వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోటి దూలాయ‌న‌మ‌హాః..! టికెట్ గోంవిందాయ‌న‌మ‌హాః..! బండ్ల గణేష్ ను బావిలో తోసిన కాంగ్రెస్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : బండ్ల గణేష్ కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ! | Oneindia Telugu

హైద‌రాబాద్: మొద‌ట హాస్య న‌టుడు..! తర్వాత నిర్మాత అవ‌తారం..! పెద్ద హీరోల‌తో సినిమాల నిర్మాణం..! పెద్ద నిర్మాత‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు.. ఇంకేముంది సారు చూపు రాజ‌కీయాల‌వైపు మ‌ళ్లింది. రాజ‌కీయ అరంగేట్రం కోసం 120 ఏళ్ల అనుభ‌వం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎంచుకుని ఆ పార్టీ అద్యక్షుడు రాహుల్ గాందీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పేసుకున్నారు. ఇంత వ‌ర‌కూ క‌థ బాగానే ఉన్న‌ప్ప‌టికి ఆ త‌ర్వాత క‌థ‌లో ట్విస్ఠ్ మొద‌లైంది.

కేసీఆర్ మాటలపై కేటీఆర్ కు గురి లేదా..! 100 సీట్లు రావా?కేసీఆర్ మాటలపై కేటీఆర్ కు గురి లేదా..! 100 సీట్లు రావా?

తన‌కు, తాను కోరుకున్న చోట కాంగ్రెస్ టికెట్ ఇవ్వ‌బోతున్నట్టు, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్న‌ట్టు, ఉన్న ప‌ళంగా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తీర్చ‌బోతున్న‌ట్టు, న‌గ‌రంలోని దోమ‌ల‌ను త‌రిమికొట్ట‌బోతున్న‌ట్టు విచిత్ర ప్ర‌క‌ట‌న‌లు చేసారు స‌ద‌రు కామెడీ ఆర్టిస్ఠ్ బండ్ల గ‌ణేష్. బండ్ల గ‌ణేష్ ఎక్క‌డ, ఎవ‌రితో ఏం మాట్లాడాడో సునిశితంగా ప‌రిశీలించిన కాంగ్రెస్ అదిష్టానం అత‌నికి ఎంత నోటి దూల ఉందో ఓ అంచ‌నాకి వ‌చ్చింది. నోటీ దూల‌తో రాబోయే కాలంలో ఎలాంటి విప‌త్క‌ర ప‌రిణామ‌లు చోటు చేసుకుంటాయోన‌ని ఊహించి ముందుగానే గ‌ణేష్ ని క‌ట్ట‌డి చేసింది కాంగ్రెస్ పార్టీ.

రాజ‌కీయాలంటే కామెడీ సినిమా కాదు..! బండ్ల గ‌ణేష్ కి 3డి సినిమా చూపించిన కాంగ్రెస్..!!

రాజ‌కీయాలంటే కామెడీ సినిమా కాదు..! బండ్ల గ‌ణేష్ కి 3డి సినిమా చూపించిన కాంగ్రెస్..!!

ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తానా అని ఆశగా ఎదురుచూస్తున్నానంటూ బండ్ల గణేష్ అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో 105 సీట్లు పక్కా అంటూ అతి తెలివి చూపించారు. ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన కొన్ని కామెంట్లూ వివాదాస్పదమయ్యాయి. నోటికొచ్చింది మాట్లాడుతూ చివరకు పార్టీకే తలనొప్పిగా మారిపోయారు. రాజ‌కీయాలంటే సినిమాలో కామెడీ సీన్ లో న‌టించినంత సులువు కాద‌ని చెప్ప‌క‌నే చెప్పింది పార్టీ. తెర మీద కామెడీ చేస్తే ప్రేక్ష‌కులు న‌వ్వుతారో న‌వ్వ‌రో తెలియ‌ది గాని రాజ‌కీయాల్లో కామెడీ చేస్తే ఏమౌతుందో కాంగ్రెస్ పార్టీ బండ్ల గ‌ణేష్ కి శాంపిల్ రుచి చూపించింది.

కొంప ముంచిన నోటీ దూల..! గ‌ణేష్ టికెట్ ఇవ్వ‌ని కాంగ్రెస్..!!

కొంప ముంచిన నోటీ దూల..! గ‌ణేష్ టికెట్ ఇవ్వ‌ని కాంగ్రెస్..!!

సినీ నిర్మాతగా, కామెడీ ఆర్టిస్టుగా మాత్రమే ఇన్నాళ్లూ జనాలకు తెలుసు. కొద్ది రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి మూడు రంగుల కండువా కప్పుకొన్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. ఇదంతా చూసినవాళ్లు బండ్ల గణేష్‌కు పలుకుబపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం ఖాయమైపోయింది. టికెట్ పక్కా చేసుకున్న తర్వాతనే పార్టీలో చేరారన్న ప్రచారం జరిగింది. బండ్ల గణేష్ అయితే ఏకంగా తాను ఎమ్మెల్యేను అయిపోయాను అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. కానీ చివరకు ఏమైంది..? బండ్ల గణేష్‌ కామెడీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పంచ్ ఇచ్చింది. టికెట్ ఇవ్వకుండా చేతులు దులిపేసుకుంది. రెండు జాబితాల్లోనూ బండ్ల పేరు గ‌ల్లంతైంది.

 రాజ‌కీయాల్లో సీరియ‌స్ నెస్ లేక‌పోతే అంతే..! బండ్ల గ‌ణేషే ఉదాహ‌ర‌ణ‌..!!

రాజ‌కీయాల్లో సీరియ‌స్ నెస్ లేక‌పోతే అంతే..! బండ్ల గ‌ణేషే ఉదాహ‌ర‌ణ‌..!!

బండ్ల గణేష్ ఓవర్ యాక్షనే ఆయ‌న కొంప ముంచిందన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నుంచి ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. టీవీ ఛానెళ్లకు వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. యూట్యూబ్ ఛానెళ్లను కూడా వదల్లేదు. తాను ఎమ్మెల్యే ఐపోయిన‌ట్టుగా వార్తా ఛానెళ్ల స్టూడియోల‌లోనే ప్రమాణ స్వీకారం చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తానా అని ఆశగా ఎదురుచూస్తున్నానంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో 105 సీట్లు పక్కా అంటూ జోష్యం కూడా చెప్పేసారు. ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన కొన్ని కామెంట్లూ వివాదాస్పదమయ్యాయి. నోటికొచ్చింది మాట్లాడుతూ చివరకు పార్టీకే తలనొప్పిగా మారిపోయారు. ఆయన కామెడీ చేష్టలతో తెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ కమెడియన్ అన్నట్టుగా వ్యవహరించి స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్నారు.

ఎటూ తేల‌ని గ‌నేష్ భ‌విత‌వ్యం..! రాజ‌కీయాలా ..! మ‌జాకా..!!

ఎటూ తేల‌ని గ‌నేష్ భ‌విత‌వ్యం..! రాజ‌కీయాలా ..! మ‌జాకా..!!

ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ కామెడీ చేసిన బండ్ల గణేష్‌కు చివరకు ఏ సెంటరూ మిగల్లేదు. షాద్‌నగర్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌లో ఏదో ఓ స్థానంలో పోటీ చేయాలనుకున్నారు. షాద్‌నగర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ రెడ్డికి కేటాయించగా, రాజేంద్రనగర్‌ స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. రెండో జాబితాలో జూబ్లీహిల్స్‌ను విష్ణువర్ధన్ రెడ్డికి ఇచ్చేశారు. దీంతో బండ్ల ఆశలు పెట్టుకున్న స్థానాలన్నీ గల్లంతైపోయాయి. తాను ఎమ్మెల్యే ఐపోతానంటూ అతిగా ప్ర‌వ‌ర్తించిన బండ్ల గణేష్‌కు, ఎమ్మెల్యే కావడం కాదు కదా, చివరకు టికెట్ కూడా దక్కని దారుణమైన పరాభవాన్ని కొని తెచ్చుకున్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ, అనవసరమైన కామెంట్లు చేస్తున్న బండ్ల గణేష్‌ను కాంగ్రెస్ పార్టీ కావాలనే అదఃపాతాళానికి తొక్కింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో కామెడీ యాక్ట‌ర్ రాజ‌కీయాల్లో ట్రాజెడీ యాక్ట‌ర్ గా రూపాంత‌రం చెందిన‌ట్టైంది.

English summary
Bandla Ganesh became headache to the congress party. The politics not the comedy movie in the congress aspect. If the comedy on the screen does not seem to laugh at the audience, but Congress party has shown bitter taste to the bandla ganesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X