వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే రాజీనామా చేసి రా!.. 'స‌న్ బ‌ర్న్'కి పర్మిషన్ ఇవ్వలేదు: రేవంత్‌కు పల్లా సవాల్

హైద‌రాబాద్‌లో స‌న్ బ‌ర్న్ పేరుతో పార్టీ నిర్వ‌హించేందుకు ఓ ప‌బ్‌కి అనుమతులు ఇచ్చారన్న రేవంత్ ఆరోపణలను పల్లా ఖండించారు.కొత్త పబ్బులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేసీఆర్ స‌ర్కారు హ‌యాంలోనే డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ పెరిగింద‌ని, పబ్ లలో పార్టీలకు కేటీఆర్ బావమరిది టికెట్లు అమ్ముతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

రేవంత్ విమర్శలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. దమ్ముంటే రాజీనామా చేయాలని, బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

పర్మిషన్ ఇవ్వలేదు:

పర్మిషన్ ఇవ్వలేదు:

హైద‌రాబాద్‌లో స‌న్ బ‌ర్న్ పేరుతో పార్టీ నిర్వ‌హించేందుకు ఓ ప‌బ్‌కి అనుమతులు ఇచ్చారన్న రేవంత్ ఆరోపణలను పల్లా ఖండించారు.కొత్త పబ్బులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట క్లబ్‌లు మూతపడ్డాయని గుర్తుచేశారు.

బాబు వేసిన బొక్కలు తిని కుక్కలా

బాబు వేసిన బొక్కలు తిని కుక్కలా

హైదరాబాద్ నగరం డ్రగ్స్ జోన్‌లో లేదని నార్కోటిక్స్ విభాగం స్పష్టం చేసిందని ఈ సందర్భంగా పల్లా చెప్పారు. నగరం డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారిందని వెల్లడించారు. ఒకప్పుడు చంద్రబాబు వేసిన బొక్కలు తిని రేవంత్ కుక్కలా పనిచేశాడని ఫైర్ అయ్యారు. రాజీనామా లేఖ అమరావతిలో ఉన్న చంద్రబాబుకు కాదు, తెలంగాణ స్పీకర్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి రావాలని సవాల్ విసిరారు.

దాన్నే నమ్ముకున్న రేవంత్: గులాబీ వ్యూహం సిద్దం?, కొడంగల్‌లో ఏం జరుగుతోంది?దాన్నే నమ్ముకున్న రేవంత్: గులాబీ వ్యూహం సిద్దం?, కొడంగల్‌లో ఏం జరుగుతోంది?

అనవసర రాద్దాంతం:

అనవసర రాద్దాంతం:

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ నేపథ్యంలోనే కొలువుల కొట్లాటను వాయిదా వేసుకోవాలని సూచించామన్నారు పల్లా. దీనిపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పల్లా.. ఈవిధంగా స్పందించారు.

రేవంత్ ఆరోపణలు:

రేవంత్ ఆరోపణలు:

హైద‌రాబాద్‌లో స‌న్ బ‌ర్న్ పేరుతో పార్టీ నిర్వ‌హించేందుకు ఓ ప‌బ్‌కి ప్రభుత్వం అనుమతినిచ్చిందని రేవంత్ ఆరోపించారు. ఈ పార్టీల‌కు టిక్కెట్లు అమ్ముతున్నది కూడా కేటీఆర్ బావమ‌రిది అని తీవ్ర ఆరోపణలు చేశారు.

ప‌బ్బులు, క్ల‌బ్బుల కోస‌మే తెలంగాణ వ‌చ్చిందా? అని కేసీఆర్ స‌ర్కారును నిలదీశారు. టీఆర్ఎస్ హ‌యాంలోనే డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ పెరిగింద‌నీ, స్కూళ్ల‌లో కూడా డ్ర‌గ్స్ ల‌భ్య‌మయ్యే ప‌రిస్థితి ఉందంటూ మండిప‌డ్డారు.

ప‌బ్బుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంలో తెలంగాణ స‌ర్కారు మొద‌టి స్థానంలో ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సన్ బర్న్ పార్టీకి ఇచ్చిన అనుమతులను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప‌బ్బుల‌పై చూపిస్తున్న శ్ర‌ద్ధ డ్ర‌గ్స్ కేసు మీద చూపించాలని హితవు పలికారు.

English summary
TRS MLC Palla Rajeswar Reddy challenged Revanth Reddy to resign his MLA post. He demands him to come to open debate over drugs allegations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X