వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆడపిల్ల పుట్టిందని..! అమ్మే వద్దంటోంది..!

|
Google Oneindia TeluguNews

నాగర్ కర్నూల్ : ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం పేగుబంధానికి అర్థం లేకుండా చేసింది. రోజులు కూడా నిండని ఆ బిడ్డ తమకొద్దంటూ ఐసీడీఎస్ అధికారులను ఆశ్రయించారు. దీంతో చేసేదేమీ లేక ఆ పసిబిడ్డను శిశు సంరక్షణ గృహానికి చేర్చారు. మనసులను కదిలిస్తున్న ఈ ఘటన నాగార్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో చోటుచేసుకుంది.

బాణాల గ్రామానికి చెందిన రమావత్ నిరంజన్ - దస్లి దంపతులకు నలుగురు ఆడపిల్లలు జన్మించారు. అందులో ఓ కూతురు అనారోగ్యం కారణంగా చనిపోయింది. అయితే వారసత్వం నిలిపేందుకు మగ సంతానం కావాలనుకున్నారు ఆ దంపతులు. ఆ క్రమంలో దస్లి మరోసారి గర్భం దాల్చడంతో శనివారం నాడు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. ఐదో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించడం.. ఆ దంపతులకు నచ్చలేదు. దీంతో పసిబిడ్డ తమకు భారంగా మారుతుందని భావించి వదిలించుకోవాలని డిసైడయ్యారు.

Parents rejects the new born girl

ఆమేరకు అంగన్‌వాడీ టీచర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆమె వచ్చి దస్లి - నిరంజన్ కు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో.. పై అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది హాస్పిటల్ కు వచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ఆ దంపతుల నిర్ణయంలో మార్పు రాలేదు. చివరకు ఆ పసిగుడ్డును మహబూబ్‌నగర్‌లోని శిశు సంరక్షణ గృహానికి తరలించారు.

English summary
Parents rejects the new born girl. They approach ICDS officials to handover the child. This incidenent took place in balmoor mandal, nagarkurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X