హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్‌బీఐ నిర్ణయం: పాతనోటుకు రెంటు కొత్త నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాత నోట్లకు రెట్టింపు కొత్త నోట్లు ఇస్తామని నమ్మంచి మోసం చేస్తున్న ముఠాలను పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాల సభ్యుల నుంచి రూ.33లక్షల నగదు, రెండుకార్లను స్వాధీనం చేసుకున్నామని వెస్ట్ జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈమేరకు శనివారం గ్యాంగ్‌లీడర్, సభ్యులను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. 2005వ సంవత్సరం కన్నా ముందు చెలామణిలో ఉన్న 500లు, 1000ల నోట్లను బ్యాంకుల ద్వారా వెనక్కు తీసుకోవాలన్న ఆర్‌బీఐ నిర్ణయాన్ని ఈ ముఠా అనుకూలంగా మార్చుకుని ఒక నోటు ఇస్తే రెండు నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారన్నారు.

విశాఖపట్నం జిల్లా మురళీనగర్‌కు చెందిన కర్రి కనకరాజు అలియాస్ సుదర్శన్‌రెడ్డి అలియాస్ డ్యాడీ (40), విశాఖపట్నం జిల్లా సిద్దార్థనగర్‌కు చెందిన అంబటి సంతోశ్‌కుమార్ అలియాస్ శ్రీనివాస్ (32), పశ్చిమబెంగాల్ కోల్‌కత్తాలోని ఇక్బుల్‌పూర్ రోడ్డులో నివాసముండే అట్టాడ సీతారామ్ (45) ముఠా సభ్యులు.

గ్యాంగ్ లీడర్ కనకరాజు సూచనలతో పంజాగుట్ట, దుండిగల్‌ సహా ఖమ్మ, వరంగల్‌, కాజీపేట, సరూర్‌నగర్‌, కాకినాడ, వరంగల్‌, గుంటూరు, వైజాగ్‌లలోనూ ఈ తరహా దోపిడీకి పాల్పడుతుంటారు. ఈ క్రమంలో వ్యాపారులు, ఉద్యోగుల వద్ద పెద్ద మొత్తంలో ఉన్న డబ్బులను దోచుకోవాలనే ఆలోచనతో పలువురి సెల్‌ఫోన్ నెంబర్లు సేకరించి వారికి ఫోన్ చేసి రూ.10లక్షల పాత నోట్లకు రెట్టింపు కొత్త నోట్లను ఇస్తామని నమ్మబలుకుతారు.

వీరి మాటలకు స్పందించిన వారు తమ వద్ద నగదు ఉందని చెప్పగానే ఫలానా ప్రాంతానికి నగదుతో రమ్మంటారు. బాధితుడు నగదు తీసుకుని రాగానే అతడికి సూట్‌కేస్‌ ఇస్తారు. ఇందులో రెండు అరలుంటాయి. ఒక అరలో అసలు కరెన్సీ, మరో అరలో తెల్లకాగితాల కట్టలుంటాయి. సూట్ కేసులో ఉంచిన తెల్లకాగితాల బండిళ్లతో ఉన్న సంచిని బాధితుడికి అప్పగించి అక్కడి నుంచి జారుకుంటారు.

ఈ ముఠా సభ్యులు కృష్ణా జిల్లాకు చెందిన పి. నాగరాజు అనే వ్యక్తి నుంచి గత నెల 28న బిగ్‌బజార్ వద్ద డబ్బుల సంచులు మార్పిడి చేస్తుండగా పక్కా సమాచారం మేరకు పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కర్రి కనకరాజుపై వరంగల్ జిల్లా కాజీపేటలో రెండు కేసులు, విశాఖపట్నం టౌన్-3లో ఒకటి, సైబరాబాద్ సరూర్‌నగర్‌లో ఒక కేసు నమోదైంది.

 పాతనోటుకు రెంటు కొత్త నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారు

పాతనోటుకు రెంటు కొత్త నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారు


ఇలాంటి కేసులో పంజాగుట్ట పోలీసులు మరో నలుగురు నిందితులను పట్టుకున్నారు. గోదావరి జిల్లా సామర్ల కోటకు చెందిన ఎర్రోతు నాగేశ్వర్‌రావు, అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన రొడ్డం రవీందర్ రెడ్డి, అదే జిల్లాలోని చెన్నైకొత్తపల్లికి చెందిన తిమ్మిశెట్టి హేమంత్ కుమార్, చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామానికి చెందిన షేక్ హైదర్ అలీ అలియాస్ భాషా ముఠా సభ్యులు.

పాతనోటుకు రెంటు కొత్త నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారు

పాతనోటుకు రెంటు కొత్త నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారు


వీరంతా తమిళనాడు రాష్ట్రం అరక్కొనం జిల్లా కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తారు. ఇలా అరక్కోణంలోని ముఠా నాయకులు పరారీలో ఉన్నారని వారిని అరెస్ట్‌చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.

 పాతనోటుకు రెంటు కొత్త నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారు

పాతనోటుకు రెంటు కొత్త నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారు

ఖమ్మం జిల్లా మదీరాకు చెందిన గుడిబండ శ్రీనివాస్ రెడ్డి వద్ద రూ.5లక్షలు, అదే జిల్లాలోని రాతి దర్వాజకు చెందిన శ్రీనివాస్ రావు వద్ద రూ.5లక్షలు, నేలకొండపల్లికి చెందిన ప్రసాద్ వద్ద రూ.5లక్షలు, రామకృష్ణ వద్ద రూ.4.50లక్షలు పాత నోట్ల స్థానంలో రెట్టింపు కొత్తనోట్లు అందచేస్తామంటూ కాగితాల బండిళ్లు ఇచ్చి పరారయ్యారు.

 పాతనోటుకు రెంటు కొత్త నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారు

పాతనోటుకు రెంటు కొత్త నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారు

ఈ గ్యాంగ్‌ను అమీర్‌పేట వద్ద డబ్బు మార్పిడి చేస్తుండగా అరెస్టు చేశారు. నిందితుల్లో ఎర్రోతు నాగేశ్వర్ రావుపై కాకినాడ టౌన్‌లో కేసు నమోదు కాగా, ఈ ముఠా సభ్యుడైన రొడ్డం రవీందర్ రెడ్డిపై వరంగల్ పట్టణంలోని సెంట్రల్ క్రైం స్టేషన్‌లో ఒక కేసు, గుంటూరు సీసీఎస్‌లో మరో కేసు ఉంది.

 పాతనోటుకు రెంటు కొత్త నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారు

పాతనోటుకు రెంటు కొత్త నోట్లు ఇస్తామంటూ లక్షలు దోచుకున్నారు


వీరి వద్ద నుంచి రూ.33లక్షల నగదు, రెండు కార్లు, సూట్‌కేసులు, బ్యాగులు, పేపర్ బండిళ్లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచినట్లు డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. రివార్డుల కోసం నగర కమిషనర్‌కు సిఫార్స్ చేస్తామని డీసీపీ తెలిపారు.

English summary
Panjagutta police arrested by gangster.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X