వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక బస్సు పోయాక తేరుకున్న ఆర్టీసీ ! స్టీరింగ్‌లకు తాళాలు !

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దొంగలకు అవకాశం రావాలే గాని రైలును కూడా దొంగతనం చేసేందుకు వెనుకాడరేమో..! రాజధానిలోని సిటీ బస్‌స్టేషన్‌(సీబీఎస్‌)లో నిలిపిన ఆర్టీసీ బస్సును దొంగలు దర్జాగా తస్కరించి నాందేడ్‌ తరలించి తుక్కు కింద మార్చేందుకు చేసిన ప్రయత్నం ఆర్టీసీని కలవరపాటుకి గురిచేసింది. చోరీ తర్వాత బస్సు జాడను కనిపెట్టడంలో కాస్త ఆలస్యం జరిగినా రేకు ముక్క కూడా దొరికి ఉండేది కాదు. సకాలంలో జాడ తెలియటంతో బాడీ మాయమైనా.. కనీసం ఛాసిస్‌ను అయినా స్వాధీనం చేసుకోగలిగారు మన అదికారులు.

బస్సు చోరీ నేపథ్యంలో అధికారుల్లో చలనం..! ముందు రాజధాని సిటీ బస్సులకు ఏర్పాటు..!!

బస్సు చోరీ నేపథ్యంలో అధికారుల్లో చలనం..! ముందు రాజధాని సిటీ బస్సులకు ఏర్పాటు..!!

ఇప్పుడు ఇదే అంశం ఆర్టీసీ కలవరానికి కారణమైంది. నైట్‌హాల్ట్‌ బస్సులు ఎక్కడపడితే అక్కడ నిలిపి ఉంటాయి. ఇక దొంగలు రెచ్చిపోతే సులభంగా బస్సులు మాయమై తుక్కుగా మారిపోవడం ఖాయం. ఎంతో చాకచక్యంగా జరిగిన తాజా చోరీ ఇతర దొంగలకు దారి చూపినట్టవుతుందని అధికారులు ఇప్పుడు హైరానా పడుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల స్టీరింగ్‌ను లాక్‌ చేసేలా కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.

స్టీరింగ్‌ను లాక్‌ చేసేలా..! పకడ్బందీ వ్యవస్థ..!!

స్టీరింగ్‌ను లాక్‌ చేసేలా..! పకడ్బందీ వ్యవస్థ..!!

సాధారణంగా వాహనాలకు తాళం చెవితో లాక్‌ చేసే వెసులుబాటు ఉంటుంది. లాక్‌ పడిన తర్వాత ఇంజిన్‌ను ఆన్‌ చేయటం సాధ్యంకాదు. వాటికి ఉండే ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ పనిచేయనందున బస్సును చోరీ చేయటం అంత సులువు కాదు. హైదరాబాద్‌లో 3,700 బస్సులుంటే వాటిల్లో కీ సిస్టం ఉన్నవి కేవలం 500 మాత్రమే. మిగతావి పాత మోడల్‌ బస్సులు. వీటిల్లో ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ సిస్టం లేదు. వాటిని తాళం చెవితో లాక్‌ చేయటం సాధ్యం కాదు. ఇప్పుడు చోరీకి గురైంది కూడా అలాంటి బస్సే. భవిష్యత్తులో ఇలాంటి బస్సులు చోరీకి గురికాకుండా ఉండాలంటే కచ్చితంగా లాకింగ్‌ ఏర్పాటు అవసరం. ఇందుకోసం స్టీరింగ్‌కు లాక్‌ చేసేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

చోరీ చేయకుండా స్టీరింగ్‌ లాకింగ్‌ వ్యవస్థ..! కసరత్తు చేస్తున్న అదికారులు..!!

చోరీ చేయకుండా స్టీరింగ్‌ లాకింగ్‌ వ్యవస్థ..! కసరత్తు చేస్తున్న అదికారులు..!!

స్టీరింగ్‌ తిరగకుండా దాన్ని బంధించే ఏర్పాటుకు ఆదేశించారు ఉన్నాతాదికారులు. ఇందుకోసం మూడు రకాల డిజైన్లను పిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వాటిల్లో ఒకదాన్ని ఎంపిక చేసి శనివారం ఆదేశాలు ఇవ్వనున్నారు. ఆర్టీసీ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వినోద్‌కుమార్‌ తొలుత సిటీ బస్సుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత దీన్ని మిగతా జిల్లాల్లో అనుసరించనున్నారు. నగరంలో నైట్‌హాల్ట్‌ సర్వీసులు 900 ఉన్నాయి. వాటికి ఈ కొత్త ఏర్పాటు చేయనున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా తెరుచుకోని తాళం..! పటిష్ట భద్రత..!!

ఎన్ని ప్రయత్నాలు చేసినా తెరుచుకోని తాళం..! పటిష్ట భద్రత..!!

స్టీరింగ్‌ తిరగకుండా చేసే ఏర్పాటు బలంగా ఉండేలా చూస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దాన్ని రంపంతో కోసే వీలు ఉండకుండా చేస్తున్నారు. సుత్తిలాంటి దానితో మోది విరచాల్సి ఉంటుంది. అది చడీచప్పుడు కాకుండా జరిగే వీలు లేనందున చోరీ సాధ్యం కాదన్నది అధికారుల ఆలోచన. ఇక నైట్‌హాల్ట్‌ బస్సులుండే చోట్ల భద్రతను సైతం పెంచారు. దీంతో మన ఆర్టీసి బస్సులకు యమ భద్రత ఏర్పాటు చేసినట్టవుతుందని అదికారులు చెప్పుకొస్తున్నారు.

English summary
The attempt to theft the RTC bus in the city bus stand (CBS) in the capital to Nanded was moved by the theives and tried to scrab it. There was not a single piece of foil that was delayed to find a bus after the theft. With the passage of time, the body was able to take away at least Chasis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X