హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేరేవాళ్ళతో అఫైర్ నిజంకాదు, ఆ అబ్బాయిని అడగండి, ఆ వీడియోతో అవమానం: పాన్‌షాప్ ఓనర్ బాధితురాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన పాన్ షాప్ ఓనర్‌పైన బాధితురాలు మరోసారి అడిషనల్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉపేంద్ర తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని వాపోయారు.

చదవండి: బావా! నీతోనే ఉంటా: అక్క భర్తతో వివాహేతర సంబంధం, బావని వదల్లేక భర్త హత్యకు ప్లాన్

ఆయన భార్య ప్రీతితో తనకు ఎలాంటి గొడవ లేదన్నారు. న్యాయం కోసం తాను ఉపేంద్ర ఇంటికి వెళ్లానని చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా తన వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి తనను అవమానించారని వాపోయారు. తాను అతని వద్ద డబ్బులు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు నిరూపించాలన్నారు. అందుకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్నారు.

చదవండి: ఫేస్‌బుక్‌లో పరిచయం, మహిళా టెక్కీకి స్వీట్ పాన్ ఇచ్చి: పలుమార్లు రేప్, అశ్లీల వీడియోలతో బెదిరింపు

ఉపేంద్ర నుంచి ప్రాణహానీ

ఉపేంద్ర నుంచి ప్రాణహానీ

తనకు ఉపేంద్ర నుంచి, కుటుంబం నుంచి ప్రాణహానీ ఉందని బాధితురాలు ఆరోపించారు. తాను రూ.40 లక్షలు తీసుకున్నట్లు చెబుతున్నారని, అందుకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తాను ఇప్పటికే కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆధారాలతో ఫిర్యాదు ఇచ్చానని వెల్లడించారు.

ఇష్టం వచ్చినట్లు తిట్టారు

ఇష్టం వచ్చినట్లు తిట్టారు

నేను ఉపేంద్రను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు వార్తలు రావడం అవాస్తవమని బాధితురాలు అన్నారు. తనకు న్యాయం చేయమని మాత్రమే అడిగానని, డబ్బులు అడగలేదన్నారు. డబ్బు అడిగినట్లు, ఆయన భార్యకు విడాకులు ఇవ్వాలని తాను ఎప్పుడైనా చెప్పినట్లు, ఫోన్ రికార్డింగు చూపించవచ్చునని అన్నారు. వాళ్లు తనను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని, కానీ తాను చదువుకున్న దానిని అని, అందుకే అలా తిట్టలేనన్నారు. వారు అన్న తిట్లు కూడా చెప్పలేనన్నారు.

ఆ అబ్బాయి ఫోటో చూపించి అఫైర్ అంటున్నారు

ఆ అబ్బాయి ఫోటో చూపించి అఫైర్ అంటున్నారు

వేరే వాళ్లతోను తనకు ఎఫైర్స్ ఉన్నాయని చెప్పడం నిజం కాదని బాధితురాలు అన్నారు. ఓ అబ్బాయి ఫోటో చూపిస్తున్నారని, తాను డిగ్రీలో ఉన్నప్పుడు ఆ అబ్బాయితో స్నేహం ఉందని చెప్పారు. కానీ ఇతరులతో ఎఫైర్స్ ఉన్నాయని చెప్పడం సరికాదన్నారు. కావాలంటే అబ్బాయిని పిలిపించి అడగవచ్చునన్నారు. ఆధారాలు తీసుకు వచ్చి మాట్లాడాలన్నారు.

ఒరిజినల్ వీడియోలు చూపించాలి

ఒరిజినల్ వీడియోలు చూపించాలి

తాను బ్లాక్ మెయిల్ చేసినట్లు చెబుతున్నారని, ఒరిజినల్ వీడియో క్లిప్పింగులు ఇవ్వాలని బాధితురాలు అన్నారు. వారు చెబుతున్నవి అసలువి కాదన్నారు. నేను బ్లాక్ మెయిల్ చేసినట్లు నిరూపిస్తే ఇప్పుడే కేసు విత్ డ్రా చేసుకుంటానని చెప్పారు. కాగా, ఇటీవల ఓ పాన్ షాప్ ఓనర్.. టెక్కీని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్టైన విషయం తెలిసిందే.

English summary
Owner of a famous chain of pan shops in Hyderabad was arrested on charge of raping a techie. However, Upender, the owner of pan shops, contended that he was in a relationship with the woman for over years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X