హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదృష్టం బాగుండబట్టి.. లేదంటే?: అర్థరాత్రి బీఎండబ్ల్యూ బీభత్సం.. వణికిపోయారు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొండాపూర్‌ శ్రీరాంనగర్‌ కాలనీలో అర్ధరాత్రి ఓ బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించి కారు నడిపిన యువకులు ముందు వెళ్తున్న వాహనాలను అతివేగంతో ఢీకొట్టారు. ప్రమాదం అనంతరం కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

అసలేం జరిగింది:

అసలేం జరిగింది:

గురువారం అర్ధరాత్రి 12.40 గం. సమయంలో ఓ బీఎండబ్ల్యూ కారు (టీఎస్‌ 09 ఈడీ 5040) ఓవర్ స్పీడుతో బొటానికల్‌ గార్డెన్‌ నుంచి మసీద్‌బండ వైపు రయ్యిమని దూసుకెళుతోంది.

శ్రీరాంనగర్‌కాలనీ మెడ్‌ప్లస్‌ స్టోర్‌వద్దకు రాగానే కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో ముందు వెళ్తున్న ఇనోవా కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇనోవాలో ప్రయాణిస్తున్న ముగ్గురిలో కృష్ణ అనే వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి.

హోండా సిటీని కూడా ఢీకొట్టి..:

హోండా సిటీని కూడా ఢీకొట్టి..:


ఇనోవాను ఢీకొట్టిన అనంతరం ఎదురుగా వస్తున్న మరో హోండా సిటీ కారును కూడా బీఎండబ్ల్యూ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కమల్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇనోవా కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా.. హోండా సిటీ కూడా చాలావరకు డ్యామెజ్ అయినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారులోని వ్యక్తులు కారు అక్కడే వదిలి పారిపోయారు.

అదృష్టం బాగుండబట్టి..:

అదృష్టం బాగుండబట్టి..:

ప్రమాద సమయంలో నిందితులు పీకలదాకా మద్యం సేవించి ఉంటారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200కి.మీ స్పీడుతో బీఎండబ్ల్యూ దూసుకొచ్చిందని తెలిపారు. అదృష్టం బాగుండబట్టి బతికి బట్ట కట్టామని, ఇనోవా కాకుండా మరేదైనా చిన్న వాహనం లేదా బైక్ అయితే కచ్చితంగా ప్రాణాలు పోయి ఉండేవని బాధితుడు సాయిచరణ్ వాపోయాడు.

కొత్త కారు.. కొని 4 రోజులే..:

కొత్త కారు.. కొని 4 రోజులే..:

ఇక హోండా సిటీ కారు యజమాని రాహుల్ మాట్లాడుతూ.. 'నాలుగు రోజుల క్రితమే కొత్త కారు కొనుగోలు చేశాం. మా అమ్మ-నాన్నలను కాచిగూడ రైల్వే స్టేషనులో దించేందుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది' అని చెప్పారు.

ఎవరిదా బీఎండబ్ల్యూ?:

ఎవరిదా బీఎండబ్ల్యూ?:

ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు యజమాని వివరాలను పోలీసులు సేకరించారు. ఆ కారు గోల్డెన్‌థీమ్‌ హోటల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట రిజిస్టరై ఉందని, దాని యజమాని తరుణ్‌రెడ్డి అని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ప్రమాదానికి కారణమైన వ్యక్తుల వివరాలు మాత్రం తెలియరాలేదని, వారు మద్యం తాగిందీ లేనిది కూడా ఇంకా తేల్చలేదని పోలీసులు స్పష్టం చేశారు.

English summary
An overspeeding BMW car has crashed Innova and Honda city car on the Kondapur road in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X