వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స‌మ‌స్య‌లున్నా ఆద‌ర‌ణ‌..! ధ‌ర ఎక్కువైనా భ‌రిస్తున్న జ‌నం.! మెట్రో పై ప్ర‌జా స్పంద‌న..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో ప్ర‌తిస్టాత్మ‌కంగా ప్రారంభ‌మైన మెట్రొ రైల్ పైకి విజ‌య‌వంత‌మైన‌ట్టు క‌నిపిస్తున్నా అంత‌ర్గ‌తంగా మాత్రం ఎన్నో లోపాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. యాజ‌మాన్యం మాత్రం మెట్రో విజ‌యాన్ని త‌మ ఖాతాలో వేసుకునేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికి ఇది ముమ్మాటికి ప్రయాణికుల విజ‌యంగా తెలుస్తోంది. న‌గ‌ర ప్ర‌జ‌లు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న‌ప్ప‌టికి అదిక ధ‌ర‌న‌నై ప‌ట్టించుకోకుండా మెట్రోలో ప్ర‌యాణం చేస్తూ విజ‌య‌వంతం చేసార‌నేది వాస్త‌వం. ఇదే అంశాన్ని మెట్రో యాజ‌మాన్య తమ ఘ‌న‌కార్యంగా చిత్రీక‌రించుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

 స‌మ‌స్య‌ల మెట్రో..! క‌ప్పిపుచ్చుకే ప్ర‌య‌త్నంలో యాజ‌మాన్యం..!!

స‌మ‌స్య‌ల మెట్రో..! క‌ప్పిపుచ్చుకే ప్ర‌య‌త్నంలో యాజ‌మాన్యం..!!

గ‌త నెల‌లో మెట్రో మొద‌లై 30రోజులు గ‌డ‌వ‌క ముందే హైదరాబాద్ మెట్రోలో మళ్లీ సమస్య వచ్చి పడింది. మరోసారి మెట్రో పరుగులకు బ్రేకులు పడ్డాయి.వాయు కాలూశ్యం పేరుతో సుమారు గంట పాటు రైళ్లు కదల్లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే వాతావ‌ర‌ణం లో లోపం వచ్చినట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. సమస్యను సరిచేసేందుక కొంత స‌మ‌యం ప‌ట్టింద‌ని మెట్రో సిబ్బంది వివ‌ర‌ణ ఇచ్చ‌కునే ప్ర‌య‌త్నం చేసింది.

సాంకేతిక లోపంతో మొరాయిస్తున్న ట్రైన్లు..! చిరాకు ప‌డుతున్న ప్ర‌యాణికులు..!!

సాంకేతిక లోపంతో మొరాయిస్తున్న ట్రైన్లు..! చిరాకు ప‌డుతున్న ప్ర‌యాణికులు..!!

మరోవైపు సాంకేతిక సమస్యతో ప్రస్తుతం అరగంట ఆలస్యంగా మెట్రో ట్రైన్స్ నడుస్తున్నాయి. ఉదయం ఎల్బీ నగర్ నుంచి మియాపూర్‌కు గంటలోపే చేరుకోవాల్సిన ట్రైన్ ...రెండుగంటల సమయాన్ని తీసుకుంది. దీంతో తమ ప్రయాణం ఆలస్యం అవుతుండటంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని మెట్రో అధికారులు చెబుతున్నారు.

మెట్రో ముమ్మాటికి ప్ర‌జా విజ‌య‌మే..! త‌న ఖాతాలో వేసుకునేందుకు యాజ‌మాన్యం తాప‌త్ర‌యం..!

మెట్రో ముమ్మాటికి ప్ర‌జా విజ‌య‌మే..! త‌న ఖాతాలో వేసుకునేందుకు యాజ‌మాన్యం తాప‌త్ర‌యం..!

ఇంత ప్ర‌తికూల ప‌రిస్థితులు త‌లెత్తుతున్నా మెట్రోరైలుకు ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని మెట్రో యాజ‌మాన్యం చెప్పుకోవ‌డం హాస్యాస్పంగా ఉంది. ఏడాది లోపే 3 కోట్ల మంది ప్రయాణించిన మైలురాయిని హైదరాబాద్‌ మెట్రో చేరుకుందని సొంత డ‌బ్బా కొట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. మియాపూర్‌ నుంచి నాగోలు వరకు 30 కిలోమీటర్ల మెట్రోరైలు మార్గాన్ని గత ఏడాది నవంబరు 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన‌ప్ప‌టికి ఎన్నో అవాంత‌రాల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆ రూట్ లో ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ లేక కొన్ని నెల‌లుగా ఇబ్బందులు ప‌డింది మెట్రో.

 లోపాల‌ను అదిగ‌మించాలంలున్న ప్ర‌యాణికులు..! కాలూష్య కార‌ణం ఏంట‌ని ప్ర‌శ్న‌..!!

లోపాల‌ను అదిగ‌మించాలంలున్న ప్ర‌యాణికులు..! కాలూష్య కార‌ణం ఏంట‌ని ప్ర‌శ్న‌..!!

ఈ ఏడాది సెప్టెంబరు 24న అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు మరో 16 కిలోమీటర్ల మార్గాన్ని గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. అప్ప‌టినుండి మెట్రోకి తిరుగులేకుండా పోయింది. ఇత‌ర ప‌ట్ట‌ణాల‌నుండి నుండి న‌గ‌రంలోకి ప్ర‌వేశించే మార్గంలో మెట్రో మొద‌ల‌య్యే స‌రికి సుదూర ప్రాంతాల‌నుండి న‌గ‌రానికి వ‌చ్చే వారికి ఎంతో సులువుగా మారింది. దీంతో టికెట్ ధ‌ర ఎంతైనా పట్టించుకోకుండా ప్ర‌యాణికులు మెట్రోని విజ‌య‌వంతం చేసారు. ఇక శిల్పారామం- అమీర్ పేట రూటులో మెట్రో ప్రారంభం ఐతే ప్ర‌యాణికుల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని తెలుస్తోంది.

English summary
Metro Rail, which started in Hyderabad, seems to be successful. There seems to be a lot of defects inside. Even though the management is making efforts to get the Metro victory in their account. It seems to be the success of passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X