వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.3 లక్షలకు పైగా లావాదేవీలు చేస్తే షాక్: అంతే ఫైన్, తీసుకున్నోళ్లకే..

రూ.కోట్లకు కోట్లు ఇంట్లో దాచుకునే నల్లధనం కుబేరులకు షాక్. ఇప్పటి దాకా ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే వాళ్లిచ్చారు.. వీళ్లిచ్చారని లెక్కలు చెప్పి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ.కోట్లకు కోట్లు ఇంట్లో దాచుకునే నల్లధనం కుబేరులకు షాక్. ఇప్పటి దాకా ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే వాళ్లిచ్చారు.. వీళ్లిచ్చారని లెక్కలు చెప్పి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.

రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలు చెల్లవని ఫిబ్రవరి 1న బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి చెల్లని లావాదేవీల్లో ఎంత మొత్తం పట్టుబడితే అంత మొత్తం జరిమానాగా చెల్లించాలని తాజాగా కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్మూత్ అధియా వెల్లడించారు.

ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. నల్లధనం తయారు కాకుండా నిరోధించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. మరో విషయమేమంటే.. నగదు స్వీకరించిన వారే జరిమానా చెల్లించాలి.

 Over Rs 3 lakh cash deal? Pay equal fine

ఈ విషయమై కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్‌ముఖ్‌ అధియా మాట్లాడారు. పరిమితికి మించి నగదు ద్వారా లావాదేవీలు జరిపితే జరిమానాలు కూడా అధికంగా ఉంటాయన్నారు. ఎంత నగదు తీసుకున్నారో అంతే మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

<br>3 లక్షల వరకు మినహాయింపు: ఇదీ జైట్లీ ఆదాయ పన్ను..., ఎవరు ఎంత కట్టాలి?
3 లక్షల వరకు మినహాయింపు: ఇదీ జైట్లీ ఆదాయ పన్ను..., ఎవరు ఎంత కట్టాలి?

నగదు తీసుకున్నవారే ఈ జరిమానాను కట్టాల్సి ఉంటుందన్నారు. ఉదాహరణకు రూ.4లక్షల నగదు లావాదేవీ జరిపితే.. రూ.4 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నగదు తీసుకున్న వారిపైనే ఈ భారం పడుతుందని వివరించారు.

ఎవరైనా నగదు ఇచ్చి ఖరీదైన గడియారాన్ని కొనుగోలు చేస్తే ఆ దుకాణం యజమానే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నగదుతో కాకుండా డిజిటల్‌ పద్ధతుల లావాదేవీలను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.

English summary
In a bid to check generation of black money, a steep penalty awaits those accepting cash in excess of Rs 3 lakh, beginning April 1, to settle any transaction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X