వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గట్టిగా అడిగితే బెంగళూరు వెళ్లి దాక్కున్నాడు: కంచ ఐలయ్యపై పరిపూర్ణానంద స్వామి

అన్యమతస్తుడైన కంచ ఐలయ్య హిందువులపై వివాదాస్పద పుస్తకం రాశారని, దీనిపై తాము నిలదీయడంతో బెంగళూరులోని అజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయారని శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి సోమవారం విమర్శించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అన్యమతస్తుడైన కంచ ఐలయ్య హిందువులపై వివాదాస్పద పుస్తకం రాశారని, దీనిపై తాము నిలదీయడంతో బెంగళూరులోని అజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయారని శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి సోమవారం విమర్శించారు.

'కోమట్లు పుస్తకంపై పరిపూర్ణానందకేం సంబంధం, యోగిలా సీఎం కావాలనుకుంటున్నారు''కోమట్లు పుస్తకంపై పరిపూర్ణానందకేం సంబంధం, యోగిలా సీఎం కావాలనుకుంటున్నారు'

 ఊరేగింపు కార్యక్రమంలో పరిపూర్ణానంద

ఊరేగింపు కార్యక్రమంలో పరిపూర్ణానంద

శరన్నవరాత్రులను పురస్కరించుకుని తాడేపల్లిగూడంలో వాసవీ కన్యకా పరమేశ్వరీ పంచాయతన క్షేత్రంలోని అమ్మవారిని వెండి రథోత్సవంపై సాయంత్రం వూరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పరిపూర్ణానంద స్వామి జెండా ఊపి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

హిందూ వ్యవస్థను కించపరిస్తే ఊరుకునేది లేదు

హిందూ వ్యవస్థను కించపరిస్తే ఊరుకునేది లేదు

ఐలయ్య పుస్తకంలోని విషయాల వల్ల ఆర్య వైశ్యుల మనోభావాలు దెబ్బ తిన్నాయని పరిపూర్ణానంద స్వామి చెప్పారు. అన్యమతాల వారు ఎవరైనా సరే హిందువులు, హిందూ వ్యవస్థను కించపరిచేలా పుస్తకాలు రాస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

కించపరిచి, ముప్పు ఉందంటున్నారు

కించపరిచి, ముప్పు ఉందంటున్నారు

వైశ్యులపై వివాదాస్పద పుస్తకం రాసిన ఐలయ్యను తాము నిలదీయడంతో బెంగళూరులోని అజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయారని, పైగా ఆయన హిందువుల నుంచి తనకు ముప్పుందని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందని పరిపూర్ణానంద స్వామి ఎద్దేవా చేశారు.

కొన్ని శక్తులకు అమ్ముడుపోయానని ఐలయ్యే చెప్పారు

కొన్ని శక్తులకు అమ్ముడుపోయానని ఐలయ్యే చెప్పారు

తాను నీతి, నిజాయితీ, నిబద్ధతలను విడనాడి కొన్ని శక్తులకు అమ్ముడుపోయానని కంచ ఐలయ్య స్వయంగా చెబుతున్నారని పరిపూర్ణానంద అన్నారు. దీనీలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తాను నిర్వహిస్తున్న సర్వజన సంఘటన్‌ ద్వారా ఇప్పటికే తాము 267 గ్రామాలను దత్తత తీసుకున్నామన్నారు. తాడేపల్లిగూడెంలో మరో 20 గ్రామాలను దత్తత తీసుకునే విధంగా ఆర్యవైశ్యులు ముందుకు రావాలన్నారు.

వైశ్యుల మనోభావాలు దెబ్బతినేలా

వైశ్యుల మనోభావాలు దెబ్బతినేలా

ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినేలా కంచె ఐలయ్య రచనలు చేయడం తగదని పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఆర్య వైశ్యులు వ్యాపారాలు చేసుకుంటూ సమాజసేవ చేస్తున్నారని, అటువంటి ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. తాను గురుకులాలను ప్రోత్సహిస్తూ మరుగునపడుతున్న సంస్కృతి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నానని చెప్పారు.

English summary
Sree peetham Paripoornananda Swami warns controversial writer Kancha Ilaiah on Sunday in Tadepalligudesm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X