తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రంపై ఆగ్రహం: బందులో 9 లక్షల మందికి పైగా కెమిస్ట్‌లు

అన్నిరకాల వస్తువుల మాదిరిగానే ఆన్‌లైన్‌లో మందులు (వైద్య సంబంధ డ్రగ్స్) విక్రయించడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ అనుమతిని నిరసిస్తూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి/తిరుపతి: అన్నిరకాల వస్తువుల మాదిరిగానే ఆన్‌లైన్‌లో మందులు (వైద్య సంబంధ డ్రగ్స్) విక్రయించడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ అనుమతిని నిరసిస్తూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నారు.

బంద్ నేపథ్యంలో ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. మెడికల్ వ్యవస్థను సర్వనాశనం చేయనున్న ఆన్‌లైన్‌లో మందుల సరఫరా విధానాన్ని తక్షణమే రద్దుచేసే వరకు తమ పోరాటం సాగుతుందని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.

Over 9 lakh chemists will go on strike today.

ఎమెర్జెన్సీ మెడికల్ షాప్స్ తీసి ఉంటాయి

ఎమర్జెన్సీ సర్వీస్ ఫార్మసీలు, ఆసుపత్రుల వద్ద అవసమరయ్యే చోట మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయని రిటెయిల్ డిస్ట్రిబ్యూటర్స్ కెమిస్ట్ అసోసియేషన్ సందీప్ నగారియా చెప్పారు.

దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షలకు పైగా కెమిస్ట్స్ బందులో పాల్గొంటారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) తెలిపింది. కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, స్పందన లేదని అందుకే ఈ నిరసన గళం అని చెబుతున్నారు.

మరోవైపు, హోటల్ రంగంపై జిఎస్టీ విధానంలో పెంచిన పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ మే 30వ తేదీన దక్షిణాది రాష్ట్రాల్లో ఒకరోజు పాటు హోటళ్ల బంద్ నిర్వహించనున్నట్లు ఏపీ హోటళ్ల అసోసియేషన్ నాయకులు చెప్పారు.

English summary
They are protesting the stringent rules on the sale of medicines. However, emergency service pharmacies in and around hospitals will remain open, Sandeep Nangia, president, Retail Distributors Chemists Association said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X