• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జూపార్క్‌లో గతంలోనూ ప్రమాదాలు: కరిష్మతో జత కట్టించేందుకు.. (పిక్చర్స్)

By Srinivas
|

హైదరాబాద్: భాగ్యనగరంలోని జూపార్కులో శనివారం కాదంబ అనే రాయల్ బెంగాల్ టైగర్ ఎన్ క్లోజర్ నుంచి బయటకు వచ్చి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి.

మూడున్నర దశాబ్దాల క్రితం సోని అనే పులి బయటకు వచ్చింది. అప్పటి అనిమల్ కీపర్ ఎన్ క్లోజరును శుభ్రం చేస్తూ రెండో తలుపు మూసివేయడం మరిచాడు. దీంతో అది బయటకు వచ్చింది. జనాన్ని బయటకు పంపించి జూ గేట్లు మూసివేశారు. ఆ తర్వాత అది తిరిగి ఎన్ క్లోజర్లోకి వెళ్లింది.

పదిహేనేళ్ల క్రితం ఎన్ క్లోజరులోకి వెళ్లిన సందర్శకురాలు పులి దాడిలో చేయి పోగొట్టుకుంది. మరోసారి పతంగులు, రేగు పండ్ల కోసం పులుల సఫారీలోకి దిగిన ఇద్దరు బాలురపై పులులు దాడి చేశాయి. దీంతో వారు మృతి చెందారు.

రాయల్ బెంగాల్ టైగర్

రాయల్ బెంగాల్ టైగర్

శనివారం సాయంత్రం జూ పార్కులో ఎన్ క్లోజర్ నుంచి బయటకు వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ కాదంబను తిరిగి బోనులో బంధించారు.

జూపార్క్

జూపార్క్

నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో పెద్దపులి తప్పించుకున్న ఘటనకు అసిస్టెంట్ క్యూరేటర్ అవగాహన రాహిత్యమే కారణమని తెలుస్తోంది. అసిస్టెంట్ క్యూరేటర్ మక్సూద్ మొహినుద్దీన్ అవగాహనా రాహిత్యంతో పులిని బ్రీడింగ్ సెంటర్‌లోకి వదలడం, పెద్ద పులి సంచరించే క్రాల్‌ను సరిగ్గా నిర్మించకపోవడం ఈ ఘటనకు దారితీసిందని ఫిర్యాదులు అందాయి.

జూపార్క్

జూపార్క్

క్యూరేటర్‌తో పాటు ఉన్నతాధికారులెవరికీ సమాచారం ఇవ్వకుండా అసిస్టెంట్ క్యూరేటర్ కాదంబ అనే పులిని సీసీఎంబీ పర్యవేక్షణలోని ల్యాకోన్స్ ప్రయోగశాల నుంచి బ్రీడింగ్ సెంటర్‌కు మార్చడం వల్లనే అది దాడికి గురైందని, దీనిపై ఉన్నతాధికారులు అతనిపై ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది.

జూపార్క్

జూపార్క్

కిందిస్థాయి యానిమల్ కీపర్లు చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టడమే కారణమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కొన్ని రోజుల కిందటే మక్సూద్‌ను దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీకి బదిలీ చేశారు. కానీ ఆయన అక్కడికి వెళ్లకుండా రాజకీయ పలుకుబడితో జూలోనే కొనసాగుతున్నారని సమాచారం.

జూపార్క్

జూపార్క్

జూలో అసిస్టెంట్ క్యూరెటర్‌గా పని చేసిన శ్రీదేవిని ఆన్‌డ్యూటీపై హరిణ వనస్థలి జాతీయ పార్క్‌కు బదిలీ చేసిన అధికారులు మక్సూద్‌ను మాత్రం అక్కడే కొనసాగిస్తున్నారు. జంతు మార్పిడి విధానం కింద గత యేడాది మార్చిలో మంగళూరు జూ నుంచి దిగుమతి చేసుకున్న కాదంబ అనే పులిని హైదరాబాద్ జూలోని కరిష్మాతో జతకట్టించాలని అధికారులు నిర్ణయించారు.

జూపార్క్

జూపార్క్

కరిష్మాతో కాదంబను కలపడానికి ప్రత్యేక బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో ఒకచోట వదలాలి. మొదట వేర్వేరు ఎన్‌క్లోజర్‌లలో ఆడ, మగ పులులను ఉంచి వాటి చూపులు కలిసిన తర్వాత బ్రీడింగ్ సెంటర్‌లోకి వదలాలి. కానీ ఇవేమీ చేయకుండానే కాదంబను బ్రీడింగ్ సెంటర్‌కు మార్చారని తెలుస్తోంది.

 జూపార్క్

జూపార్క్

బ్రీడింగ్ సెంటర్ పైకప్పు లేకపోవడం వల్ల పులి దూకిపోయే ప్రమాదం ఉందని ముందే హెచ్చరించారని, కానీ ఈ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోకుండా, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా ఉదయం పది గంటలకే కాదంబను కరిష్మా ఉన్న బ్రీడింగ్ సెంటర్‌కు అతను మార్చాడని చెబుతున్నారు.

 జూపార్క్

జూపార్క్

అక్కడ అవి ఘర్షణ పడటం, ఒక పులి దూకి పారిపోవడం జరిగింది. అసలు క్యూరేటర్ పర్యవేక్షణలో ఇటువంటి ప్రక్రియ జరగాలి. కానీ క్యూరేటర్ జూపార్క్‌లో లేని సమయంలో అసిస్టెంట్ క్యూరేటర్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.

జూపార్క్

జూపార్క్

అయితే యుక్తవయస్సులో ఉన్న కాదంబ సీసీఎంబీ ల్యాకోన్స్‌లోని ప్రయోగశాల వద్దకే వెళ్లడం, సందర్శకులు ఉన్న చోటికి రాకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.

English summary
The Royal Bengal Tiger Kadamba, which came out of the enclosure, is recouping from yesterdays tranquilization. The veterinary wing is keeping a constant vigil on the Kadamba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X