హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాధను దిగమింగి: సుహాసిని కోసం పరిటాల సునీత పాదయాత్ర, తారక్ ప్రచారం

|
Google Oneindia TeluguNews

కూకట్‌పల్లి: మహాకూటమి (ప్రజా ఫ్రంట్) పొత్తులో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా మంగళవారం నాడు పలువురు ప్రముఖులు ప్రచారం చేశారు. ఏపీ మంత్రి పరిటాల సునీత, నటుడు తారకరత్న తదితరులు నియోజకవర్గంలో పర్యటించారు.

నందమూరి సుహాసినికి మరోసారి చేదు అనుభవం, అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్నందమూరి సుహాసినికి మరోసారి చేదు అనుభవం, అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్

నందమూరి బిడ్డను గెలిపించాలి

నందమూరి బిడ్డను గెలిపించాలి

పరిటాల సునీత పాదయాత్రలో పాల్గొన్నారు. నందమూరి బిడ్డను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సుహాసిని మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుకట్‌పల్లి టీడీపీకి కంచుకోట అన్నారు. ఆమె గెలుపు కోసం అందరూ ముందుకు వస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ సమస్యలు, మహిళల కష్టాల పరిష్కారంలో సుహాసిని ముందుంటారనే నమ్మకం అందరికీ ఉందన్నారు.

బాధను మింగి ప్రచారం

బాధను మింగి ప్రచారం

సుహాసిని భారీ మెజార్టీతో గెలుస్తారని పరిటాల సునీత అన్నారు. కూటమిలో మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలోను ఇక్కడ ప్రచారం చేశానని చెప్పారు. తండ్రిని పొగోట్టుకొని ఈ సమయంలో ప్రచారానికి రావడానికి ఆమె ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ఇది అందరికీ బాధకర విషయమన్నారు.

 భారీ మెజార్టీతో గెలిపించాలి

భారీ మెజార్టీతో గెలిపించాలి

తన భర్త పరిటాల రవి చనిపోయినప్పుడు నాడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తాను బయటకు రావాలంటేనే భయపడ్డానని సునీత చెప్పారు. చంద్రబాబు ఆశీస్సులు, టీడీపీ అండదండలతో తాను ఆ రోజు గెలిచానని చెప్పారు. సుహాసిని నందమూరి ఆడపడుచు అని, అందుకే సుహాసిని గెలుపు కోసం అందరూ ముందుకు వస్తున్నారని చెప్పారు. సుహాసిని భారీ మెజార్టీతో గెలిపించాలని అందరూ కోరుకుంటున్నారన్నారు.

 చంద్రబాబు జోక్యం చేసుకోరు

చంద్రబాబు జోక్యం చేసుకోరు

ఏపీలో చంద్రబాబు మహిళలకు ఎక్కువ సీట్లు, కేబినెట్లోను ప్రాధాన్యత కేటాయించిన గొప్ప నాయకుుడ చంద్రబాబు అని సునీత అన్నారు.కేసీఆర్ కేబినెట్లో ఒక్క మహిళ లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలో కూటమి గెలిస్తే చంద్రబాబు పాలిస్తారనేది వట్టి ప్రచారమేనని ఆమె కొట్టి పారేశారు. చంద్రబాబు అలా చేయరని అన్నారు. తాము మంత్రులుగా ఉన్నామని, తమ అంశాల్లోనే ఆయన జోక్యం చేసుకోరని చెప్పారు.

సుహాసిని ముందడుగు వేసింది

సుహాసిని ముందడుగు వేసింది

ఓ వైపు తండ్రిని, మరోవైపు సోదరుడిని పోగొట్టుకొని సుహాసిని ముందుకు అడుగు వేసిందని పరిటాల సునీత చెప్పారు. ఆమె అడుగేసింది ప్రజల కోసం అన్నారు. ఆమె తిరగకపోయినా ప్రజలు నందమూరి వెన్నంటే ఉంటారని చెప్పారు. సుహాసిని మాకు కొత్త కాదని, ఆ ప్యామిలీలో నేనూ సభ్యురాలిగా ఉంటానని చెప్పారు. సుహాసిని మాట్లాడుతూ.. సునీత పెద్ద నాయకురాలు అని, ఆమె ఓ ఆడపడుచుగా తనకు మద్దతుగా వచ్చారని, అందుకు ఆమెకు థ్యాంక్స్ అన్నారు.

 తారకతర్న ప్రచారం

తారకతర్న ప్రచారం

నందమూరి సుహాసిని తరఫున ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న కూడా ప్రచారం నిర్వహించారు. ఆమెను అద్భుత మెజార్టీతో గెలిపించాలని కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన పాదయాత్ర చేసి ప్రచారం నిర్వహించారు.

English summary
Andhra Pradesh Minister Paritala Sunitha campaign for Nandamuri Suhasini in Kukatpally on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X