హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిసెంబర్ 7న పేయిడ్ హాలీ డే, నగదు-మద్యంపై ఫిర్యాదులు: ఈసీ రజత్, 'నేతలపై కేసులు పెట్టాం'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగదు, మద్యం పంపిణీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్ గురువారం చెప్పారు. ఈ రోజు రాత్రికి సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని చెప్పారు. వంద శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ జరిగిందని చెప్పారు.

కొత్తగా 20 లక్షల మంది ఓటర్లు చేరారని చెప్పారు. 12 గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయవచ్చునని చెప్పారు. 119 నియోజకవర్గాలకు గాను సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుందని చెప్పారు.

ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటే ఓటు వేసే అవకాశముంటుందని తెలిపారు. ఓటింగ్ రోజు కూడా సీ విజిల్ యాప్ వాడవచ్చునని చెప్పారు. కోరినన్ని బలగాలు కేంద్రం నుంచి వచ్చాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ను నేరుగా మానిటరింగ్ చేస్తారని చెప్పారు. డిసెంబర్ 7న పేయిడ్ హాలీడే ఉంటుందని చెప్పారు.

Paid holiday on December 7, EC Rajath Kumar

ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ జితేందర్ తెలిపారు. సుమారు లక్షమందితో భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. 414 ఫ్లయింగ్ స్క్వాడ్లు.. 404 ఎస్ఎస్ టీంలు ఏర్పాటు చేశామని చెప్పారు. 3385 సంచార బృందాలు, 279 కేంద్ర కంపెనీ బలగాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తెలంగాణలో మావోయిస్టు ప్రభావం లేదని చెప్పారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. నాలుగు వేలకు పైగా సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి ఏరియాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. పలువురు నేతలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. టీడీపీ నేత జూపూడి ప్రభాకర రావు, శేరిలింగంపల్లి అభ్యర్థి ఆనంద్ ప్రసాద్, జగ్గారెడ్డి, మల్లారెడ్డి, సర్వే సత్యనారాయణలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

English summary
Paid holiday on December 7, says EC Rajath Kumar. The Telangana Legislative Assembly election is scheduled to be held in Telangana on 7 December 2018 to constitute the second Legislative Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X