వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్న కులాలపై చిల్లర కామెంట్లు: క్షమాపణలు చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి

|
Google Oneindia TeluguNews

అయోధ్య రామ మందిరంపై పరకాల ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వరంగల్‌లో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం జరిగిన మరో కార్యక్రమంలో చాలా సున్నితమైన అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివాదం చెలరేగడంతో చివరికాయన క్షమాపణలు చెప్పారు..

 </a></strong><strong><a class=టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ దాడి -మందిరం పేరుతో చందాల దందాలన్న ధర్మారెడ్డి వ్యాఖ్యలతో.." title=" టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ దాడి -మందిరం పేరుతో చందాల దందాలన్న ధర్మారెడ్డి వ్యాఖ్యలతో.." /> టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ దాడి -మందిరం పేరుతో చందాల దందాలన్న ధర్మారెడ్డి వ్యాఖ్యలతో..

కులాలపై అనుచిత వ్యాఖ్యలు

కులాలపై అనుచిత వ్యాఖ్యలు

ఆదివారం హన్మకొండలో జరిగిన ఓసీల రాష్ట్ర మహా గర్జన సభలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. 99 శాతం మార్కులు వచ్చిన అగ్రకులాల వారికి ఉద్యోగాలు రావడంలేదని, చదువు సరిగ్గారాని తక్కువ కులంవారు వాటిని పొందుతున్నారని వివాదాస్పదంగా మాట్లాడారు. రాష్ట్రం మొత్తం నాశనమయ్యేందుకు ఇలాంటి ఆఫీసర్లే కారణమని అన్నారు.

పనికి మాలిన వాళ్లకు ఉద్యోగాలు

పనికి మాలిన వాళ్లకు ఉద్యోగాలు

''ఓ రోజు మా నియోజకవర్గంలో అందరు ఏఈలు కలిసి నా దగ్గరకు వచ్చారు. ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి.. 'సార్‍ మా దగ్గర మంచి ఆఫీసర్ ఉన్నాడు. మీ దగ్గర పెట్టుకొండని కోరితే పెట్టుకున్న. తీరా అతణ్ని పిలిచి మాట్లాడితే. ఒక్క అక్షరం ముక్క కూడా సరిగ్గా రాదు. ఇదే విషయాన్ని ఆయన్ను పెట్టించిన వాళ్లను అడిగా. అడిగితే.. 'ఏంలేదు సార్‍.. మీరు ఫైల్‍ తీసుకెళ్లి ఎక్కడ సంతకం పెట్టుమంటే అక్కడ పెడతడు. ఎక్కువ తెలివి ఉంటే అడ్డం తిరుగుతరు సార్. ఈయన మంచోడు. అవేం అడగడు. అంటూ నాతో అన్నారు. ఆ ఆఫీసర్‌ను ఏం అడిగినా.. నాకు తెలియదని అంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నతాధికారి అయ్యాడు.' అని ఎమ్మెల్యే ధర్మారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

అంబేద్కర్ రిజర్వేషన్లు..

అంబేద్కర్ రిజర్వేషన్లు..

అంతేకాక, ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో ఏ ఆఫీస్‌కు పోయినా ఉన్నతాధికారులు ఇలాంటి వారే ఉన్నారని అన్నారు. ''పని రాదు.. చివరికి జిల్లా అధికారులు కూడా వాళ్లే ఉన్నారు. రాష్ట్రం మొత్తం నాశనం అవడానికి ఇలాంటి ఉన్నతాధికారులే కారణం" అని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్ల వాళ్లు రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇలా రిజర్వేషన్లు పొందుతూ నేను తప్ప ఇంకొకరు బాగుపడొద్దన్న ధోరణిలో వాళ్లు ఉన్నారు. ఒకరికి రిజర్వేషన్‌ వల్ల మంచి స్థితి వస్తే ఇక ఆ కుటుంబానికి రిజర్వేషన్ అవసరం లేదని నేను వాదిస్తా. ఎప్పుడో వచ్చిన ఈ రిజర్వేషన్లను మార్చాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరుతున్నా.'' అని చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. చివరికి దీన్ని కాంటవర్సీ చేయొద్దని.. ఇదంతా అగ్రకులాల ఆవేదన అంటూ చెప్పుకొచ్చారు.

క్షమాపణలు కోరిన ఎమ్మెల్యే..

క్షమాపణలు కోరిన ఎమ్మెల్యే..

ఓసీ మహాగర్జన సభలో మాట్లాడిన తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. తనపై బురదజల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యలు తప్పైతే ఆ వ్యాఖ్యలను విరమించుకుంటున్నానని ప్రకటించారు. నా వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై వివరించే క్రమంలో అలా మాట్లాడానని ధర్మారెడ్డి చెప్పారు.

తల్లిని చంపి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్నాడు -సగం కాలిన శవంతో దొరికిపోయి..తల్లిని చంపి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్నాడు -సగం కాలిన శవంతో దొరికిపోయి..

Recommended Video

#TOPNEWS: #Vizag విశాఖపట్నంలో మరో భారీ అగ్నిప్రమాదం | చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య !

English summary
parakala trs mla dharma reddy has apologises for derogatory comments. earlier bjp activists attacks mla's house in hanamkonda on sunday. speaking to media on monday, dharmareddy says, his comments were mislead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X