వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఔటర్ ప్రమాద మృతదేహాలు వరంగల్ కు చేరిక, మంగళవారం నాడు అంత్యక్రియలు

హైద్రాబాద్ పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన శివకృష్ణతో పాటు ఆయన స్నేహితుల మృతదేహాలకు మంగళవారం నాడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. భాస్కర్ అనే స్నేహితుడిని కోయం

By Narsimha
|
Google Oneindia TeluguNews

వరంగల్ :సోమవారం తెల్లవారుజామున హైద్రాబాద్ పెద్ద అంబర్ పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బుడ్డా శివకృష్ణతో పాటు ఆయన ముగ్గురు స్నేహితులు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను సోమవారం సాయంత్రం వరంగల్ కు తీసుకువచ్చారు. మంగళవారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఈ ప్రమాదంలో మరణించిన శివకృష్ణ మూడేళ్ళ కూతురు ఉంది. తన తండ్రి మరణం తెలియని కూతురు శివకృష్ణ మృతదేహం వద్ద రోధిస్తోన్న కుటుంబసభ్యులను దిగాలుగా చూస్తోంది. తాత, నానమ్మ,తల్లి ఎందుకు ఏడుస్తున్నారో ఆమెకు అర్థం కావడం లేదు. అయితే ఈ ఘటనను మూడేళ్ళ చిన్నారి మాత్రం అర్థం చేసుకోలేకపోయింది.వరంగల్ రూరల్ మండలానికి చెందిన ఈ కుటుంబం హన్మకొండలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకొంది. శివకృష్ణ కుటుంబసభ్యులు హన్మకొండలో ప్రైవేట్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.

outer accident dead bodies brought back form hyderabad

ఈ ప్రమాదంలో మరణించిన శ్రీకాంత్, రాజు కూడ వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల మండలానికి చెందినవారు. బెల్లంపల్లి కి చెందిన శశిధర్ బిటెక్ పూర్తి చేశాడు. శ్రీకాంత్ ,రాజులు ఎస్ ఐ పోస్టులకు ధరఖాస్తు చేశారు.ఆదివారం నాడు వారు తమ స్నేహితుడు భాస్కర్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దించేందుకు వచ్చారు. భాస్కర్ శంషాబాద్ కు వెళ్తున్నాడు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భాస్కర్ ను దించి వరంగల్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొందని వీరి స్నేహితుడు వంశీ చెప్పాడు. స్నేహితుడిని వీడ్కోలు పలికేందుకు వెళ్ళి తిరిగిరాని లోకాలకు వెళ్ళారు. ఈ ప్రమాదం నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

English summary
Shiva Krishna’s father Shankaraiah, his mother and wife were inconsolable. His three month old daughter is too young to understand why her mother and grandparents are crying. Though the family belongs to Parkal of Warangal Rural district, they settled in Hanamkonda and are running a private hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X