• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సింహం సింగిల్‌గానే..: ఆ రోజే కొత్త పార్టీ, జెండా, ఏజెండా ప్రకటిస్తానంటూ షర్మిల, కాంగ్రెస్, బీజేపీపైనా ఫైర్

|

ఖమ్మం: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజల తరపున నీలదీసేందుకే తాను ఇక్కడ పార్టీ పెట్టబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలో నిర్వహించిన ప్రజాసంకల్ప సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీలపైనా షర్మిల్ విమర్శలు గుప్పించారు.

దొరగారి ఎడమకాలి చెప్పుకింద ఆత్మగౌరవం: 'కల్వకుంట్ల' అంటూ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలుదొరగారి ఎడమకాలి చెప్పుకింద ఆత్మగౌరవం: 'కల్వకుంట్ల' అంటూ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

ఎమ్మెల్యేలను సప్లై చేసే కంపెనీగా కాంగ్రెస్.. బీజేపీపైనా విమర్శలు

ఎమ్మెల్యేలను సప్లై చేసే కంపెనీగా కాంగ్రెస్.. బీజేపీపైనా విమర్శలు

కేసీఆర్ సర్కారును కాంగ్రెస్ పార్టీ నిలదీయదు.. ఎందుకంటే.. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలను సప్లై చేసే కంపెనీగా మారిందని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ అమ్ముడుపోయింది కనుక.. కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడదని అన్నారు. ఇక బీజేపీ మాట్లాడినా మతత్వం గురించి మాట్లాడుతుందన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలేమయ్యాయని ప్రశ్నించారు. పసుపు బోర్డు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఏవని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేదన్నారు. అంతర్గతంగా అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలేనని అన్నారు.

ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనంటూ షర్మిల

ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనంటూ షర్మిల

పాలక పక్షాన్ని ప్రశ్నించేందుకు ప్రజల పక్షాన గొంతు ఉండాలో వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలని షర్మిల అన్నారు. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఇష్టం ఉన్నా లేకపోయినా.. తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే అని అన్నారు. ఇక్కడి గాలి పీల్చి ఇక్కడే పెరిగానని, ఇక్కడే కొడుకు, కూతుర్ను కన్నానని.. ఈ గడ్డ మీదే బతికానని చెప్పారు. ఈ గడ్డ రుణం తీసుకునేందుకు సేవ చేయాలనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. బరాబర్ తెలంగాణలో నిలబడతా.. ప్రజల కోసం కోట్లడతా? అని షర్మిల చెప్పారు. పదవులు వచ్చినా రాకపోయినా పోరాడతానని అన్నారు. అవకాశం ఇవ్వాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.

సింహం సింగిల్‌గానే వస్తుందన్న షర్మిల..

సింహం సింగిల్‌గానే వస్తుందన్న షర్మిల..

‘సింహం సింగిల్ గానే వస్తుంది. మేము టీఆర్ఎస్ చెబితే రాలేదు. బీజేపీ అడిగితే రాలేదు. కాంగ్రెస్ పంపితే రాలేదు. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజాబాణమై వస్తున్నా. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నా.. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వస్తున్నా. మా పార్టీ ఏ పార్టీ కిందా పనిచేయదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే చిత్తశుద్ధితో పనిచేస్తుందని మాట ఇస్తున్నా' అని వైఎస్ షర్మిల చెప్పారు.

తెలంగాణకు చెందిన ఒక్క నీటిబొట్టునూ వదులుకోం..

తెలంగాణకు చెందిన ఒక్క నీటిబొట్టునూ వదులుకోం..

తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే తప్పకుండా ప్రశ్నిస్తామని షర్మిల తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులను అడ్డుకుంటుందా? అనే అనుమానాలు అవసరం లేదన్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఒక్క నీటి బొట్టునూ వదులుకోమని స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం కలిగించే ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటామన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల కోసం తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. తమది తెలంగాణ ప్రజల పార్టీ అని అన్నారు. ప్రజల ఆశీస్సులు అవసరం అన్నారు. నేటి కార్యకర్తలే.. రేపటి నాయకులు అని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ డబ్బుకు, మదానికి భయపడొద్దని.. కష్టమొస్తే తానున్నాని చెప్పారు. మీకు నేనున్నా.. నాకు మీరున్నారు.. రాజన్న ధైర్యం.. దేవుడిపై విశ్వాసం ఉంది అని షర్మిల వ్యాఖ్యానించారు. చేయి చేయి కలిపితే రాజన్న సంక్షేమ రాజ్యం వస్తుందన్నారు.

జులై 8న కొత్త పార్టీ, జెండా, ఏజెండా ప్రకటిస్తానంటూ వైఎస్ షర్మిల

జులై 8న కొత్త పార్టీ, జెండా, ఏజెండా ప్రకటిస్తానంటూ వైఎస్ షర్మిల

ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడం కోసం.. తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాబోయే వైఎస్ జయంతి జులై 8, 2021న కొత్త పార్టీ ఆవిష్కరణ జరుగుతుందని వైఎస్ షర్మిల తెలిపారు. పార్టీ పేరును, జెండా, ఏజెండాను ప్రకటిస్తామని చెప్పారు. కేసీఆర్ సర్కారు లక్షా 91వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇక ఆత్మహత్యలు ఆగిపోవాలన్నారు. మరో చావు కబురు తమ చెవిన పడకూడదన్నారు. కేసీఆర్ నిద్ర లేపి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని.. లేదంటే ఏప్రిల్ 15 నుంచి నిరాహార దీక్షకు దిగుతామన్నారు. మూడు రోజులపాటు హైదరాబాద్‌లో నిరహార దీక్ష చేపడతామని, తాను కూడా దీక్షలో కూర్చుంటానని చెప్పారు షర్మిల. 4వ రోజు నుంచి జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలు రిలే నిరహార దీక్షలు చేపట్టాలని, ఇవి నోటిఫికేషన్లు విడుదలయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. జై వైయస్సార్.. జై తెలంగాణ అంటూ షర్మిల తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, షర్మిల మాట్లాడుతున్న సమయంలో సీఎం సీఎం అంటూ అభిమానులు కేకలు పెట్టారు. జై జగన్ అనే నినాదాలు కూడా ఈ సభలో వినిపించడం గమనార్హం.

English summary
party name will announce on july 8th: ys sharmila hits out at cm kcr and his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X