• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓట్ల గ‌ల్లంతు వ‌ల్ల మా మెజారిటీ త‌గ్గింది..! త‌ల‌సాని గెలుపు అసంతృప్తిని మిగిల్చింద‌న్న కేటీఆర్..!

|

హైదరాబాద్: ఓట్లు గ‌ల్లంతు కావ‌డంతో తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థుల‌కు అనుకున్న మెజారిటీ రాలేద‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కె.తారాక‌రామారావు అన్నారు. ముఖ్యంగా స‌న‌త్ న‌గ‌ర్ నియొజ‌క వ‌ర్గంలో త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ గెలుపు త‌న‌కు అసంత్రుప్తిని మిగిల్చింద‌ని, ఓట్ల గ‌ల్లంతే ఇందుకు కార‌ణ‌మ‌ని కేటీఆర్ తెలిపారు. రాబోవు ఎన్నిక‌ల్లో ఇలాంటి అవ‌రోదాల‌ను అదిగ‌మిస్తామ‌వ‌ని చెప్పుకొచ్చారు. ఒక్క ఖ‌మ్మం మిన‌హా మిగిలిన అన్ని పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాలు గులాబీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయ‌ని కేసీఆర్ జోష్యం చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం బుధవారం జలవిహార్ లో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.టీ.ఆర్ ప్రసంగించారు.

  మీలో ఒకడిగా..మీ సోదరుడిగా.. మీకే అంకింతం : కేటీఆర్ | Oneindia Telugu
   కొంప ముంచిన ఓట్ల గ‌ల్లంతు..! పొర‌పాట్లు పున‌రావ్రుత్తం కాకుండా చూడాల‌న్న కేటీఆర్..!!

  కొంప ముంచిన ఓట్ల గ‌ల్లంతు..! పొర‌పాట్లు పున‌రావ్రుత్తం కాకుండా చూడాల‌న్న కేటీఆర్..!!

  తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలు మళ్ళీ విశ్వాసం పొందే పరిస్థితి లేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. ఈ రోజు తెలంగాణలో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల వైపే దేశం చూస్తోంద‌ని ఆయ‌న అన్నారు. రైతు బంధు పథకాన్ని మూడు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రైతు బంధు పథకాన్ని పేరు మార్చి అమలు చేస్తారని వార్తలు వస్తున్నాయన్నారు.

   తెలంగాణ ప‌థ‌కాల వైపు దేశం చూపు..! రైతుబంధు ఆద‌ర్శ ప‌థ‌కం అన్న కేటీఆర్..!

  తెలంగాణ ప‌థ‌కాల వైపు దేశం చూపు..! రైతుబంధు ఆద‌ర్శ ప‌థ‌కం అన్న కేటీఆర్..!

  రెండో సారి టీఆర్ఎస్ సాధించిన విజయం దేశం లోనే ఓ రికార్డు అన్నారు. అసెంబ్లీ రద్దు ,కొన్ని గంటల వ్యవధి లోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించి కెసిఆర్ సంచలనం సృష్టించారని, తెలంగాణ కోసం పార్టీ పెట్టి రాష్ట్రాన్ని సాధించిన అరుదైన నాయకుడు కెసిఆర్ అని పొగిడారు. ఆయన నాయకత్వం తోనే బంగారు తెలంగాణ సాధ్యమని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నార‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

   ఓట్ల శాతం పెరిగినా మెజారిటీ త‌గ్గింది..! నిరాశ పరిచిన త‌ల‌సాని విజ‌యం అంటున్న కేటీఆర్..!

  ఓట్ల శాతం పెరిగినా మెజారిటీ త‌గ్గింది..! నిరాశ పరిచిన త‌ల‌సాని విజ‌యం అంటున్న కేటీఆర్..!

  గతం లో కన్నా టీఆర్ఎస్ కు 14 శాతం ఓట్లు పెరిగాయని, అసెంబ్లీ లో 75 శాతం సీట్లు సాధించామ‌ని, ఇంత పెద్ద విజయం సాధించామని అహంకారం పనికి రాదన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఓట్లు వేశారని. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 సీట్లుంటే మజ్లీస్ తో కలిసి 25 సీట్లు గెలిచామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల లాంటి ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం అయ్యాయన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ 65 నుంచి 75 వేల మెజారిటీ తో గెలిచి ఉండి ఉండాల్సింద‌ని అన్నారు. మెజారిటీ తగ్గినందుకు నాకు వ్యక్తిగతంగా బాధ గా ఉందని ఓట్ల గల్లంతు కూడా మెజారిటీ తగ్గడానికి కారణం అన్నారు కేటీఆర్.

  పార్టీ కోసం ప‌నిచేసిన వారిని ఆదుకుంటాం..! భ‌రోసా ఇచ్చిన రామారావు..!

  పార్టీ కోసం ప‌నిచేసిన వారిని ఆదుకుంటాం..! భ‌రోసా ఇచ్చిన రామారావు..!

  కష్టపడి పని చేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల లో ప్రాధాన్యత ఉంటుందని, పార్లమెంటు ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే వచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 16 పార్లమెంటు సీట్లు గెలిస్తే శాసించే స్థితి కి చేరుకుంటామ‌న్నారు కేటీఆర్. కేసీఆర్ కు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధిస్తారన్నారు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్.

  English summary
  Did not want to make the majority of their candidates were missing votes in pre elections, trs working president KTR said. In particular, Sanath Nagar constituency Srinivasa Yadav's victory was inconvenient for him said ktr in jalavihar.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X