హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కంపెనీలు క్యూ: పెరిగిన పీవీ సింధు బ్రాండ్ వాల్యూ, 'తొందరపడం'

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మొన్నటి వరకు సాధారణ షట్లర్‌గా ఉన్న పీవీ సింధు, రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి 120 కోట్ల భారతీయలు హృదయాలను గెలుచుకుని స్టార్ ప్లేయర్‌గామారిపోయింది. ఒలింపిక్స్‌లో రజతం సాధించిసాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు సింధుకు పోటీపడి మరీ నజరానాలను ప్రకటించారు. సన్మానాలు కూడా చేశారు. తెలుగు రాష్ట్రాలు నజరానాలతో పాటు ఉద్యోగాలు కూడా ప్రకటించాయి. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత పీవీ సింధు కెరీర్ పూర్తిగా మారిపోయింది.

Companies making beeline to sign Rio Olympian PV Sindhu for endorsements

పీవీ సింధు బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. ఆమెతో వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు చేసుకోవడానికి పలు కంపెనీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. సింధు బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరగడంతో ఒప్పందాలు చేసుకోవడంలో తొందరపడబోమని ఆమె ప్రకటనల వ్యవహారాలను చూస్తున్న బ్రాండ్ మేనేజ్మెంట్ సంస్థ బేస్‌లైన్ వెంచర్స్ తెలిపింది.

సింధు ప్రకటనల వ్యవహారాలపై బేస్‌లైన్ వెంచర్స్ కో పౌంఢర్, డైరెక్టర్ ఆర్ రామకృష్ణన్ మాట్లాడుతూ పీవీ సింధుతో రెండు ప్రకటనల ఒప్పందాలను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ రెండు ఒప్పందాలు కూడా రియో ఒలింపిక్స్‌కు ముందు జరిగాయని తెలిపారు.

ప్రస్తుతం సింధు సన్నాహకాల్లో తీరికలేకుండా ఉండటంతో వాటిని ప్రకటించలేదని చెప్పారు. తాము ప్రకటించబోయే రెండు ఒప్పందాలు కూడా జాతీయ స్థాయికి సంబంధించినవిగా చెప్పారు. కాగా బేస్‌లైన్
వెంచర్స్ విషయానికి వస్తే సింధుతో పాటు మరో బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ప్రకటనల వ్యవహారాలను కూడా చూస్తోంది.

English summary
Companies are queuing up to sign Rio Olympics silver medalist PV Sindhu for endorsements, but the ace badminton player's brand management firm wants to go slow as it wants her brand valuation to rise further.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X