• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సానియా అత్తారింటికి దారేది? : భారత్ పాక్ మధ్య యుద్దమేఘాలు!(ఫోటోలు)

|

న్యూఢిల్లీ : పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ సర్జికల్ దాడుల నేపథ్యంలో.. పాకిస్తాన్ కమెడీయన్ షెహజాద్ గియాస్ షేక్ చేసిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావం భారత్-పాక్ మధ్య సంబంధాలు కొనసాగిస్తోన్న సెలబ్రిటీలకు ఒకింత ఇబ్బందికర పరిణామం. ముఖ్యంగా సినిమా, క్రీడా రంగాలకు సంబంధించిన వ్యక్తులు, భారత్-పాక్ మధ్య రాకపోకలు సాగించడం ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురిచేసే అంశమే.

ఇరు దేశాల గురించి ప్రస్తావిస్తూ..

ఇరు దేశాల గురించి ప్రస్తావిస్తూ..

ఇప్పటికే మహారాష్ట్ర నవనిర్మాణ లాంటి పార్టీ.. భారత్ లో పాక్ నటులు కనిపిస్తే దాడులు చేస్తామని హెచ్చరించడం.. సరైన వీసాతో ఇండియాలో అడుగుపెట్టే పాక్ నటీ నటులను ఆహ్వానిస్తాం.. అంటూ బాలీవుడ్ హీరో సల్మాన్ వ్యాఖ్యలు చేయడం.. వంటి వైరుధ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ పాకిస్తాన్ కమెడీయన్ షెహజాద్ గియాస్ షేక్ చేసిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సానియా.. అత్తారింటికి దారెలా?

సానియా.. అత్తారింటికి దారెలా?

ముఖ్యంగా హైదరాబాదీ టెన్నిస్ స్టార్, పాకిస్తాన్ కోడలు సానియా మీర్జా గురించి షెహజాద్ ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకీ సానియా గురించి షెహజాద్ ఏమన్నారంటే.. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు ఇలాగే గనుక కొనసాగితే.. సానియా మీర్జా తన అత్తగారింటికి ఎలా వెళ్తుంది..? ఆమె భర్త షోయబ్ మాలిక్ భారత్ వచ్చి క్రికెట్ ఎప్పుడు ఆడాలి చెప్పండి? దాదాపు 70ఏళ్లుగా పొరుగునే ఉంటున్నప్పుడు విబేధాలు రావడం సహజమే కదా.. అంతమాత్రానా యుద్దమే మార్గమా.. ప్రత్యామ్నాయ మార్గాలు లేవా అంటూ ప్రశ్నించారు.

 మోడీ ఛాయ్ లాగే.. పాక్ అధ్యక్షడు దహీ బల్లా

మోడీ ఛాయ్ లాగే.. పాక్ అధ్యక్షడు దహీ బల్లా

ఇక ఇరు దేశాల ప్రధానుల గురించి ప్రస్తావిస్తూ.. భారత ప్రధాని మోడీ ఛాయ్ అమ్మిన వ్యక్తి అని ప్రపంచమంతా చెప్పుకుంటోంది. మోడీ లాగే పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ దహీ బల్లా ( పెరుగు, ఆలు, వడతో తయారుచేసే పదార్థం) చేయడంలో ఆరినతేరినవారని, రాజకీయాల్లోకి రాకమునుపు పాక్ వీధుల్లో ఆయన దహీ బల్లా అమ్ముకున్నారని చెప్పుకొచ్చారు షెహనాజ్. అంతేకాదు.. వీరిద్దరి మధ్య ఓ అంతర్జాతీయ పోటీ నిర్వహించడానికి సరిహద్దుల్లో స్టాల్స్ ఏర్పాటు చేద్దామన్నాడు.

 షారుఖ్ కు సాహిర్ కు పోటీ పెడుదాం..

షారుఖ్ కు సాహిర్ కు పోటీ పెడుదాం..

ఇక నటుల గురించి ప్రస్తావిస్తూ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షెహజాద్. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు, పాకిస్తాన్ నటుడు, దర్శకుడు సాహిర్ లోధికి మధ్య యాక్టింగ్ పోటీ పెడుదామని, కావాలంటే.. బాలీవుడ్ సింగర్, సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా, పాకిస్తాన్ సింగర్ తాహిర్ షా మధ్య పాటల పోటిని నిర్వహిద్దామని సూచించాడు.

రాహుల్ గాంధీతో స్పెల్ బీ పోటీ:

రాహుల్ గాంధీతో స్పెల్ బీ పోటీ:

అలాగే హిందీ, ఉర్దూ భాషల్లో రాహుల్ గాంధీ, బిల్వాల్ భుట్టో మధ్య స్పెషల్ బీ పోటీలు నిర్వహిద్దామంటూ కామెంట్ చేశారు షెహజాద్. 'పాక్ పై సర్జికల్ దాడులు చేసి పైచేయి అనిపించుకున్నావు.. కానీ అత్త కూడా ఒకప్పుడు కోడలే అన్న విషయం మరిచిపోతున్నావు. కొట్లాటకు దిగితే గిల్లికజ్జాలు.. గిల్లి కజ్జాలకు బదులు కలిసి మాట్లాడుకుందాం. కావాలంటే పొరుగున ఉన్నవాళ్లపై రాళ్లు వేద్దాం. ఇప్పుడు మనం కలిస్తేనే రేపైనా మన అమ్మ నాన్న కలుస్తారంటూ ముగించాడు షెహజాద్.

English summary
In the aftermath of the Uri terror attack, India-Pakistan relations have been fraught with tension. And Thursday’s surgical strikes by the Indian Army on terrorist camps in Pakistan-occupied Kashmir have only increased hostilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X