• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎప్పుడేం జరిగింది: వివాదం నుంచి రోహిత్ వేముల ఆత్మహత్య వరకు

By Nageswara Rao
|

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనతో దేశ వ్యాప్తంగా విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోడానికి ముందు జరిగిన వివాదం నుంచి ఆత్మహత్యకు దారితీసిన కారణాలను టైమ్‌లైన్ రూపంలో ఇస్తున్నాం.

All Stories about rohit suicide

జులై 30, 2015:

* ముంబై పేలుళ్ల కేసులో నిందితుడైన యాకూబ్‌ మెమెన్‌ ఉరిని నిరసిస్తూ హెచ్‌సీయూలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద కొందరు విద్యార్థులతో కలిసి అంత్యక్రియల అనంతరం జరిపే ప్రార్థనలను అంబేద్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌(ఏఎస్‌ఏ) నిర్వహించింది. దీనిపై అదేరోజే ఏబీవీపీ విద్యార్ధి సంఘం నిరసన వ్యక్తం చేసింది.

ఆగస్టు 1:

* ఢిల్లీ యూనివర్సిటీలో ప్రదర్శించిన ‘ముజఫర్‌నగర్‌ బాకీహై' అనే డాక్యుమెంటరీని హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఏబీవీపీ ప్రదర్శించింది. ఈ డాక్యమెంటరీపై అంబేద్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌(ఏఎస్‌ఏ) నిరసన వ్యక్తం చేసింది. ఈ * నిరసనపై ఏఎస్‌ఏ సభ్యులను గూండాలుగా పేర్కొంటూ ఏబీవీపీ విద్యార్థి సుశీల్ కుమార్ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

Outrage over dalit scholar Rohith Vemula suicide: Timeline

ఆగస్టు 2:

* ఈ విషయపై అంబేద్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌(ఏఎస్‌ఏ)కు చెందిన 40 మంది విద్యార్థులు ఫేస్‌బుక్‌లో కామెంట్‌ పోస్ట్‌ చేసిన విద్యార్థి దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరారు. దీనిపై ఏబీవీపీ విద్యార్ధి సంఘం నాయకుడు సుశీల్ * కుమార్ లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పారు.

ఆగస్టు 3:

ఆ మరుసటి రోజు తెల్లవారు జామున ఏబీవీపీ విద్యార్ధి సంఘం నాయకుడు సుశీల్‌కుమార్‌పై దాడి జరిగిందని, సర్జరీ కూడా జరిగిందంటూ అతని తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ సర్జరీ వేరే కారణాల వల్ల జరిగిందని అందుకు తాము బాధ్యులం కాదని ఏఎస్‌ఏ విద్యార్థులు పేర్కొన్నారు.

ఆగస్టు 4:

* సుశీల్‌ కుమార్‌పై దాడికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన చేశారు. కాగా, దీనిపై విచారణ కమిటీ వేశామని దాని ఆధారంగా చర్య తీసుకుంటామని తాత్కాలిక వీసీ శర్మ హామీ ఇచ్చారు.

ఆగస్టు 5:

* దీంతో ఏబీవీపీ నాయకుడు సుశీల్‌ కుమార్‌పై దాడి జరిగిందనడానికి సాక్ష్యాధారాలు లేవని విచారణ కమిటీ తొలి నివేదికలో పేర్కొంది.

Outrage over dalit scholar Rohith Vemula suicide: Timeline

ఆగస్టు 10:

* ఆ తర్వాత అంబేద్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌(ఏఎస్‌ఏ)కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్‌ గదికి వెళ్లారని, ఆ ఐదుగురిని ఆరు నెలల పాటు క్యాంపస్‌ నుంచి బహిష్కరించాలని ఆ కమిటీ తుది నివేదికలో చెప్పింది.

* అనంతరం సెప్టెంబరులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పూర్తిస్థాయి వీసీని నియమించారు.

* కుల రాజకీయాలకు, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు యూనివర్సిటీ నిలయంగా మారిందంటూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు.

* క్యాంపస్‌లో విద్యార్ధుల మధ్య గొడవలు, మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతుందంటూ అందులో పేర్కొన్నారు.

* దీంతో సెప్టెంబరు చివర్లో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఒత్తిడితో వీసీ అప్పారవు పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేశారు.

* గతంలో కూడా కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్న సందర్భాలున్నాయిని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

* విద్యార్థుల చదువులకు భంగం కలిగించకుండా కమిటీ నిర్ణయం తీసుకోవాలని ఈ కొత్త కమిటీ అభిప్రాయపడింది.

* ఆ తర్వాత నవంబరు మధ్యలో తన కుమారుడిపై దాడి జరిగిందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాల్సిందిగా ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ తల్లి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది.

* దీనిపై ప్రత్యేక కమిటీని నియమించామని, ఆ కమిటీ నివేదిక రాగానే అఫిడవిట్‌ దాఖలు చేస్తామని యూనివర్సిటీ హైకోర్టుకు తెలిపింది.

నవంబరు 27:

* ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సిఫారసుతో ఐదుగురు విద్యార్థులపై బహిష్కరణ వీసీ అప్పారావు ఆమోద ముద్ర వేశారు. ఈ బహిష్కరణ నిబంధన సెమిస్టర్‌ (6నెలల) వ్యవధి వరకూ వర్తిస్తుందని అందులో ఆయన పేర్కొన్నారు.

డిసెంబరు 20:

* ఐదుగురు విద్యార్థులను యూనివర్సిటీ హాస్టల్‌ ఖాళీ చేయాల్సిందిగా చీఫ్‌ వార్డెన్‌ ఆదేశించారు.

* దీంతో విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కమిటీ ఐదుగురు విద్యార్థులకు విధించిన శిక్షను తగ్గించింది. ఐదుగురు విద్యార్ధులను క్యాంపస్‌ నుంచి బహిష్కరించడానికి బదులు విద్యార్థులపై ఆంక్షలు విధించింది. * విద్యార్ధుల చదువుకు ఇబ్బంది కలగకుండా కేవలం హాస్టల్‌లో ఉండటం, యూనివర్సిటీ ఎన్నికల్లో పాల్గొనడం, ఆరుబయట ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించే అంశాల్లోనే చర్యలు తీసుకున్నారు.

జనవరి 3, 2016 :

* బహిష్కరణకు గురైన ఐదుగురు విద్యార్థులు ఆరోజు నుంచి ఆరు బయటే ఉంటూ తమ నిరసన తెలియజేశారు.

* జనవరి తొలివారంలో సెలవుల అనంతరం యూనివర్సిటీ ప్రారంభమైన రోజు నుంచి ఆ ఐదుగురు యూనివర్సిటీ బయటే నిద్రించారు. కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్ధులు హైకోర్టును ఆశ్రయించారు.

* వీరి పిటిషన్‌తో పాటు సుశీల్‌కుమార్‌ తల్లి పిటిషనను కూడా కలిపి కోర్టు విచారణకు చేపట్టింది.

* జనవరి 18న ఈ కేసు విచారణ జరగాల్సి ఉంది.

* హైకోర్టు కేసు పూర్తయ్యే వరకు ఐదుగురు విద్యార్థులను యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో ఉండేందుకు అనుమతించినట్టు విద్యార్థి సంక్షేమ వ్యవహారాల డీన్ కార్యాలయం వెల్లడించింది. ఆ ప్రతిపాదనను విద్యార్థి జేఏసీ తిరస్కరించింది.

జనవరి 17:

* న్యూ రీసెర్చ్‌ స్కాలర్‌ హస్టల్‌లోని రూంలో సీలింగ్‌ ఫ్యానకు ఉరివేసుకుని రోహిత్ వేముల మరణించాడు. అనంతరం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావుపై కేసు నమోదైంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
While the University of Hyderabad has turned into a virtual battlefield with students protesting against the suicide of research scholar Rohith Vemula, there is nationwide outrage over the death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more