మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా:16 శాతం వద్దు, 13 శాతం కావాలి, తేమ శాతం కోసం సిబ్బంది పట్టు, అన్నదాత ఆగచాట్లు..

|
Google Oneindia TeluguNews

అసలే కరోనా కాటు.. పంట విక్రయించే సమయంలో వర్షాల పోటు... దీంతో రైతులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తీరా పంట విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొస్తే తేమ శాతం పేరుతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. తేమ శాతం సరిగాలేదు.. పంట కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఆగ్రహించిన అన్నదాత రోడ్డెక్కాడు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నాడు.

వర్షంతో తడిసిప పంట..

వర్షంతో తడిసిప పంట..

మెదక్ జిల్లా వెల్దుర్తి సహకారం సంఘంలో గత నాలుగురోజుల నుంచి వరి పంట కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు పంటను తీసుకొస్తున్నారు. అయితే గత రెండురోజుల నుంచి వర్షం పడటంతో పంట తడిసిపోయింది. కొందరు రైతులు వరి పంటపై కవర్ కప్పకపోవడంతో పంట పూర్తిగా తడిసిపోయింది. కానీ అధికారులు మాత్రం కనికరం చూపడం లేదు. తడిసిప పంట కొనుగోలు చేయబోమని.. ఆరబెట్టాలని సూచిస్తున్నారు. ఆరబెట్టిన తర్వాత కూడా తేమ ఎక్కువ రావొద్దని.. అలా అయితే తాము తీసుకోబోమని పట్టుబడుతున్నారు.

13 శాతం..

13 శాతం..

తేమ శాతం 13 ఉండాలని మార్కెట్ సిబ్బంది చెబుతున్నారు. సాధారణ పంట కూడా 16 శాతం వరకు వస్తున్నాయి. దీంతో పంటను ఎక్కడ ఆరబెట్టాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటను కొనుగోలు చేయాలని అధికారులు కోరుతున్నారు. కానీ తేమ శాతం లేనిది తీసుకోబోం అని.. రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని మార్కెట్ సిబ్బంది చెబుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 600 కొనుగోలు కేంద్రాలు ఉన్న రోజు ఏదో సమస్య వస్తోంది. కానీ తేమ శాతంతో మాత్రం రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Recommended Video

Tested Negative People And States Situation After ICMR Advises Not to Use Rapid Testing Kits
తాలు, అగ్గితెగులు

తాలు, అగ్గితెగులు


ఈ సారి పంటలో తాలు కూడా ఎక్కువ వచ్చింది. వరికోత మిషన్లతో కోయడంతో సమస్య వస్తోంది. దీంతో తుప్పు ఎక్కువగా వస్తుందని... కోత తప్పదని చెబుతున్నారు. అగ్గి తెగులు కూడా ఎక్కువేనని సిబ్బంది చెబుతున్నారు. తాము ఒక లారీ లోడ్ చేస్తే.. మిల్లర్ల నుంచి అనేక సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. మార్కెట్ సిబ్బంది తీరును నిరసిస్తూ ప్రధాన రహదారిపై రైతులు మాత్రం ఆందోళనకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

English summary
must for 13 percentage Humidity in paddy market staff told to farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X