి చైనా సైన్యం సిద్ధంగా ఉందని చెప్పారు.

 ఇంటికెళ్లి ఎప్పుడు కొడతారు?

ఇంటికెళ్లి ఎప్పుడు కొడతారు?

చైనా గానీ, పాకిస్తాన్ గానీ భారత్‌లోకి చొరబడే ప్రయత్నం చేస్తే.. వాళ్ల ఇంటికెళ్లి కొడతాం అంటూ నరేంద్ర మోడీ ఇదివరకు హెచ్చరించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు.. కాశ్మీర్‌లోకి చొరబడి స్థానికేతరులను కాల్చి చంపుతున్నారని అన్నారు. ఇప్పటిదాకా తొమ్మిదిమంది జవాన్లను ఉగ్రమూకలు కాల్చి చంపాయని చెప్పారు. అయినా ప్రధాని మోడీ మాత్రం నోరు విప్పట్లేదని విమర్శించారు.

కాశ్మీర్‌లో ఉగ్రవాదులు..లఢక్‌ వైపు చైనా సైనికులు..

కాశ్మీర్‌లో ఉగ్రవాదులు..లఢక్‌ వైపు చైనా సైనికులు..


పైగా పాకిస్తాన్‌తో ప్రపంచకప్‌లో టీ20 మ్యాచ్ ఆడటానికి భారత్ సిద్ధమౌతోందని, ఇప్పుడు ఈ మ్యాచ్‌ను ఆడించాల్సిన అవసరం ఉందా? అని ఒవైసీ నిలదీశారు. కాశ్మీర్ పరిస్థితి ఇలా ఉంటే.. లఢక్ సమీపంలో భారత భూభాగంపైకి ఏకంగా చైనా సైనికులు చొచ్చుకుని వచ్చారని, వారిని నిలవరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రధానిని ప్రశ్నించారు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు, చైనా నుంచి ఆ దేశ సైనికులు మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటే మోడీ ఏం చేస్తున్నారని అన్నారు.

పెట్రోల్, డీజిల్‌పై మాట్లాడరేం..


ప్రధాని మోడీ రెండు విషయాలపై ఎప్పుడూ నోరు ఎత్తబోరని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ఒకటి- పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల.. రెండు చైనా దురాక్రమణ గురించి మాట్లాడటానికి మోడీకి ధైర్యం చాలట్లేదని అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు వంద రూపాయలను దాటినా దాని గురించి ఒక్క ప్రకటన కూడా మోడీ చేయట్లేదని చెప్పారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచులను ఆ పార్టీ నాయకులు అడ్డుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని, ఇప్పుడెందుకు ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌కు అనుమతి ఇస్తున్నారో అర్థం కావట్లేదని ఒవైసీ చెప్పారు.

English summary
AIMIM chief Asaduddin Owaisi said in Hyderabad that the PM Modi is afraid of speaking on China. Our 9 soldiers died in J&K, on Oct 24 India-Pakistan T20 match will happen:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X