వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహేష్ కత్తి ఉన్మాదపు భావజాలం, అంబేడ్కర్ రాముడ్ని కీర్తించారు: పరిపూర్ణానంద

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్ర: పరిపూర్ణానంద

హైదరాబాద్: శ్రీరామచంద్రుడిపై దారుణ వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద మహేష్ కత్తిపై శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై జరుగుతోన్న దాడులకు నిరసనగా సోమవారం ఆయన ధర్మాగ్రహ యాత్ర ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌ బోడుప్పల్‌ నుంచి యాదగిరిగుట్ట వరకు 3 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది.

ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. హిందూ ధర్మంపై పెచ్చుమీరుతున్న కుట్రలను, మేధావుల ముసుగులో విచ్ఛిన్నకర శక్తులను ఇంకా ఎన్నాళ్లు భరించాలన్నారు. ఎన్నేళ్లు సహించాలని నిలదీశారు. ఆ కుట్రలను భగ్నం చేసేందుకే ఈ ధర్మాగ్రహ యాత్ర అన్నారు. శ్రీరాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. దీనిని ఆయన తీవ్రంగా ఖండించారు.

అంబేడ్కరే రాముడిని చరిత్రకారుడని కీర్తించారు

అంబేడ్కరే రాముడిని చరిత్రకారుడని కీర్తించారు

కోట్లమంది పూజించే రాముడిని అవమానపరిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ అంతటివాడే రాముడిని చరిత్రకారుడని కీర్తించారని, వీళ్లు మాత్రం దూషిస్తున్నారన్నారు. కత్తి మహేష్ మోసపూరిత వ్యక్తి అని, రాముడిని నిందిస్తే వారికి ఎలా బుద్ది చెప్పాలో తనకు తెలుసునని చెప్పారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతి రామనవమికి తలంబ్రాలు తీసుకువెళుతుంటారని, మరి వాళ్లు వెళ్లేది ఎవరి వద్దకో తెలియడం లేదా అని ప్రశ్నించారు.

క్షమాపణ చెప్పాలి

క్షమాపణ చెప్పాలి

అన్ని మతాలను, సమాజాన్ని సమానంగా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పరిపూర్ణానందస్వామి అన్నారు. రాముడిని విమర్శించిన వ్యక్తిపై దేశ ద్రోహిగా ముద్ర వెయ్యాలని డిమాండ్ చేశారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా ఆగ్రహంతో ఉన్నాయన్నారు. హిందూ దేశంలో రాముణ్ణి అలా అవమానిస్తే ఎలా అన్నారు. ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించనని కత్తి మహేశ్ క్షమాపణలు చెప్పాలన్నారు.

నా పాదయాత్ర లోపు చర్యలు తీసుకోవాలి, లేదంటే

నా పాదయాత్ర లోపు చర్యలు తీసుకోవాలి, లేదంటే

ప్రభుత్వ తీరుకు నిరసనగా బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్ర చేపడుతున్నానని పరిపూర్ణానంద తెలిపారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని భాగ్యలక్ష్మి గుడిలో శ్రీరాముడికి పూజలు చేసి, ఉప్పల్ వరకు నడిచి ఆ తర్వాత అక్కడి నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్రగా వెళ్తామన్నారు. ఈ లోపు కత్తి మహేష్‌పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే యాదగిరి గుట్టపైనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అన్ని కుల సంఘాల నాయకులు తమకు మద్దతు పలికారని, వారు కూడా తమతో పాదయాత్రలో పాల్గొంటున్నారన్నారు.

మహేష్ కత్తిది ఉన్మాదపు భావజాలం

మహేష్ కత్తిది ఉన్మాదపు భావజాలం

మహేష్ కత్తికి ఉన్మాదపు భావజాలముందని పరిపూర్ణానందస్వామి అన్నారు. రాముడిని పరుష పదజాలంతో దూషించిన వారిని వదిలిపెట్టమన్నారు. జనాభాలో 80 శాతం ఉన్న హిందువులకే రక్షణ లేకపోతే క్రైస్తవులు, ముస్లింలకు ఏం రక్షణ ఉంటుందని అన్నారు.

English summary
Paripoornananda Swami Press Meet at Somajiguda press club on Mahesh Kathi comments on Lord Srirama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X