నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బైక్‌పై ఎత్తుకెళ్లిన ఘటన: ఆ ప్రేమజంట కథ సుఖాంతం, 24 గంటల్లో ఒక్కటైన జంట

By Srinivas
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: పెళ్లికి ఐదు నిమిషాల ముందు యువతిని కిడ్నాప్ చేసిన సంఘటన నిజామాబాదులో రెండు రోజుల క్రితం జరిగిన విషయం తెలిసిందే. ఇది సుఖాంతమైంది. పోలీసులు అమ్మాయిని వెతికి తీసుకు వచ్చి ప్రేమికులను కలిపారు.

5నిమిషాల్లో పెళ్లి: సినీ ఫక్కీలో ప్రేమజంటపై దాడి, అమ్మాయిని ఎత్తుకెళ్లారు5నిమిషాల్లో పెళ్లి: సినీ ఫక్కీలో ప్రేమజంటపై దాడి, అమ్మాయిని ఎత్తుకెళ్లారు

ప్రాణదీప్-సౌజన్య

ప్రాణదీప్-సౌజన్య

రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రాణదీప్, మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్యలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయిదు నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా ఆర్య సమాజ్ చేరుకున్న సౌజన్య బంధువులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.

మక్లూర్ తీసుకెళ్లిన సౌజన్యని తీసుకు వచ్చారు

మక్లూర్ తీసుకెళ్లిన సౌజన్యని తీసుకు వచ్చారు

ఈ ఘటనపై పెళ్లి కొడుకు, అతని స్నేహితులు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపు సౌజన్యను మక్లూర్ తీసుకు వెళ్లారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మక్లూర్ వెళ్లిన పోలీసులు బాధిత యువతిని కలిశారు.

 వారిపై సెక్షన్ 365 కింద కేసు నమోదు

వారిపై సెక్షన్ 365 కింద కేసు నమోదు

ఆమె తెలిపిన వివరాల ఆధారంగా సెక్షన్ 365 కింద కుటుంబ సభ్యులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. వారిని రిమాండుకు తరలించారు. అనంతరం ఏసీపీ ఆధ్వర్యంలో సౌజన్యకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

24 గంటల్లో ఒక్కటయ్యారు

24 గంటల్లో ఒక్కటయ్యారు

దీంతో పోలీసులు వారిని టూటౌన్ పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారు. ఎక్కడ విడిపోయారో అదే ఆర్య సమాజ్‌లో పెళ్లికి సిద్ధమయ్యారు. పోలీసుల జోక్యంతో యువతి ప్రియుడి చెంతకు చేరింది. వారి సహకారంతో 24 గంటల్లోనే ఆ జంట ఒక్కటైంది. సౌజన్యకు కౌన్సెలింగ్ ఇవ్వగా తాను ప్రేమించినవాడితోనే ఉంటానని చెప్పిందని, దానినే తాము కోర్టులో ప్రొడ్యూస్ చేశామని పోలీసులు చెప్పారు. మీడియా, పోలీసుల సహకారంతో తామిద్దరం ఒక్కటయ్యామని ప్రాణదీప్, సౌజన్య అన్నారు.

English summary
Parents attacks Love Marriage at Arya Samajam Nizamabad. Police case against girl parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X