తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు: సగం కంటే ఎక్కువ హైదరాబాద్లోనే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 200 మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 కరోనా పరీక్షలను నిర్వహించగా.. కొత్తగా 219 కేసులు నమోదయ్యాయి.
ఒక్క రోజు వ్యవధిలో 76 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1259 యాక్టివ్ కేసులున్నట్లు యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క హైదరాబాద్లోనే 164 కేసులున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఢిల్లీ, మహారాష్ట్రలో భారీగా వెలుగుచూసిన కరోనా కేసులు
ఒక నెల రోజుల విరామం తరువాత.. ఢిల్లీలో రోజువారీ కోవిడ్ -19 కాసేలోడ్ మంగళవారం 1000 మార్కును అధిగమించింది, రాజధాని నగరంలో గత 24 గంటల్లో 1,118 తాజా కరోనావైరస్ ఇన్ఫెక్షన్లతో పాటు రెండు మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది. మంగళవారం నమోదైన కొత్త కేసులతో, ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య 19,14,530కి పెరిగింది. మరణాల సంఖ్య 26,223కి చేరుకుంది.
ఇంతలో, నగరంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 6.50 శాతానికి తగ్గింది, అయితే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 3,177కి పెరిగింది. ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య 19,14,530కి పెరిగింది. మరణాల సంఖ్య 26,223కి చేరుకుందని డిపార్ట్మెంట్ తన తాజా బులెటిన్లో తెలిపింది.
మరోవైపు, మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,956 కొత్త కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2165 మంది కోలుకోగా, 4 మరణాలు నమోదయ్యాయి. NIV పుణె తాజా నివేదిక ప్రకారం.. థాణే నగరంలో మరో 2 BA.5 వేరియంట్ల రోగులు కనుగొనబడ్డారు. వారు మే 28, 30న వ్యాధి బారిన పడ్డారు, హోమ్ ఐసోలేషన్లో కోలుకున్నారు.మహారాష్ట్రలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,267కి చేరాయి.