వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులు వీరికే.., తెలంగాణ నుంచి 6గురు, కేసీఆర్ స్పందన

2017 సంవత్సరానికి పద్మ పురస్కారాలను కేంద్రం బుధవారం నాడు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని పద్మ పురస్కారాలు వరింాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2017 సంవత్సరానికి పద్మ పురస్కారాలను కేంద్రం బుధవారం నాడు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని పద్మ పురస్కారాలు వరించాయి. చేనేత ఆసు యంత్రం రూపొందించిన చింతకింది మల్లేషం, కోటి మొక్కలు నాటిన ఖమ్మం జిల్లా వనజీవి రామయ్యకు పద్మశ్రీ దక్కాయి.

padmaawardslatest

మొత్తంగా తెలంగాణకు ఆరు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. చింతకింది మల్లేషం (చేనేత రంగం), ఎక్కా యాదగిరి రావు (శిల్పకళా), మహ్మద్ అబ్దుల్ వాహిద్ (వైద్య రంగం), చంద్రకాంత్ పిత్వా (సైన్స్ అండ్ టెక్నాలజీ), వనజీవి రామయ్య (సామాజిక సేవ), మోహన్ రెడ్డి వెంకట్రామ బోదనపు (పారిశ్రామిక రంగం) లకు పద్మశ్రీ వచ్చింది. పద్మ అవార్డు గ్రహీతలను కేసీఆర్ అభినందించారు. ఏపీ నుంచి త్రిపురనేని హనుమాన్ చౌదరికి వచ్చింది.

padmaawardslatest

డాక్టర్ సునిధి సోలోమన్‌, వైద్యుడు సుబ్రతో దాస్‌, వందకు పైగా వంతెనలు నిర్మించిన సేతు బంధు గిరీష్‌ భరద్వాజ్‌, ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజారిన దీపా కర్మాకర్, పారాలింపిక్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు, అగ్నిరక్షక్‌ బిపిన్‌ గనత్ర, 91 ఏళ్ల గైనకాలజిస్ట్‌ భక్తి యాదవ్‌, సామాజిక సేవకురాలు అనురాధ కోయిరాలా, కలరిపయట్టు నిపుణురాలు మీనాక్షి అమ్మ, బైక్‌ అంబులెన్స్‌ రూపకర్త కరీముల్‌ హక్‌, సామాజిక సేవ విభాగంలో మాపుష్కర్‌, అంధ క్రికెటర్‌ శేఖర్‌ నాయక్‌, విద్యారంగంలో అనంత్‌ అగర్వాల్‌, కర్ణాటకకు చెందిన జానపద గాయనీసుక్రి బొమ్మగౌడ, కళలు, సంగీత విభాగంలో జితేంద్ర హరిపాల్‌లకు ఈ పురస్కారం దక్కింది.

Padma Awards Winners 2017
English summary
The government recognised the many faceless heroes of India in the 2017 Padma Awards list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X